»   » సల్మాన్ కేసు‌: అభిజిత్‌ ట్వీట్ పై సోనాక్షి సిన్హా సీరియస్ వార్నింగ్

సల్మాన్ కేసు‌: అభిజిత్‌ ట్వీట్ పై సోనాక్షి సిన్హా సీరియస్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సల్మాన్‌ఖాన్‌కు హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అయిదేళ్ల జైలు శిక్ష పడడంతో బాలీవుడ్‌ భారీ ఎత్తున విచారం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. అక్కడ సెలబ్రెటీలు ట్విట్టర్‌లో పలురకాలుగా ట్వీట్లు రాశారు. సల్మాన్‌ శిక్షపై స్పందిస్తూ బాలీవుడ్‌ గాయకుడు అభిజిత్‌ ఫుట్‌పాత్‌లు ఉన్నవి పడుకోవడానికా..? ఫుట్‌పాత్‌లపై పడుకోవడం కూడా నేరమేనని ట్వీట్‌ చేశారు. సినిమా రంగంలో 80శాతం మంది ఎంతో కష్టపడి స్టార్‌డమ్‌ సాధించారని, ఎప్పుడూ రోడ్లపై పడుకోలేదని అన్నారు. అంతేకాదు ఆ ట్వీట్ కు సోనాక్షి సిన్హాను ట్యాగ్ చేసారు. ఈ విషయమై సోనాక్షి మండిపడుతూ ట్వీట్ చేసింది.

సోనాక్షి ట్వీట్ లో..." నేను నా ఫ్రెండ్ ని సపోర్టు చేస్తాను... కాని ఇలాంటి ఇన్ సెన్సిటివ్, నెగిటివ్ టాక్ ని మాత్రం కాదు ..దయచేసి నన్ను మీ ట్వీట్స్ కు ట్యాగ్ చేయకండి అభిజిత్ సార్..." అంటూ ఘాటుగా స్పందించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Sonakshi Sinha Lashes Out At Abhijeet For His Tweet On Salman Verdict

ఇక సల్మాన్‌ఖాన్‌కు హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అయిదేళ్ల జైలు శిక్ష పడడంతో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర విచారంలో ఉన్నారు. ఆయన తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు. తీర్పు విషయం తెలియగానే సల్మాన్‌తో, ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉండే ప్రీతి జింటా, సోనాక్షి సిన్హా హుటాహుటిన ముంయిలోని సల్మాన్‌ ఇంటికి చేరుకున్నారు. సల్మాన్‌ తల్లి సల్మా ఖాన్‌ను ఓదార్చారు.

మరో ప్రక్క తమ కుటుంబం ఇప్పుడిక భారం అంతా దేవుడి మీదే వేసిందని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ సోదరి అర్పితాఖాన్‌ అన్నారు. 'హిట్‌ అండ్‌ రన్‌' కేసులో సల్మాన్‌ఖాన్‌కి 5ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. కష్టసమయంలో తమకు అండగా నిలిచిన అందరికీ ఈ సందర్భంగా అర్పితాఖాన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

నిన్నటి రోజు ఎన్నో ఒడిదొడుకులతో గడిచిందని, ఇక ముందు అంతా మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని అర్పిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నిన్న సల్మాన్‌ కోర్టుకు హాజరైనప్పుడు ఇద్దరు సోదరులు, చెల్లెళ్లు, తల్లిదండ్రులు ఆయన వెంట ఉన్నారు.

ఈ కేసు విషయంలో ప్రభుత్వానిదే బాధ్యత అని డిజైనర్‌ ఫరాఅలీఖాన్‌ ట్వీట్‌ చేశారు. ప్రజలకు నివాస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని.. ఫుట్‌పాత్‌లపై పడుకోవడం చాలా ప్రమాదకరం అని అన్నారు.

బాలీవుడ్‌ చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌, నటి సుస్మితా సేన్‌ తదితరులు సల్మాన్‌, ఆయన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నామని.. వారికి ధైర్యం చేకూరాలని ట్వీట్‌ చేశారు. సల్మాన్‌కు మద్దతుగా సోనాక్షి సిన్హా, అలియా భట్‌, సతీష్‌ కౌషిక్‌, అర్జున్‌ కపూర్‌, రిషి కపూర్‌, ఆయుష్‌ శర్మ మరికొందరు బాలీవుడ్‌ ప్రముఖులు ట్వీట్‌ చేశారు.

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు కోర్టు ఐదేళ్లు శిక్ష విధించి రెండు రోజులు మధ్యంతర బెయిలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఒక న్యాయవాది గురువారంనాడు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సల్మాన్‌ ఖాన్‌పై వచ్చిన అభియోగాలన్నీ రుజువైనట్టు కోర్టు తీర్పు చెప్పిన అనంతరం మళ్లీ బెయిల్‌ ఇవ్వడాన్ని ఆ న్యాయవాది ఆక్షేపించారు. సల్మాన్‌ ఖాన్‌ బెయిలును వెంటనే రద్దు చేసి ఆయనకు విధించిన జైలుశిక్షను అమలు చేయాలని ఆయన కోరారు.

English summary
sonakshisinha tweeted "I support my friend but i would never support such insensitive and negative talk. Please dont tag me in ur tweets abhijeetsinger sir."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu