»   » బాలీవుడ్‌ ‘బెర్త్’ దొరికిన మన హీరోయిన్స్ (ఫోటో పీచర్)

బాలీవుడ్‌ ‘బెర్త్’ దొరికిన మన హీరోయిన్స్ (ఫోటో పీచర్)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : తెలుగు పరిశ్రమలో పేరు సంపాదించుకున్న హీరోయిన్లు చాలామంది బాలీవుడ్‌లోకి పరుగులు పెడుతున్నారు. గతంలో పలువురు తెలుగు హీరోయిన్లు హిందీలో కూడా సంపాదించుకుంటే ఇప్పుడు ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమలోనికి వచ్చిన హీరోయిన్లకు ఇక్కడ పేరురాగానే బాలీవుడ్‌లోకి ఎగిరిపోతున్నారు. మన ముద్దుగుమ్మలు ప్రస్తుతం అక్కడి వారికి గట్టిపోటీ కూడా ఇస్తుండటం విశేషం. సొంత ప్రాంతాల పరంగా చూస్తే వీరిలో ఉత్తరాది భామలు కూడా ఉన్నా... దక్షిణాదిన తెచ్చుకున్న గుర్తింపే పెట్టుబడిగా బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బొద్దే ముద్దు అన్న స్థాయి నుంచి ప్రస్తుతం బాలీవుడ్‌ను తలదన్నే అందచందాలను ప్రదర్శిస్తున్న నేటితరం దక్షిణాది తారలు మాత్రం క్రమంగా హిందీలోనూ అవకాశాలు అందుకుంటున్నారు.

  సౌత్ లాంగ్వేజెస్ లో ఎన్ని హిట్స్ వచ్చినా, ఎంత సంపాదించినా హీరోయిన్స్ కి బాలీవుడ్ మీదే ఆసక్తి. అక్కడ తమ ప్రతిభకు తగిన గౌరవం దొరుకుతుందని, నేషనల్ మార్కెట్లో తామెంటో ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడుతారు. అందుకు తగినట్లే వారు బాలీవుడ్ దర్శక, నిర్మాతల వేటలో ఉంటూంటారు. మరో ధైర్యం ఏమిటంటే అక్కడ సినిమా ఆడకపోతే ఇక్కడ సౌత్ లో ఎలాగూ సినిమాలు ఉండనే ఉంటాయి.

  చెక్కిన శిల్పంలాంటి నాజూకు శరీరాకృతి కలిగిన కథానాయికలకు బాలీవుడ్‌ క్రేజ్‌ ఉంటే, బొద్దుగా కనిపించే మన సుందరాంగులును హిందీ ప్రేక్షకులు చూడరనే అభిప్రాయం బలంగా ఉండేది. ఈ కారణంగానూ మన వద్ద విశేషంగా రాణించిన అందగత్తెలూ బాలీవుడ్‌కు దూరంగా ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దక్షిణాదికే చెందిన అతిలోక సుందరి శ్రీదేవి మాత్రం చరిత్ర సృష్టించదనే చెప్పాలి.

  పదహారేళ్ల పడుచుపిల్లగా తమిళం, తెలుగు ప్రేక్షకుల మది దోచిందామె. ఆపై బాలీవుడ్‌లోనూ ప్రవేశించి ఓ వెలుగు వెలిగింది. అక్కడి అగ్ర హీరోల సరసన ఆడిపాడి అగ్రస్థానం అందుకుంది. వివాహానంతరం ఆమె వెండితెరకు దూరమవడంతో హిందీలో ఆధిపత్యం చెలాయించే దక్షిణాది హీరోయిన్‌ ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి.

  తమిళంలో 'గజిని' వంటి బ్లాక్‌బస్టర్‌లో నటించింది ఈ మలయాళ కుట్టి . అదే చిత్రం రీమేక్‌ ద్వారా హిందీలో అమీర్‌ఖాన్‌కు జంటగా కనిపించింది. ఈ చిత్రం అక్కడ రూ. వంద కోట్లు వసూలు చేయటంతో అమ్మడు హాట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. పూర్తిగా హిందీకే పరిమితమైంది. లండన్‌ డ్రీమ్స్‌, హౌస్‌ఫుల్‌-2, బోల్‌బచ్చన్‌, రెడీ వంటి చిత్రాల్లో నటించింది. రెడీ కూడా రూ. వంద కోట్ల జాబితాలో చేరడం విశేషం. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌కు జంటగా నటించిన కొత్త చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

  అసిన్‌ బాటలో హిందీలోనూ పాగా వేసిన మరో దక్షిణాది తార ఇలియానా. తెలుగులో 'దేవదాసు'తో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... తర్వాత పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. హిందీలో తొలిసారిగా 'బర్ఫీ'లో నటించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించటంతో పాటు ఆస్కార్‌ అవార్డుకు మన దేశం నుంచి నామినేట్‌ అయింది. దీంతో అమ్మడి పేరు అక్కడ మార్మోగుతోంది. ప్రస్తుతం ఆమె దృష్టంతా హిందీ చిత్రాలపైనే ఉంది. దక్షిణాది చిత్రాలేవీ అంగీకరించలేదు. ప్రస్తుతం షాహిద్‌కపూర్‌కు జంటగా నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

  తెలుగులో ఇప్పటికి ఒక్క హిట్టు సినిమా పడకపోయినా,తన గ్లామర్ తో వరస ఆఫర్స్ అందుకుంటున్న ఈ భామ బాలీవుడ్ లో వెలగటానికి తాను సైతం అంటూ సిద్దమవుతోంది. ఈ క్యూట్‌గాళ్ ‘ఛస్మే బద్దూర్' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశిసించి అక్కడా సెటిల్ అవ్వాలనే చూస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్లాసిక్ చిత్రం ఛస్మే బద్దూర్ రీమేక్ లో ఎంపికవటం చాలా ఆనందాన్ని ఇస్తోంది అంటోంది. ముగ్గురు అబ్బాయిలు...ఒకమ్మాయి మధ్య జరిగే ఈ తమాషా కథలో కాస్త సెక్సీ లుక్ తో పాటు రెగ్యులర్ హీరోయిన్ కాకూడదని ఆయన భావించి ఆమెను ఎంపికచేసారని చెప్తున్నారు.

  వేషాలు లేక బరువెక్కిన ఛార్మింగ్ ఛార్మి...బాలీవుడ్ లో పూరీ జగన్నాధ్ అండతో 'బుడ్డ హోగా తెర బాప్ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం ఓకే అనిపించుకున్నాక ఆమెకు ‘జిల్లా గజియాబాద్'లో ఆఫర్ వచ్చింది. మరి ఈ చిత్రంతో ఆమె ఏ మేరకు అక్కడ సెటిల్ అవుతుందో చూడాలి.

  చాలా కాలం తర్వాత ‘గలీ గలీ మే చోర్ హై' అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీయ త్వరలో మరో చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. సంజయ్‌దత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జిల్లా గజియాబాద్'. ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేక గీతంలో శ్రీయ నర్తించనుందని తెలుస్తోంది. అయితే ఆమెకు అక్కడా పెద్దగా కలిసి వచ్చినట్లు కనపడటం లేదు.

  ప్రస్తుతం తెలుగులోనూ ఆఫర్స్ లేని త్రిష ఆ మధ్యన కట్టా-మీటా అంటూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యి ఆమె ఆశలపై నీళ్లు జల్లింది. నిజానికి ఆమె అంతకు ముందు కెరీర్ ప్రారంభంలో హిందీ చిత్రంలో చేసింది కానీ అది వర్కవుట్ కాకే ఇటు దక్షిణాదికి వచ్చి క్లిక్ అయ్యింది. ఇప్పటికీ ఆమె దృష్టి బాలీవుడ్ పైనే ఉంది.

  వెండితెరకు పరిచయమైంది హిందీ చిత్రాల ద్వారానే.. అయినా, ఈమెకి గుర్తింపు వచ్చింది మాత్రం దక్షిణాదినే. ఇక్కడ తమదైన ముద్రవేసి స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి చేరుకున్నారు. ప్రస్తుతం ఈమె హిందీలో హవా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. 2004లో వివేక్‌ ఒబెరాయ్‌- ఐశ్వర్యారాయ్‌ జంటగా ఓ చిత్రంలో ఐశ్వర్య స్నేహితురాలిగా చిన్న పాత్రలో కనిపించింది కాజల్‌ అగర్వాల్‌. ఆపై దక్షిణాదిలో ప్రవేశించింది.

  తెలుగు, తమిళంలో ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సూర్య 'సింగం'కు రీమేక్‌గా హిందీలో వచ్చిన చిత్రంలో అజయ్‌ దేవగన్‌కు జంటగా ఆమె నటించింది. ఫలితం సూపర్‌హిట్‌. ఈ ఉత్సాహంతో అమ్మడు కూడా హిందీ చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌కు జంటగా ఓ చిత్రంలో నటిస్తోంది.

  తమన్నా కూడా కాజల్‌ అగర్వాల్‌ను అనుసరిస్తోంది. కెరీర్‌లో తొలి చిత్రంగా ఓ హిందీ చిత్రంలో తమన్నా నటించింది. తర్వాత దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం హిందీపైనా కన్నేసింది. అజయ్‌దేవగన్‌ వంటి స్టార్‌ సరసన హిమ్మత్‌వాలాలో నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల చెంతకు రానుంది.

  English summary
  From past few years, South heroines are dominating Bollywood. Kerala Kutty Asin so far acted in 5 Hindi films in which 4 are 100 crore grossers. Goan Beauty Ileana who recently made her B-Town debut with ‘Barfi’ won the critical acclaims. The line is clear and we can say that South Babes are running their ‘Hawaa’ in Bollywood.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more