»   » హాలీవడ్ లో నటించడానికి సిధ్దమైన తెలుగు విలన్..!

హాలీవడ్ లో నటించడానికి సిధ్దమైన తెలుగు విలన్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోనూ సూద్ ఈ పేరు యావత్ దక్షణ భారతదేశంలో మారుమ్రోగిపోతుంది అందుకు కారణం అరుంధతి. అరుంధతి సినిమాలో తాను నటించినటువంటి అఘోరా పాత్రలో తను నటించలేదు జీవించాడు. అసలు ఆసినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కోట్టడానికి తను కూడా ఓ ముఖ్య భూమికను పోషించినందుకు చాలా ఆనందంగా ఫీలయ్యానని చెప్పాడు ఇటీవల నంది అవార్డు అందుకుంటూ. అంతేకాకుండా బాలీవుడ్ లో బాక్సాఫీస్ సినిమాలు లేక సతమతమవుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ కి దబాంగ్ రూపంలో బాలీవుడ్ కనివిని ఎరుగని రికార్డులను నమోదు చేసింది. ఈ సినిమాలో తను చేసిన యాక్టింగ్ నభూతో నభవిష్యత్ మాదిరి ఉంది.

ఈ సినిమాలో తాను చేసినటువంచి నటనను చూసినటువంటి హాలీవుడ్ డైరెక్టర్ యాంగ్ లీ సోనూసూద్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. యాంగ్ లీ గతంలో హల్క్ సినిమా చేశారు. తన తదుపరి చిత్రంలో తనని నటించాల్సిందిగా కోరడం జరిగిందంట. లైఫ్ ఆఫ్ పి అనే నవల ఆధారంగా ఈ సినిమాని నిర్మించడం జరుగుతుందని యాంగ్ లీ చెప్పారు. దానితో సోనూసూద్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి అంతటికి కారణం తన అరుంధతి సినిమాయే కారణం అని ఎంతో గోప్పగా మన తెలుగు సినిమా గురించి చెప్తున్నాడంట. అంతేకాకుండా హాలీవుడ్ సినిమా ఆఫర్ రావడం నా కెరీర్ లోనే మరిచిపోలేని ఓ అధ్బుతం అన్నారు. మన సోనూసూద్ హాలీవుడ్ లో కూడా ఈ సినిమా ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకోవాలని కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu