»   » బయోపిక్ గా భారతప్రధాని ప్రేమకథ., సోనియా గాంధీ కూడా

బయోపిక్ గా భారతప్రధాని ప్రేమకథ., సోనియా గాంధీ కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి మరో ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీ రెడీ అవుతుందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఓవైపు స్ఫూర్తిని నింపే క్రీడాకారుల జీవిత చరిత్రలతో వరుసగా సినిమాలు తెరకెక్కుతుంటే.. మరోవైపు రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన పలువురి ప్రముఖుల బయోపిక్ లకు రంగం సిద్ధం అవుతుండటం చూస్తున్నాం.

 Sonia-Rajiv's brave love story now comes alive in film

బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు మరో అరుదైన చిత్రం రాబోతుంది. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధి ప్రేమకథ తెరపై చూపించబోతున్నారు. అయితే ఇది షార్ట్ ఫిలిం. అయితే.. బాలీవుడ్ సినిమా కాదు.. ఫక్తు ఇంగ్లీష్ సినిమా. సోనియా - రాజీవ్ ల స్టోరీ అనగానే రాజకీయాలు వంటి ఎన్నో అంశాలు గుర్తుకొస్తాయి. కానీ ఇందులో అలాంటివి ఏమీ ఉండవట .. మొత్తం వారి లవ్ స్టోరీయే ఉంటుందట. రాజీవ్ - సోనియాల మధ్య పరిచయం ఎలా జరిగింది.. ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడింది.. పెళ్లి వరకు అది ఎలా వెళ్లింది.. పేరెంట్సును ఎలా ఒప్పించారు వంటి ప్రతి యాంగిల్ ను టచ్ చేస్తూ సినిమా రూపొందిస్తున్నారట.

 Sonia-Rajiv's brave love story now comes alive in film

సినిమాలో ఎక్కడా రాజకీయ ప్రస్తావన మాత్రం ఉండబోదట. కేవలం వారి ప్రేమకథను మాత్రమే ఆడియన్స్‌కు పరిచయం చేస్తారట. వారిద్దరి మధ్య పరిచయం ఎలా అయింది? ఆ పరిచయం ప్రేమకు ఎలా దారితీసింది? తల్లిదండ్రులను ఎలా ఒప్పించారు? వంటి అన్ని అంశాలను అందులో స్పృశిస్తారట. మరి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఎవరు నటిస్తారంటే.. రాజీవ్‌గాంధీగా బుల్లితెర నటుడు కరణ్ వీర్ బోరా, సోనియాగా ప్రియా బెనర్జీ నటిస్తున్నారు. ఇప్పటివరకు సినీ ప్రముఖులు కపుల్స్ గురించి చాలా చిత్రాలు వచ్చినా రాజకీయ నాయకుల లవ్ స్టోరీలపై మాత్రం సినిమాలు రాలేదు. కాగా ఈ సినిమాకు 'ఇజాజత్' అనే టైటిల్ని ఖరారు చేశారు.

ఈ సినిమా మార్చిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా నిర్మాతలు దీన్ని మార్కెట్ చేసుకోవడంలో మంచి తెలివితేటలే చూపించారు. ఇంగ్లీష్ తో పాటు సోనియా సొంత దేశమైన ఇటలీ ప్రజలకు నచ్చేలా ఇటాలియన్ లాంగ్వేజిలోనూ దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు 'ఇజాజత్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మార్చిలో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభిస్తారట.

 Sonia-Rajiv's brave love story now comes alive in film

అయితే ఈ సినిమాను బాలీవుడ్‌లోనే తీస్తున్నా.. హిందీలో మాత్రం తీయట్లేదట. ఇంగ్లిష్‌లోనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంగ్లిష్‌తో పాటు సోనియా సొంతదేశమైన ఇటలీలో కూడా విడుదల చేసేందుకు ఇటాలియన్ లాంగ్వేజ్‌లోనూ రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. సినిమా నిడివి కేవలం గంట నుంచి గంటన్నరేనట.

English summary
Telly actor Karanvir Bohra to produce and star in a short film that chronicles former Prime Minister, late Rajiv Gandhi and wife Sonia Maino's journey to make a life together
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu