Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాక్: స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్‌కు స్వైన్‌ఫ్లూ
రాజ్‌కోట్: ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే హీరోయిన్ కు స్వైన్ ఫ్లూ సోకటం బాలీవుడ్ ని షాక్ కు గురిచేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, నటి అయిన సోనమ్ కపూర్‌కు స్వైన్‌ఫ్లూ సోకింది. వైద్యపరీక్షల్లో ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు శనివారం తేలిందని, ఇక్కడి స్టెర్లింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా కలెక్టర్ మనీష చంద్ర తెలిపారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సోనమ్ ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం ఇక్కడికి వచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోనమ్ కపూర్ తల్లి సునీత శనివారం రాజ్‌కోట్ చేరుకున్నారు. సోనమ్‌ను ముంబయి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

కొద్ది రోజుల క్రితమే...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ హాస్పటల్ లో చేరింది. ఆమె తాజా చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయో షూటింగ్ ఎన్ డి స్టూడియోలో జరుగుతోంది. ఈ లోగా ఆమెకు చాలా అనీజీగా ఉన్నట్లు ఫీలై,కళ్ళు తిరుగుతున్నట్లు ఉండటంతో దగ్గరలో ఉన్న ప్రెవేట్ హాస్పటిల్ కి తీసుకు వెళ్లారు.
ఆమెను పరీక్షించిన డాక్టర్స్ ఆమె రెస్పెక్టరీ ఇన్ ఫెక్షన్ తో భాధపడుతోందని అన్నారు. అది ఆస్మా ఎటాక్ లాంటిదని వివరించారు. ఆమెను రెండు రోజులు ట్రీట్ చేసి సోమవారం రిలీవ్ చేసారు. మరికొద్ది రోజులు ఆమె రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఆమె తాను సిక్ గా ఉన్నట్లు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తెలియచేసింది. ఈ ఫొటోలను ఆమె అప్ లోడ్ చేసి, తను సిక్ గా ఉండటాన్ని హేట్ చేస్తానని అంది.
ఇక ఆ మధ్యన ముంబై రక్షణ ఉందని, డిల్లీ లేదంటూ కామెట్స్ చేసి వార్తలకి ఎక్కిందీమె. దేశ రాజధానిలో ఇటీవల ఓ యువతిపై టాక్సీ డ్రైవర్ లైంగిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బాలీవుడ్ తార సోనమ్ కపూర్, మహిళలకు ఢిల్లీ కంటే ముంబై సురక్షితమని తెలిపింది. గత శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతం వద్ద ఉబర్ కంపెనీకి చెందిన క్యాబ్ ఎక్కిన 25 ఏళ్ల యువతిని ఆ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేశాడనేది ఆరోపణ. దీంతో రాజధానిలో ఉబర్ కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం తన సినిమా ‘ఖూబ్‌సూరత్' డీవీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సోనమ్ ఈ ఘటనపై స్పందించింది.
‘‘జరిగింది దారుణం. ముంబైతో పోలిస్తే ఢిల్లీలో మహిళలు అంత సురక్షితం కాదు. నిజాయితీగా చెప్పాలంటే, ఇందులో ఆ క్యాబ్ కంపెనీ తప్పేమీ లేదు. చాలా రకాలుగా ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ఎందుకంటే ఆ క్యాబ్ డ్రైవర్‌కు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చింది వాళ్లే. అందువల్ల ప్రభుత్వం వైపు నుంచి శిక్షలు, నిబంధనలు మరింత కఠినతరం కావాలి. ఒకవేళ ప్రజా రవాణా వాహనంలో అత్యాచారం జరిగితే, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రభుత్వం నిషేధిస్తుందా?'' అంటూ ప్రశ్నించింది సోనమ్.