For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకే సిగ్గుగా అనిపించింది, వద్దన్నాను కానీ...‌: పవన్ స్వయంగా విషయం రివీల్ చేసారు, గ్రేట్ కదా

  By Srikanya
  |

  హైదరాబాద్‌: సప్తగిరి. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' . నిన్న సాయంత్రం గ్రాండ్ గా ఆడియో వేడుక కార్యక్రమం హైదరాబాద్ లో జరుపుకుంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రావడం అందరిలో ఆశ్చర్యం కలిగించింది.

  ఎప్పుడు బయటి ఫంక్షలకి పెద్దగా రాని పవన్ సప్తగిరి ఆడియోకి రావడం అందరికీ కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే పవన్ రాక వెనుక బలమైన కారణమే ఉంది.ఆ విషయాన్ని పవన్ స్వయంగా రివీల్ చేసారు.

  గత కొద్ది రోజులుగా పవన్ ఈ ఆడియోకు రావటానకి గల కారణాలు అంటూ చాలా వార్తలు, గాసిప్స్ మీడియాలో వార్తలు ప్రచారమయ్యాయి. అయితే వాటిలో కొన్ని నిజమే అని తేలాయి. ఇంతకీ పవన్ చెప్పిన ఆ నిజం ఏమిటి... ఇంతకీ పవన్ ఎందుకు సప్తగిరి ఆడియో పంక్షన్ కు వచ్చారో మీరు క్రింద చదవండి. ఆడియో ఫంక్షన్ ఫొటోలు సైతం చూడండి..

  ఇన్నాళ్లూ కామెడీ చేసి..

  ఇన్నాళ్లూ కామెడీ చేసి..

  హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సప్తగిరి. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'. అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పతాకంపై డాక్టర్‌ కె.రవికిరణ్‌ నిర్మిస్తున్నారు.

  మంచి సక్సెస్ కావాలని

  మంచి సక్సెస్ కావాలని

  బల్గానిన్‌ సంగీతం రూపొందించిన ఈ చిత్రం ఆడియో పంక్షన్ ... హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి సినీనటుడు పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోను ఆవిష్కరించారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

  సప్తగిరి స్వీకరించారు

  సప్తగిరి స్వీకరించారు

  విజయ్‌ బుల్గానిస్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలిసీడీని పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. సప్తగిరి స్వీకరించారు. పవన్ రావటంతో ఆ పంక్షన్ వాతావరణం మొత్తం మారిపోయింది.

   ఆశీర్వాదాలు ఇచ్చేంతగా

  ఆశీర్వాదాలు ఇచ్చేంతగా

  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సినిమా వేడుకలకు వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చేంతగా నన్ను నేను చూసుకోలేను. కానీ అభిమానుల ప్రేమకు స్పందిస్తా. సప్తగిరి ‘గబ్బర్‌సింగ్‌'లో చిన్న సన్నివేశంలో నటించాడు. అది చూసి విపరీతంగా నవ్వుకొన్నా. అప్పటి నుంచి అతణ్ని కలవాలనుకొన్నా. ఇప్పటికి కుదిరింది అన్నారు.

  సంస్కారంతో..

  సంస్కారంతో..

  శరత్‌ మరార్‌తో తీస్తున్న సినిమాకి ‘కాటమరాయుడు' పేరు పెడదామనుకొన్నాం. ఆ సమయంలో ఆ టైటిల్‌ సప్తగిరి దగ్గరే ఉంది. ఆ విషయం నాకు తెలీదు. అడిగిన వెంటనే ఉన్నతమైన సంస్కారంతో ఆ టైటిల్‌ మాకు ఇచ్చారు.

  చాలా ధాంక్స్

  చాలా ధాంక్స్

  కానీ అప్పటికే ఈ నిర్మాతల సినిమా 80 శాతం పూర్తయ్యింది. టైటిల్‌ తీసుకొన్నందుకు నాకే సిగ్గుగా అనిపించింది. వద్దన్నాను. కానీ వాళ్లే ఇచ్చారు. ఈ టైటిల్‌ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

  గ్రేట్..

  గ్రేట్..

  తొలుత చిత్రానికి ‘కాటమరాయుడు' అని పెట్టుకున్నారు. కానీ మా చిత్ర యూనిట్ ఆ టైటిల్‌ అడిగితే ఎంతో ఉదాత్తంగా ఇచ్చేయటం గ్రేట్. నటుడు సప్తగిరి, నిర్మాత కిరణ్‌, దర్శకుడిది అరుణ్‌ పవార్‌లది గొప్ప సంస్కారం అని పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ అన్నారు.

  స్పెషల్ షో వేయించుకుని చూస్తాను

  స్పెషల్ షో వేయించుకుని చూస్తాను

  ‘గబ్బర్‌సింగ్‌'లో సప్తగిరి నటించారు. చిన్న వేషం అయినా అది చూసినప్పుడల్లా పడి పడి నవ్వేవాడిని. మామూలుగా సినిమాలను తక్కువ చూస్తా. ఆఖరికి నా సినిమాలు కూడా ఒక్కోసారి చూడను. కానీ సప్తగిరి నటించిన ఈ సినిమా తప్పకుండా చూడాలని కోరిక కలుగుతోంది. ప్రత్యేక షో వేయించుకుని చూస్తా. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు పవన్ కళ్యాణ్.

  త్రివిక్రమ్ కు కావాల్సిన వ్యక్తి

  త్రివిక్రమ్ కు కావాల్సిన వ్యక్తి

  ఈ చిత్ర దర్శకుడు అరుణ్‌ పవార్‌ నాకు బాగా తెలుసు. నా స్నేహితుడు త్రివిక్రమ్‌కి కావల్సిన వ్యక్తి. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాకి సహాయం చేశాడు. తనకు ఈ సినిమాతో మంచి విజయం దక్కాలి''అన్నారు పవన్ కళ్యాణ్.

  లక్షసార్లు చిరంజీవితో..

  లక్షసార్లు చిరంజీవితో..

  ‘‘నా జీవితంలో నేను వూహించలేని సంఘటన ఇది. పుట్టినప్పటి నుంచి చిరంజీవిగార్ని చూస్తూ, అభిమానిస్తూ పెరిగా. నా మనసులో ఆయనతో లక్షసార్లు మాట్లాడాను. అందుకే ఈరోజు పవన్‌ కల్యాణ్‌ గారు నా ఆడియోకి వచ్చారేమో అనిపిస్తోంది అంటూ ఉద్వేగంగా చెప్పారు సప్తగిరి.

  ఒక మెగాభిమానిగా..

  ఒక మెగాభిమానిగా..

  ‘ఇంతమంది మెగా అభిమానుల మధ్య ఒక మెగా అభిమాని ఆడియో ఫంక్షన్‌ జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌గారి సమక్షంలో ఇలాంటి ఓ కార్యక్రమం జరుగుతుందని నా జీవితంలో వూహించలేదు అన్నారు హీరో సప్తగిరి.

  పవన్ ఈ నాడు నా

  పవన్ ఈ నాడు నా

  పుట్టినప్పటి నుంచి మెగాస్టార్‌ చిరంజీవిని చూస్తూ, అభిమానిస్తూ, ఆరాధిస్తూ ఉన్నా.. నేను నిజాయతీ కలిగిన మెగా అభిమానిని కనుకే పవన్‌ నా ఈ కార్యక్రమానికి వచ్చారు అంటూ ఆనందంగా సప్తగిరి చెప్పారు.

  నాలో పవన్ ఆవహించాడు

  నాలో పవన్ ఆవహించాడు

  పవన్ చిన్నపిల్లాడిలా, ఓ యోగిలా, భవిష్యత్తులో చరిత్ర సృష్టించే వ్యక్తిగా కనిపిస్తుంటారు. నాలో ఆయన ఆవహించారు. పవన్‌ సినిమాల కోసం చొక్కాలు చించుకొని థియేటర్లో తిరిగిన రోజులున్నాయి. ఆయన కోసం ఎంత దూరం వెళ్లడానికైనా.. ఏం చేయడానికైనా సిద్ధము''అన్నారు సప్తగిరి.

  పవన్ కు రుణపడి ఉంటాను

  పవన్ కు రుణపడి ఉంటాను

  ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. పవన్ కు రుణపడి ఉంటా. ఇంత చిన్న సినిమాకు రూ.కోట్లు విలువ చేసే అభిమానాన్ని పంచినందుకు పవన్‌కల్యాణ్‌ గారికి ధన్యవాదాలు' అని అన్నారు సప్తగిరి.

  అద్బుతాలు సంభవిస్తాయి

  అద్బుతాలు సంభవిస్తాయి

  ‘‘అద్భుతాలు అనుకొంటే జరగవు. అవి సంభవిస్తాయి. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' అలాంటి సినిమానే. సప్తగిరికి తనపై తనకు ఉన్న నమ్మకాన్ని మెచ్చుకోవాలి. ఏం చేయగలడో తనకు క్లారిటీ ఉంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాడు'' అన్నారు మారుతి.

  నాకంటే మంచిస్దాయికి

  నాకంటే మంచిస్దాయికి

  ‘‘సప్తగిరి ఈ సినిమా గురించి ముందే చెప్పాడు. మంచివాళ్లు కలసి చేసిన సినిమా. నాకంటే మంచి స్థాయికి సప్తగిరి చేరుకోవాలి'' అన్నారు సునీల్‌. సునీల్ మాటలు సప్తగిరిలో ఉత్సాహాన్ని నింపాయి. సునీల్ కూడా కమిడియన్ నుంచి హీరోగా ఎదిగిన వాడే కావటం విశేషం.

  అలీ సలహా..

  అలీ సలహా..

  ‘‘హాస్యనటులు కూడా హీరోలుగా రాణించగలరు. అందుకోసం ఎంత కష్టమైనా పడగలరు. సునీల్‌ సిక్స్‌ప్యాక్‌ చేసి చూపించాడు. అయితే నా సలహా ఒక్కటే. హీరో పాత్రలు లక్కీ లాటరీ లాంటివి. ఒక్కసారే తగులుతాయి. హాస్య పాత్రలే శ్రీరామ రక్ష'' అన్నారు కమిడయన్ అలీ.

  పవన్ ని చూసి నేర్చుకున్నా

  పవన్ ని చూసి నేర్చుకున్నా

  ‘‘జనాల కోసం ఎలా కష్టపడాలో, ఎందుకు కష్టపడాలో పవన్‌ని చూసి నేర్చుకొన్నాం. ఆయన ఆశీర్వాదంతోనే దర్శకత్వ శాఖలో అడుగుపెట్టా. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. గౌతంరాజు లాంటి అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. వాళ్లందరి సహకారం మర్చిపోలేనిది''అన్నారు దర్శకుడు.

  ఈ కార్యక్రమంలో ఇంకా..

  ఈ కార్యక్రమంలో ఇంకా..

  ఈ కార్యక్రమంలో శరత్‌ మరార్‌, రాంప్రసాద్‌, సింధూరపువ్వు కృష్ణారెడ్డి, శివ ప్రసాద్‌, అలీ, కమలాకర్‌రెడ్డి, నాగఅన్వేష్‌, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' చిత్రబృందం పాల్గొన్నారు.

  ట్రైలర్ బాగుంది

  ఈ చిత్రం ట్రైలర్ ని ఆదివారం రాత్రి జరిగిన ఆడియో పంక్షన్ లో విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి...

  శివప్రసాద్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: గోపిని రుణాకర్‌, ఆర్ట్‌: కుమార్‌, స్టంట్స్‌: జాషువా, డైలాగ్స్‌: రాజశేఖర్‌ రెడ్డి పులిచెర్ల, మ్యూజిక్‌: బుల్‌గానిన్‌, ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఆడిషనల్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే: ఎ సప్తగిరి ప్రాజెక్ట్‌, కో ప్రొడ్యూసర్‌: డా.వాణి రవికిరణ్‌.

  English summary
  The audio launch of comedy actor Saptagiri's Telugu movie Saptagiri Express is held in Hyderabad . Power star Pawan Kalyan released its music CDs at the event. Saptagiri Express is one of the most-hyped Telugu movies as it marks the debut of comedian Saptagiri as a hero. The movie is directed by Arun Pawar and produced by Dr K Ravi Kiran under the banner of Sai Celluloid Cinematic Creations Pvt. Ltd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X