»   » కన్న తండ్రిని నా పాలిటి విలన్ అనేసింది.. పాపం అనీల్ కపూర్

కన్న తండ్రిని నా పాలిటి విలన్ అనేసింది.. పాపం అనీల్ కపూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారనం గా స్టార్ కిద్ అనగానే వారసత్వం వల్ల అవకాశాలు వస్తాయనీ కెరీర్ ఆరంభం లో ఫ్లాప్ లతో సంబందం లేకుండా ఆఫర్లు అందుకోవచ్చనీ అనుకుంటారు. వారసులకి తండ్రుల ఫాలోయింగ్ బాగానే పనికి వస్తుంది. అయితే ఈ ఉపయోగాలన్నీకొడుకులకేనట. స్టార్ వారసురాళ్ళకి మాత్రం ఆ వారతవమే శాపం అట. ఈ మాతలన్నది ఎవరో కాదు.. బలీవుడ్ లో ఇప్పటి బక్క పిల్ల సోనమ్ కపూర్.

అనీల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్ కెరీర్ మొత్తం వాళ్ళ నాన్న వల్లే జరిగింది అనుకుంటాం గానీ... ఆమె మొదటి సినిమా సావరియా దగ్గరినుంచీ ఇప్పటివరకూ మరీ ఫ్లాప్ లు లేకపోయినా బ్లాక్ బస్టర్ హిత్ కూడా ఏమీ లేవు సల్మాన్ ఖాన్ తో కలిసి చేసిన "ప్రేమ్ రతన్ ధన్ పాయో" మినహా ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ సూపర్ హిట్ లేమీ పడలేదు.

Sonam Kapoor recently revealed that she lost many films because of her father Anil Kapoor

ఈ విషయాలపైనే తాజాగా సోనమ్ స్పందించింది. తన కెరీర్ ఇలా ఉండడానికి తన తండ్రే కారణమని అంటోంది. అవును... అనిల్ కపూర్ కూతురు కావడం వల్లే తనకు చాలా ఛాన్సులు చేతికందకుండా పోయాయని సోనమ్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అదేలా..? అనీల్ అంత ఎంకరేజ్ చేసిమరీ వెండితెర మీద నటించటానికి ఒప్పుకుంటే తండ్రినే ఇంత మాట అనేసిందేమిటీ అనుకుంటే... సోనమ్ వాదన కూడా వినాల్సిందే...

తాను అనీల్ కపూర్ కూతురు అవ్వడం వల్ల ప్రేమ్ రతన్ ధన్ పాయో కూడా తన చేతినుంచి జారిపోయే పరిస్థితి వచ్చిందట. సల్మాన్ సోనమ్ సరసన నటించననివ్నటించనని తెగేసి చెప్పాడని చివరికి ఎలాగోలా కష్టపడి అంతా బతిమాలితే అప్పుడు ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై సల్మాన్ మరో ఉద్దేశంతో సోనమ్ ని వాదు అనలేదట... "అనిల్ కపూర్ నా క్లోజ్ ఫ్రెండ్. అతడి కుమార్తెతో నేను ఎలా రొమాన్స్ చేయగలను?" అనే కారణం చెప్పిన సల్మాన్ సోనమ్ ని తిరస్కరించాడట.

ఇదే క్రమంలో మరికొంతమంది స్టార్ హీరోలు కూడా తనను హీరోయిన్ గా తీసుకొవడంపై ఇదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. దాదాపు అనీల్ కపూర్ కి మంచి స్నేహితులో.., లేక ఆయన్ని సీనియర్ గా గౌరవంతో చూసే వాళ్ళే కాబట్టి సోనమ్ తో కలిసి రొమాన్స్ చేయటానికి ఇబ్బంది పడుతున్నారట... ఇలా తన కుటుంబ స్టార్ నేపథ్యం తన కేరీర్ కు ఏమాత్రం హెల్ప్ అవ్వడంలేదు సరికదా.. కొన్ని సందర్భాల్లో అడ్డుగా కూడ తయారయ్యిందని వాపోయిందీ బంగారు పాప.

English summary
Sonam Kapoor recently revealed that she lost many films because of her father Anil Kapoor and while citing an example she said that Salman Khan did not want to do Prem Ratan Dhan Payo with her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu