»   »  చిరు 150 ఖైదీపుస్తకం లో ఏముంటుంది??? ఇప్పటివరకూ ఇలాంటి ప్రయోగం జరగలేదు

చిరు 150 ఖైదీపుస్తకం లో ఏముంటుంది??? ఇప్పటివరకూ ఇలాంటి ప్రయోగం జరగలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న.., మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావటంతో ఖైదీ నంబర్ 150పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ విషయంలో కూడా చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతీ విషయంలో అభిమానులను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తున్నారు.,,ఇప్పటికే టీజర్, మేకింగ్ వీడియోలతో ఆకట్టుకున్న ఖైదీ టీం, త్వరలో ఈ సినిమా షూటింగ్ అనుభవాలతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

 Special book launch for Mega 150

ఈ పుస్తకంలో ఖైదీ నంబర్ 150 సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల అనుభవాలను ప్రచురించనున్నారు. ఇప్పటికే ప్రింటింగ్ పనులు కూడా మొదలయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు మెగా టీం. చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150, తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో డిసెంబర్ 25న మార్కెట్ లోకి విడుదలవుతోంది.

సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విశేషాలు .. నటీనటులు .. సాంకేతిక నిపుణుల అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే ఈ పుస్తకం ప్రింటింగ్ మొదలైపోయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 25న విజయవాడలోని 'ఇందిరా గాంధి స్టేడియం'లో నిర్వహించనున్నారు. ఈ వేదికపై ఈ సినిమా పుస్తకాన్ని ఆవిష్కరించాలనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది. 'ఖైదీ నెంబర్ 150' సినిమా కోసం ఎదురుచూస్తోన్న అభిమానులు, షూటింగ్ విశేషాలను కూడా ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చన్న మాట.

English summary
For mega fans, the release of "Khaidi No 150" is going to be special. Though the audio launch event of the film is cancelled, we hear that another surprise is in store.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu