»   » సల్మాన్‌ ఖాన్‌ను దక్కించుకున్న సోనమ్ కపూర్!

సల్మాన్‌ ఖాన్‌ను దక్కించుకున్న సోనమ్ కపూర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అనిల్ కపూర్ వారసురాలిగా తెరంగ్రేటం చేసిన హీరోయిన్ సోనమ్ కపూర్ ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు ఆరేళ్లపైనే అయింది. అయితే అమ్మడుకి మాత్రం ఇప్పటి వరకు సరైన గుర్తింపు రాలేదు. ఏ ఒక్క స్టార్ హీరోతో నటించే అవకాశం రాక పోవడంతో స్టార్ హీరోయిన్ హోదా కూడా సొంతం చేసుకోలేక పోతోంది.

అయితే సోనమ్ కపూర్‌కు 2014 సంవత్సరం ఒక గ్రేట్ ఇయర్‍‌గా మారబోతోంది. ఇప్పటికే ఆమె ఈ సంవత్సరం షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కే 'Raes' చిత్రంలో అవకాశం దక్కించుకుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సూరజ్ భరతజ్య దర్శకత్వం వహించనున్నారు.

దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత సల్మాన్ ఖాన్, సూరజ్ భరతజ్య కాంబినేషన్లో సినిమా రాబోతోంది. వీరి చివరి చిత్రం 'హమ్ సాత్ సాత్ హై'. రంఝానా చిత్రంలో సోనమ్ కపూర్ నటన నచ్చడంతో సూజర్ ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో పాత్రతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా సరైన ప్రాధాన్యం ఉంటుందట.

ఈ చిత్రానికి బడే భయ్యా అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సూరజ్ ఆర్ భరత్యాజకు ఇది కెరీర్లో 7వ చిత్రం. త్వరలో ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా ఎలాంటి విషయాలు మాట్లడకూడదని సోనమ్ నిర్ణయించుకున్నట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు.

English summary
Sonam Kapoor is one of the most sought after female lead actors in Bollywood right now, with two megastar films in her kitty. For Gorgeous Delhi 6 star, 2014 is going to be a great year. She is already signed up for Shahrukh Khan's Raes and now reportedly bagged a Salman Khan film, directed by Suraj Bartajya who delivered three blockbusters back to back with Salman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu