For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జోష్ యాప్ మొదటి వార్షికోత్సవం.. #EkNumber ఛాలెంజ్‌తో రంగంలోకి సోనూసూద్, మౌనిరాయ్.. జాక్ పాట్ కొట్టే ఛాన్స్!

  |

  భారతదేశంలోని అతి పెద్ద షార్ట్ వీడియో మేకర్ యాప్ అయినటువంటి జోష్ తక్కువ టైమ్ లోనే అత్యుత్తమ కంటెంట్ అందిస్తున్న వాటిల్లో ట్రెండ్‌ సెట్టర్‌గా మారింది. అయితే జోష్ యాప్ యొక్క మొదటి వార్షికోత్సవంలో ఈ మైలురాయిని గొప్పగా జరుపుకోవడానికి ఈ ఫ్లాట్‌ ఫారమ్‌కు చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం జోష్ యాప్ మార్కెట్లో నెం .1 షార్ట్ వీడియో యాప్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జోష్ ఇప్పుడు రాబోయే టాలెంట్ సెలబ్రెటీల కమ్యూనిటీలో స్థిరపడిన ప్రభావశీలులను కలిగి ఉండడం విశేషం.

  Sonu Sood, Mouni Roy And Bharats Top Influencers Launch Ek Number Challenge On Josh Apps First Anniversary

  ఈ ఛాంపియన్ కంటెంట్ లో ప్రతిరోజూ 2 బిలియన్ వీడియోలు ప్లే అవుతాయి. అలాగే 20,000+ కంటెంట్ క్రియేటర్‌లను మేనేజ్ చేస్తున్న అత్యుత్తమ టీమ్‌తో, జోష్ తన తాజా విధానంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని శాసిస్తోంది. కష్ట సమయాల్లో దేశాన్ని ఆదుకోవడానికి #BlueWarrior వంటి సృజనాత్మక కార్యక్రమాలతో ముందుకు వచ్చింది. అంతే కాకుండా బిగ్ సెలబ్రెటీస్, బ్రాండ్‌లతో జతకట్టినా కూడా జోష్ ఎల్లప్పుడూ తన ఆలోచనలతో ఇతరుల కంటే ఒక అడుగు ముందుంటుంది.

  Sonu Sood, Mouni Roy And Bharats Top Influencers Launch Ek Number Challenge On Josh Apps First Anniversary

  ఏక్ నంబర్ ఛాలెంజ్

  2021 ఆగస్టులో జోష్ ఒక ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకున్నందున, ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది. ఈ సందర్భంగా, జోష్ 'ఏక్ నంబర్' అనే ప్రత్యేకమైన ఛాలెంజ్‌ తో రంగంలోకి దిగింది. ఇక ఆ చాలెంజ్ కు భారతదేశంలోని ఇద్దరు ప్రముఖ తారలు, నటులు సోనూసూద్ మరియు మౌని రాయ్‌లతో పాటు భారత్ యొక్క టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు నాయకత్వం వహిస్తారు. జోష్ ప్రచారం ఆగస్టు 17న ప్రారంభమైంది. అయితే #EkNumber ఛాలెంజ్ డ్యాన్స్, ఫ్యాషన్, ఫుడ్, కామెడీ మరియు ఫిట్‌నెస్ విభాగాలలో ఆగస్టు 20న ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సోను, మౌని ఐదు విభాగాలలో #EkNumber ఛాలెంజ్‌కి నాయకత్వం వహిస్తున్నారు, భారతదేశంలోని ఎనిమిది భాషలలో పాల్గొనడానికి జోష్ పార్టీసిపెంట్స్ కూడా కలిసి వచ్చారు.

  ఫైసు, సమీక్ష, ఇషాన్, మధుర, షాదన్ వంటి వారు జోష్‌పై అగ్ర ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గా ఉన్నారు. ఇక KPY బాల, కింగ్స్ యునైటెడ్-సురేశ్, రణవీర్ బ్రార్ అలాగే రుహి సింగ్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రభావశీలులు తమ ప్రత్యేకమైన కంటెంట్‌తో ఈ 10 రోజుల హోరాహోరీ పోటీలో తట్టుకుని నిలబడే ఉత్తమ 120 మంది ప్రతిభావంతులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

  జోష్ వినియోగదారులు క్రింది 6 హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి #EkNumber వీడియోలను అప్‌లోడ్ చేయాలి:

  #EkNumber
  #EkNumberDanceStar
  #EkNumberFashionStar
  #EkNumberFoodStar
  #EkNumberComedyStar
  #EkNumberFitnessStar

  EkNumber ఛాలెంజ్‌ వీడియోలను ఇక్కడ అప్‌లోడ్ చేయాలి

  బహుమతి ఏమిటి అనే విషయాల్లోకి వెళితే.. విజేతలు జోష్ ఆల్ స్టార్స్‌లో నమోదు చేసుకోవడానికి అలాగే తదుపరి Ek నంబర్ కంటెంట్ సృష్టికర్తగా అవకాశం పొందుతారు. అదే విధంగా విజేతల్లో ఒక్కొక్కరికి రూ .50,000 వరకు పెద్ద నగదు బహుమతిని పొందుతారు. అగ్ర ప్రముఖులు, రోల్ మోడళ్లను కూడా ప్రత్యేకంగా కలుసుకునే అవకాశం ఉంటుంది.

  జోష్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని మరింత హైప్ లో జరిగేలా చేయడానికి, క్లింటన్ సెరెజో, బియాంకా గోమ్స్ కంపోజ్ చేసిన 'జోష్ మే ఆజా' పాట యొక్క ర్యాప్ పాట 'ఏక్ నంబర్' మ్యూజిక్ వీడియోతో పాటు చిన్న వీడియో యాప్ కూడా వచ్చింది. దీనితో పాటు, జోష్ సరదాకి మరింత జోడించడానికి జోష్ IG ఫిల్టర్‌ని విడుదల చేసింది. ఇక భవిష్యత్తులో కూడా ఎన్నో కొత్త తరహా సర్ ప్రైజ్ లు రాబోతున్నట్లు చెప్పవచ్చు.

  English summary
  Sonu Sood, Mouni Roy And Bharat's Top Influencers Launch Ek Number Challenge On Josh App's First Anniversary
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X