»   » బాహుబలి 2 బినామీ మాజీ సీఎం ఫ్యామిలీ: తమిళనాడులో పంపిణి చేసింది ఎవరంటే!

బాహుబలి 2 బినామీ మాజీ సీఎం ఫ్యామిలీ: తమిళనాడులో పంపిణి చేసింది ఎవరంటే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సంచలన విజయం సాధింస్తున్న బాహుబలి 2 (ది కన్ క్లూజన్) రోజుకోక రికార్డు తిరగరాస్తున్నది. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న బాహుబలి 2 విడుదలై దేశవ్యాప్తంగా కలెక్షన్ ల పరంగా సంచలనం సృష్టిస్తున్నది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ బాషల్లో విడుదలైన బాహుబలి 2 సినిమా చరిత్ర తిరగరాస్తున్నది.

బాహుబలి-2 చూసిన సీఎం: రూ. 50 వేలకు టిక్కెట్లు ! దుమ్మెత్తిపోశారు, అయితే?


తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో బాహుబలి 2 కలెక్షన్ ల పరంగా కనకవర్షం కురిపిస్తోంది. హిందీలో విడుదలైన బాహుబలి 2 గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ఆ సినిమా (హిందీ) పంపిణి హక్కులు సొంతం చేసుకున్న కరణ్ జోహార్ ఇప్పటికే అనేక సార్లు చెప్పారు. అయితే తమిళనాడులో బాహుబలి 2 సినిమా హక్కులు ఎవరు తీసుకున్నారు ? అనే హాట్ టాపిక్ ఇప్పుడు తెరమీదకు వచ్చింది.


తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

బాహుబలి 2 సినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైయ్యింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 27వ తేది అర్దరాత్రి నుంచి ఫ్రీమియర్ షోలు వేశారు. లక్షల మంది సినీ అభిమానులు బాహుబలి 2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు క్యూకట్టారు.


వినోద్ కన్నా మృతితో బ్రేక్

వినోద్ కన్నా మృతితో బ్రేక్

ఏప్రిల్ 27వ తేది రాత్రి బాహుబలి 2 సినిమా హిందీ వెర్షన్ ఫ్రీమియర్ షోలు వెయ్యడానికి కరణ్ జోహార్ అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అదే రోజు ఉదయం ప్రముఖ హిందీ నటుడు వినోద్ కన్నా అనారోగ్యంతో మృతి చెందడంతో ముంబైతో పాటు ఉత్తరాదిలోని అనేక నగరాల్లో బాహుబలి 2 అన్ని ఫ్రీమియర్ షోలు రద్దు చేశారు.


బెంగళూరులో ముందు రోజు రాత్రి 10 గంటలకు

బెంగళూరులో ముందు రోజు రాత్రి 10 గంటలకు

బెంగళూరు నగరంలో ఏప్రిల్ 27వ తేదీ రాత్రి 10 గంటల నుంచి బాహుబలి 2 సినిమా ప్రదర్శించారు. బెంగళూరు నరంలోని దాదాపు అన్ని మాల్స్, మల్లీఫ్లక్స్, ఐ-మాక్స్, పీవీఆర్ తదితర స్క్రీన్స్ లో బాహుబలి 2 సినిమాను కొన్ని వేల మంది చూశారు.


తమిళనాడులో

తమిళనాడులో

తమిళనాడులో బాహుబలి 2 ఫ్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల తమిళనాడులో ఫ్రీమియర్ షోలు రద్దు అయ్యాయని మొదట ప్రచారం జరిగింది. బాహుబలి 2 సినిమా చూడాలని ఎదురు చూసిన అభిమానులు తీవ్ర నిరాశకు గురైనారు. అయితే తరువాత అసలు విషయం బయటకు వచ్చింది.


డబ్బు చెల్లించలేదని

డబ్బు చెల్లించలేదని

తమిళనాడులో బాహుబలి 2 సినిమా పంపిణి హక్కులను కే ప్రోడక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే పంపిణిదారులు సరైన సమయంలో నిర్మాతలకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో అసలు సమస్య ఎదురైయ్యిందని తెలిసింది.


మాజీ సీఎం సంస్థ, ఇబ్బంది ఉండదని హామీ

మాజీ సీఎం సంస్థ, ఇబ్బంది ఉండదని హామీ

కే ప్రోడక్షన్స్ సంస్థ మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులది, డబ్బు విషయంలో తేడా రాదని, బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యడం సమస్యగా ఉందని చెప్పడంతో ఏప్రిల్ 28 ఉదయం నుంచి బాహుబలి - సినిమా షోలు ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని వెలుగు చూసింది. అంత వరకు బాహుబలి 2 సినిమా ఎవరు పంపిణి చేస్తున్నారు అనే విషయం బయటకు రాలేదని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.


ఎవరు ఆ మాజీ సీఎం

ఎవరు ఆ మాజీ సీఎం

తమిళనాడుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు దక్షిణ తమిళనాడులో అనేక వ్యాపారాలు ఉన్నాయి. దక్షిణ తమిళనాడులో ఆయన కుటుంబ సభ్యులు పలు వ్యాపారాలు చేస్తున్నారు. వారు ప్రస్తుతం సినిమా రంగంలోకి అడుగుపెట్టారని వెలుగు చూసింది.


కేంద్రంతో సన్నిహితంగా

కేంద్రంతో సన్నిహితంగా

బాహుబలి 2 సినిమా పంపిణి హక్కులు మరోకరి పేరుతో తీసుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు కే ప్రోడక్షన్ పేరుతో ఇప్పటికే దాదాపు 10 సినిమాల పంపిణీ హక్కులు తీసుకున్నారని వెలుగు చూసింది.


బాహుబలి 2తో హ్యాపీ

బాహుబలి 2తో హ్యాపీ

బాహుబలి 2 సినిమా పంపిణి హక్కులు బినామీ పేరుతో తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇప్పుడు మంచి లాభాలు వస్తున్నాయని సంతోషంగా ఉన్నారని తెలిసింది. ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో, సినీ వర్గాల్లో బాహుబలి 2 సినిమా పంపిణి హక్కులు తీసుకున్న మాజీ సీఎం గురించి చర్చ జరుగుతోంది.English summary
Sources said that Bahubali-2 Film's Tamil Nadu Distributor is Benami of Tamil Nadu former Chief Minister.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu