»   » అకీరా ఆట పాట (వీడియో)

అకీరా ఆట పాట (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సొనాక్షి సిన్హా మెదటి సారిగా అకీరా అనే టైటిల్ తో రూపొందుతున్న మహిళా ఒరియంటెడ్ ఉన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మురుగదాస్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబందించిన వీడియో ఒకటి యూట్యూబ్‌ ద్వారా విడుదల చేశారు. ఇందులో సోనాక్షి డాన్స్ ని మీరు చూడవచ్చు. దీనికి సంబందించిన వీడియో ఇక్కడ చూడండి.

ఈ పాటని మీట్‌ బ్రోస్‌, టీ సిరీస్‌ సంయుక్తంగా రూపొందించాయి. కుమార్‌ ఈ పాటకి బాణీలు సమకూర్చగా.. మీట్‌ బ్రోస్‌ సంగీతం అందించారు. గుల్షన్‌ కుమార్‌ ఈ వీడియో పాటని సమర్పిస్తున్నారు.

Sonakshi Video Song 'Aaj Mood Ishqholic Hai' super

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అకీరా పేరు ఖరారు చేశారు. తనను కష్టాల పాల్జేసిన శక్తులపై పోరాడే అకీరా పాత్రలో సోనాక్షి నటిస్తుంది. బాలీవుడ్‌లో మురుగదాస్‌కు ఇది మూడో చిత్రం. ఈసారి కూడా ప్రధాన పాత్రదారి పేరునే సినిమాకు టైటిల్‌గా నిర్ణయించాడు మురుగదాస్. ఇంతకుముందు అతను హిందీలో గజిని, హాలీడే వంటి సినిమాలు చేశాడు.

సోనాక్షి సిన్హా మొదటిసారిగా యాక్షన్ ప్రదాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ముంబై, రాజస్తాన్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. మురుగదాస్ గత చిత్రాల మాదిరే దీనిలో కూడా సామాజిక సందేశం ఉంటుందని బాలీవుడ్‌లో టాక్. ఈసారి దేశంలో నేటి మహిళ భద్రతపై మురుగదాస్ దృష్టి పెట్టాడు

English summary
Gulshan Kumar presents, Bhushan Kumar's AAJ MOOD ISHQHOLIC HAI Full Video song featuring Sonakshi Sinha in the music of Meet Bros, lyrics of Kumaar in the voice of Meet Bros & Sonakshi Sinha exclusively on T-Series.
Please Wait while comments are loading...