ఖుషి టెక్నీషియన్ కోలా భాస్కర్ కన్నుమూత!!
2020లో సినిమా పరిశ్రమలో కూడా పలు మరణాలు అందరిని తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. ఒక విషాద ఘటన గురించి మరువక ముందే మరో ఘటనకు సంబంధించిన వార్త కలచి వేస్తోంది. ఈ రోజు ఒక సీనియర్ ఎడిటర్ కూడా కన్నుమూశారు.
తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా పలు చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన కోలా భాస్కర్ (55) కన్ను మూశారు.
గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న భాస్కర్ ఈ రోజు ఉదయం 8గంటలకు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాతో పాటు 7జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి సినిమాలకు భాస్కర్ ఎడిటర్ గా వర్క్ చేశారు. ఆ సినిమాలతోనే ఆయనకు సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్నారు. పలు అవార్డులను కూడా అందుకున్నారు.

కోలా భాస్కర్ ఏకైక కుమారుడు కోలా బాలకృష్ణ కూడా ఇండస్ట్రీలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 7/G బృందావన కాలనీ దర్శకుడు సెల్వ రాఘవ దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా తెలుగులో 'నన్ను వదలి నీవు పోలేవులే' టైటిల్ తో విడుదల చేశారు కోలా భాస్కర్. ఇక ఆయన మృతిపట్ల కోలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











