»   » చిరంజీవి ఇష్యూ : అభిమాని కామెంటుపై ఫీలైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం!

చిరంజీవి ఇష్యూ : అభిమాని కామెంటుపై ఫీలైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి గురించి... ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు, ఓ అభిమానికి మధ్య ఫేస్ బుక్ లో జరిగిన ఓ చిన్న వాదన ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

అభిమాని పెట్టిన కామెంటు... అతడు ప్రశ్నించిన తీరుతో బాలసుబ్రహ్మణ్యంను కాస్త నొచ్చుకున్నట్లు కనిపించింది. అందుకే తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తన స్వభావం అలాంటిది కాదని తేల్చి చెప్పారు.

ఇంతకీ అభిమాని పెట్టిన కామెంట్ ఏమిటి?

ఓ అభిమాని ఫేస్ బుక్ లో స్పందిస్తూ.....సార్ మీరెంత కష్టపడి పైకొచ్చారో మాకు తెలుసు, కానీ మీరు ఎప్పుడూ ఎదుటి వారి నుండి గౌరవాన్ని ఎందుకు ఆశిస్తారు. ఉదాహరణకు చిరంజీవి మిమ్మల్ని బాలూ గారు అని పిలుస్తారు. కానీ మీరు పలు సందర్భాల్లో మాట్లాడుతూ అలా పిలవద్దు... అన్నయ్య అని పిలవాలని కోరారు. ఎదుటి నుండి గౌరవం కోసం ఎందుకిలా తాపత్రయపడతారు? నాకు అది నచ్చలేదు.... పాటల విషయంలో మీరంటే నాకు చాలా ఇష్టం అని కామెంట్ చేసాడు.

దీనిపై బాలు స్పందిస్తూ...

సదరు అభిమాని కామెంటుకు ‘‘సార్.. చిరంజీవి నన్ను బాలు గారు అని సంబోధిస్తారు. కానీ గతంలో నన్ను చిరంజీవి అన్నయ్య అని పిలిచేవారు. ఇప్పుడెందుకు కొత్తగా గారూ అనే పిలుపు... అన్నయ్య అనే పిలవమని కోరాను. నేనలా కోరడం గౌరవం కోసం కాదు. ప్రేమ కొద్దీ'' అని బాలు సమాధానమిచ్చారు.

క్షమాపణ చెప్పిన అభిమాని

క్షమాపణ చెప్పిన అభిమాని

ఆందోళన వద్దంటూ ఎస్పీబాలు వివరణ: ఫేస్ బుక్ పోస్టే కారణం...

ఆందోళన వద్దంటూ ఎస్పీబాలు వివరణ: ఫేస్ బుక్ పోస్టే కారణం...

ఎస్పీ బాలు అమెరికాలో నిస్సహాయ స్థితిలో ఉన్నారని, అక్కడ ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు ఆందోళనలో పడ్డారు... దీనికి కారణం ఎస్పీ బాలు ఫేస్ బుక్ పోస్టే. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"Sir, when Chiranjeevi calles me BALU GARU, I told him ," You always called me ANNAYYA in the past. Why GARU now" It is not asking for respect. Asking for LOVE." SP Balu said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu