twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా ఎమోషనల్ అయ్యాడు : మేమంటే ఎందుకింత నిర్లక్ష్యం?? నటుడు సోనూ సూద్ ఆవేదన

    |

    సినిమా నిర్మాణ సమయంలో ఎంతటి నిర్లక్ష్యం కనిపిస్తుందో.. తాజాగా కన్నడ సినిమా మాస్తి గుడి విషయంలో ప్రూవ్ అయింది. ఇద్దరు నటుల ప్రాణాలు ఒకే సమయంలో గాల్లో కలిసిపోవడం అంటే.. అది ఏ మాత్రం వదిలేయాల్సిన విషయం కాదు. ఈ విలన్ పాత్రాఆరులు ఇద్దరికీ అన్ని రంగాల నుంచి సపోర్ట్ వస్తోంది. ఇప్పుడు అరుంధతి విలన్ సోనూ సూద్ కూడా నటుల ప్రాణాలను పట్టించుకోవట్లేదంటూ.. సినిమా నిర్మాణంలో జరిగే లోటు పాట్లు గుట్టు విప్పేశాడు. శాండిల్‌వుడ్‌లో ఓ షూటింగ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. మస్తిగుడి అనే సినిమాలో కీలకమైన ఫైటింగ్ సీన్లు చిత్రీకరిస్తుండగా ఇద్దరు నటులు దుర్మరణం పాలయ్యారు..

    హెలికాఫ్టర్ నుంచి నీళ్లలోకి దూకే సీన్ తీస్తుండగా ఈ ఘటన చేటుచేసుకుంది. లక్కీగా హీరో దునియా విజయ్‌ ప్రాణాలతో బయటపడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ఐతే.. ఈ సీన్‌లో స్టంట్‌మెన్‌తోపాటు విలన్‌గా చేస్తున్న నటుడు నీళ్లలో మునిగి చనిపోయారు. వీళ్లిద్దినీ అనిల్, ఉదయ్‌గా గుర్తించారు. తిప్పగొండనహళ్లి డ్యామ్‌లో ఈ మస్తిగుడి షూటింగ్‌ జరుగుతోంది. ఓ సీన్‌లో భాగంగా హీరోతోపాటు విలన్లు హెలికాఫ్టర్ నుంచి రిజర్వాయర్ నీళ్లలోకి దూకాలి. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకాలి. ఐతే.. ఈ షూటింగ్ సందర్భంగా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. తాళ్లవంటివి ఏమీ లేకుండా డైరెక్ట్‌గా 100 అడుగుల ఎత్తు నుంచి కిందకి దూకడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. డూప్ లేకుండా స్టంట్స్ చేశామని చెప్పుకునేందుకు సినిమా యూనిట్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయం మీద కాస్త ఘాటుగానే స్పందించాడు స్టార్ విలన్ సోనూ సూద్...

    హెలీకాప్టర్‌ నుంచి:

    హెలీకాప్టర్‌ నుంచి:

    మాస్తిగుడి చిత్రీకరణలో హెలీకాప్టర్‌ నుంచి దూకిన సంఘటనపై ఇరువురు నటులు దుర్మరణంపై బాలీవుడ్‌ స్టార్‌ సోనూసూద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసమైన రక్షణా చర్యలు తీసుకోకుండా ఇరువురి ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు. ముంబైలో ఆయన మీడియా‌తో మాట్లాడారు. ఇటువంటి భయంకరమైన సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు సురక్షిత చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఘటనపై తీవ్రంగా బాధపడుతున్నానని ఇటువంటి సంఘటనలు పునరావృతం కారాదన్నారు. అనిల్‌, ఉదయ్‌కుటుంబీకులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

    సేఫ్టీ నెట్ లేకుండానే:

    సేఫ్టీ నెట్ లేకుండానే:

    మాస్తిగుడి మేకింగ్ వీడియోలను చూశాను. యూనిట్ ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారో అర్ధమవుతుంది. ఉదయ్.. అనిల్ లు ఈత రాదని ముందే చెప్పినా.. ప్రొడ్యూసర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కొన్ని రిస్కీ షాట్స్ చేసినపుడు సేఫ్టీ నెట్ లేకుండానే చేయాల్సి వచ్చిన సందర్భాలు నాకు కూడా ఉన్నాయి. మన నిర్మాతలకు ఈ విషయంలో ఎలాంటి పట్టింపులు పెద్దగా ఉండవు' అంటూ కుండబద్దలుకొట్టేశాడు సోనూసూద్.

    డాక్టర్లు తిరుగుతూనే ఉంటారు:

    డాక్టర్లు తిరుగుతూనే ఉంటారు:

    ఇప్పుడు జాకీచాన్ తో కుంగ్ ఫూ యోగా మూవీలో నటిస్తున్నాను. అక్కడ అంబులెన్స్ లేని రోజు అసలు ఉండదు. సెట్ లో డాక్టర్లు తిరుగుతూనే ఉంటారు. మనకు అలాంటి సిస్టం లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి' అంటూ నటుల ప్రాణాలను నిర్లక్ష్యంగా చూస్తున్న ఇండియన్ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు సోనూ సూద్.

    విజయ్‌ కోసమే భద్రత ఏర్పాట్లు:

    విజయ్‌ కోసమే భద్రత ఏర్పాట్లు:

    మూవీ యూనిట్ పెర్ఫెక్షన్ పిచ్చే ఉదయ్, అనిల్ ల ప్రాణాలు తీసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా చేసిన స్టంట్ బెడిసికొట్టింది. మరోవైపు ఈ షూటింగ్‌ ప్రమాదం వెనుక ఉన్న పలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. షూటింగ్‌లో భాగంగా హెలికాప్టర్‌లో నుంచి రిజర్వాయర్‌లోకి దూకే సీన్‌ కోసం ఎలాంటి ముందుజాగ్రత్త భద్రత చర్యలు తీసుకోలేదు. పైగా హీరో దునియా విజయ్‌, విలన్‌ పాత్రలు పోషిస్తున్న ఉదయ్‌, అనిల్‌ ముగ్గురు నీటిలో దూకగా.. ఒక్క విజయ్‌ కోసమే భద్రత ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తోంది. దీంతో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోగా... హీరో మాత్రం బచాయించాడు.

    ముందుజాగ్రత్త చర్య:

    ముందుజాగ్రత్త చర్య:

    అంతేకాదు.. రిజర్వాయర్‌ మీద హెలికాప్టర్‌ తో చక్కర్లు కొట్టేందుకు మాత్రమే బెంగళూరు వాటర్‌ బోర్డు చిత్రయూనిట్‌కు అనుమతి ఇచ్చింది. రిజర్వాయర్‌లో షూటింగ్‌కు కానీ, రిజర్వాయర్‌లో దూకే స్టంట్లకుకానీ వాటర్‌ బోర్డు అనుమతి ఇవ్వలేదు. కానీ యూనిట్ మాత్రం డెడ్లీ స్టంట్ చేసింది. షూటింగ్ సమయంలో ముందుజాగ్రత్త చర్యగా ఒక డీజిల్‌ బోటును అందుబాటులో ఉంచినా.. అది ఇంజిన్‌ ఫెయిల్యూర్‌ వల్ల పనిచేయలేదు.

    ఒక తెప్ప మాత్రమే అందుబాటులో :

    ఒక తెప్ప మాత్రమే అందుబాటులో :

    షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఒక తెప్ప మాత్రమే అందుబాటులో ఉంది. అది రిజర్వాయర్‌లో దూకిన హీరో విజయ్‌ను కాపాడటానికి ఉపయోగపడింది. ఉదయ్, అనిల్ లను నీటిలోనే వదిలేసింది మూవీ యూనిట్. ఇంకా దారుణం ఏమిటంటే తమకు ఈత సరిగ్గా రాదని, నిపుణుల వద్ద తమకు ఈతలో శిక్షణ కూడా ఇప్పించలేదని నటులు ఉదయ్‌, అనిల్‌ షూటింగ్‌కు ముందే చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

    సుందర్‌ పీ గౌడ:

    సుందర్‌ పీ గౌడ:

    హెలికాప్టర్‌లో చిత్రీకరిస్తున్న ఈ క్లైమాక్స్‌ సీన్‌పై చిత్రయూనిట్‌ బాగా ప్రచారం చేసింది. ఈ ఒక్క సీన్‌ కోసమే రూ. 1.2 కోట్లు ఖర్చు చేసినట్టు చిత్ర నిర్మాత సుందర్‌ పీ గౌడ ఊదరగొట్టారు.. ఈ సీన్‌ చిత్రీకరణను కవర్‌ చేసేందుకు న్యూస్‌చానెళ్లను కూడా ఆహ్వానించారు. ఇపుడు ఈ ఘటనతో అడ్డంగా బుక్కయ్యారు

    గాలిస్తూనే ఉన్నారు:

    గాలిస్తూనే ఉన్నారు:

    తిప్పగొండనహళ్ళి చెరువులో మూడు రోజులుగా జరుగుతున్న తీవ్ర గాలింపుల అనంతరం నటుడు ఉదయ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. ఇంకా అనిల్‌ మృతదేహం కోసం గాలిస్తూనే ఉన్నారు. ఉదయ్‌ మృతదేహం బాగా కుళ్ళిపోయిన స్థితిలో చెరువులో సుమారు 60 అడుగుల లోతులో చిక్కుకుని ఉండగా గజ ఈత గాళ్ళు పైకి తీసుకురాగలిగారు. జిల్లాధికారి శంకర్‌ బోటులో స్వయంగా మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు.

    అంత్యక్రియలు:

    అంత్యక్రియలు:

    అక్కడే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనిల్‌ మృతదేహం కూడా దొరికితే ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు, స్నేహితులు ఆలోచిస్తున్నారు. ఉద య్‌ మృతదేహాన్ని గుర్తించేందుకు చాలా సేపు ఇబ్బంది పడ్డారు. తొలుత అనిల్‌మృతదేహం గా పొరబడ్డారు. ముఖమంతా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో ఉంగరం ఆధారంగా ఉదయ్‌గా గుర్తించారు. కుమారుడి మృతదేహాన్ని చూస్తూనే షాక్‌కు గురైన తల్లి కౌశల్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కాగా గురువారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

    కన్నడ చిత్రసీమ సీరియస్:

    కన్నడ చిత్రసీమ సీరియస్:

    ఈ సంఘటనపై కన్నడ చిత్రసీమ కూడా సీరియస్ గా స్పందించింది. కర్నాటక చలనచిత్ర వాణిజ్యమండలి మాస్తిగుడి నిర్మాత సుందర్‌, హీరో దునియా విజయ్‌, దర్శకుడు నాగశేఖర్‌, స్టంట్‌ డైరెక్టర్‌ రవివర్మలపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంతవరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.ఈ ఘటనకు నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా కన్నడ చలనచిత్ర వాణిజ్యమండలి కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించింది. అనుమతి లేకుండా ఈ నలుగురూ సినీ నిర్మాణ కార్యకలాపాలలో పాల్గొనరాదని మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు ఆదేశాలు జారీ చేశారు.

    నివేదిక ఆధారంగా:

    నివేదిక ఆధారంగా:

    మాస్తిగుడి విషాద ఘటనలో నిజానిజాల తేల్చేందుకు వాణిజ్యమండలి తరపున నటులు, కళాకారులు, నిర్మాత, దర్శకులతో కూడిన నిజ నిర్ధారణ బృందాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందం సమర్పించే నివేదిక ఆధారంగా ఈ ముగ్గురిపై నిషేధాన్ని ఇంకెంతకాలం కొనసాగించాలో తీర్మానించనున్నారు.

    English summary
    Sonu Sood Reaction On Kannada Artists Anil and Uday Death Feels Sad Over The Incident
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X