twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sonu Sood రాజకీయాలపై సోనుసూద్ సెన్సేషనల్ కామెంట్స్.. ప్రజాసేవపై అలా క్లారిటీ!

    |

    కరోనా సమయంలో అనేక మందికి సహాయం చేసి రియల్ హీరో గా మారిపోయారు రీల్ విలన్ సోనూసూద్.. తెలుగులో అనేక సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన ఆయన కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో అనేక మంది సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సహాయం చేసి అనేక మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే సహాయం చేశారు. ఇప్పటికే చాలాసార్లు తాను రాజకీయాల్లోకి రాను అని ఆయన ప్రకటించారు కానీ తాజాగా మరోసారి రాజకీయ ఆరంగ్రేటం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు

    రాజకీయ ఆరంగ్రేటం

    రాజకీయ ఆరంగ్రేటం

    సోనూసూద్ ముందు నుంచి కూడా తాను రాజకీయ ఆరంగ్రేటం చేయను అని చెబుతూ వస్తున్నారు. అయితే తన సోదరి కాంగ్రెస్ పార్టీ నుంచి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తో సోను సూద్ కూడా మా సోదరికి ఓట్లు వేయండి అంటూ పంజాబ్ లోని ఒక నియోజకవర్గంలో చాలా రోజుల పాటు ప్రచారం చేశారు. ఈ దెబ్బతో ఇక సోనూసూద్ కూడా రాజకీయాల్లోకి రావచ్చు అంటూ ప్రచారం మొదలైంది. ఈ విషయం మీద తాజాగా సోనూసూద్ స్పందించారు.

     బ్రాండ్ అంబాసిడర్ సోనూ సూద్

    బ్రాండ్ అంబాసిడర్ సోనూ సూద్

    అంకురా హాస్పిటల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సోనూసూద్ తాజాగా అంకురా హాస్పిటల్ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ 12వ హాస్పిటల్ ను అంకుర హాస్పిటల్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే తమ హాస్పిటల్స్ విస్తరణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా అంకుర హాస్పిటల్స్ బ్రాండ్ అంబాసిడర్ సోనూ సూద్, అంకుర ఎండీ డాక్టర్ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

    అనుబంధం ఉందని

    అనుబంధం ఉందని

    ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ కరోనా పాండమిక్ సమయంలో చాలా హాస్పిటల్స్ కి వెళ్లానని, జనాల పరిస్థితి చూస్తుంటే చాలా బాధనిపించేదని అన్నారు. కరోనా సమయంలో నా స్థోమతకు తగిన సేవ చేశాను, ఇంకా చేస్తున్నానని ఆయన అన్నారు. అంకుర హాస్పిటల్స్ చాలా మంచి సేవలను అందిస్తుందని అన్నారు. సంవత్సర కాలంగా అంకుర హాస్పిటల్స్ తో నాకు అనుబంధం ఉందని అన్నారు.

    ఇంట్రెస్ట్ లేదని

    ఇంట్రెస్ట్ లేదని

    పాండమిక్ సమయంలో అంకుర హాస్పిటల్స్ తో కలిసి పని చేశామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు అంకుర విస్తరణ అనేది ఎంతో మందికి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని ఆయ్న అన్నారు. ఇక ఈ సందర్భంగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన మాట్లాడుతూ నేను పాలిటిక్స్ లోకి వెళ్ళను.. నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నారు.

    సినిమాల మీదే

    సినిమాల మీదే

    దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించాలని అనుకుంటున్నానని, ఇప్పుడు సినిమాలు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని అన్నారు. సేవ చేయడానికి పవర్ కాదు, దేవుడి దయ ఉండాలని ఆయన అన్నారు. దేశంలో అందరూ ముందు ఉండాలని, దేశ నిర్మాణంలో యువత కీలకం అని అన్నారు.

    పాండమిక్ పోయింది కానీ, సమస్యలు కాదని ఆయన అన్నారు. చిరంజీవి గారితో సినిమా రాబోతుందని, మరికొన్ని స్క్రిప్ట్స్ ని షార్ట్ లిస్ట్ చేశానని అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా 29న విడుదల అవుతోంది.

    English summary
    Sonu Sood has revealed that he has no plans to go into politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X