»   » సోనమ్ కపూర్‌కు అతనే భర్త.. తల్లి కన్ఫర్మ్!

సోనమ్ కపూర్‌కు అతనే భర్త.. తల్లి కన్ఫర్మ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ అందాల తార సోనమ్ కపూర్ జీవితంలో తొందరగా సెటిల్ అయిపోతే బాగుంటుందని అనిక్ కపూర్ భార్య, ఆమె తల్లి సునీతా కపూర్ కోరుకొంటున్నది. సోనమ్ కపూర్ బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహుజా అంటే సునీత తెగ ముచ్చటపడిపోతున్నదట.

ఈ ఏడాది చివర్లో సోనమ్ పెళ్లి

ఈ ఏడాది చివర్లో సోనమ్ పెళ్లి

సోనమ్‌కు అహుజా మంచి జోడి అని, తొందరగా పెళ్లి అయితే బాగుంటుదనే భావనలో ఉందట. ఈ ఏడాది చివరికల్లా వివాహం జరిపిస్తే ఓ పనైపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. తల్లి జోరును చూస్తే సోనమ్ వివాహం తొందర్లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బహిరంగంగానే సోనమ్, అహుజా

బహిరంగంగానే సోనమ్, అహుజా

ఇదిలా ఉండగా అహుజా, సోనమ్ బాహాటంగానే తిరుగుతున్నారు. గతేడాది రుస్తుం చిత్ర విజయోత్సవం సందర్భంగా వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అంతేకాకుండా ఈ మధ్య కాఫీ విత్ కరన్ కార్యక్రమంలో అహుజాతో ఉన్న అఫైర్ గురించి కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నపై కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

త్వరలోనే పెళ్లిపై స్పష్టత

త్వరలోనే పెళ్లిపై స్పష్టత

ఇలాంటి పరిస్థితుల్లో తన తల్లి కోరికను సోనమ్ తీరుస్తుందా లేదా కొన్నిరోజులాగితే స్పష్టత రావడం ఖాయం. అంతేకాకుండా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొంటాననే మాటను కూడా చెప్తున్నది.

సోషల్ మీడియాలో జోరుగా పోస్టింగ్

సోషల్ మీడియాలో జోరుగా పోస్టింగ్

తన వ్యక్తిగత జీవితం గురించి గతంలో మాట్లాడటానికి నిరాకరించేది. కానీ ఇటీవల కాలంలో ఆమె ప్రవర్తన పూర్తిగా మారింది. ఈ మధ్య తన బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహుజా గురించి, ఆయన ఫొటోలను సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నది.

English summary
Anil Kapoor's wife Sunita is fond of Sonam's rumoured boyfriend Anand Ahuja. She wants Anand to put a ring on her daughter and the relationship by the end of this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu