twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టెంపర్’ హిట్ అవ్వాలని పాదయాత్ర

    By Srikanya
    |

    హైదరాబాద్ : పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం ‘టెంపర్'. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. హండ్రడ్ పర్శంట్ కన్నింగ్ & కరప్టడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ..దయాగా కనిపించనున్నారు దయ అనే పోలీస్ అథికారిగా దండయాత్ర ఫిబ్రవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    ఈ నేపధ్యంలో ‘టెంపర్' చిత్రం ఘన విజయం సాదించాలని కోరుతూ.. షాద్ నగర్ నుండి శ్రీశైలం మలన్న స్వామి సన్నిధానం వరకు నిర్మాత బండ్ల గణేష్ సోదరుడు, శివబాబు బండ్ల పాదయాత్ర చేస్తున్నారు. నేడు ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. గతంలో ‘గబ్బర్ సింగ్' సినిమా విడుదల సమయంలో కూడా శివబాబు ఇదే తరహాలో పాదయాత్ర చేసి శ్రీశైలం మలన్న స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్' ఘన విజయం సాదించింది. ఇప్పుడు కూడా స్వామి వారి ఆశీసులతో ‘టెంపర్' ఘన విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని బండ్ల గణేష్ వ్యక్తం చేశారు.

    ‘టెంపర్' విశేషాలకు వస్తే...

    జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'. సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానున్నదని సమాచారం. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయమై ప్రకటన చేసి ఉన్నారు. అలాగే .. భ్రమరాంబ థియోటర్ లో గతంలో బాలకృష్ణ లెజండ్ చిత్రం విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ లోగా సీడెడ్ లో చాలా చోట్ల 12 రాత్రి తెల్లారితే 13 అనగా షోలు పడతాయి. అయితే అఫీషియల్ గా ముహూర్తం మాత్రం భ్రమరాంబలో జరగనుంది.

    Special prayers for Temper’s success

    తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈచిత్రాన్ని వెస్ట్ గోదావరిలో పూరి జగన్నాథ్ స్వయంగా విడుదల చేయబోతున్నాడు. ఇందుకోసం ఆయన పాపుల డిస్ట్రిబ్యూటర్ సురేస్ మూవీస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. ఈ జిల్లా రైట్స్ కోసం పూరి జగన్నాథ్ రూ. 2 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

    తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని....ఇంత రేటు పెట్టి మరీ పూరి జగన్నాథ్ కొనడం హాట్ టాపిక్ అయింది. సినిమాపై ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఇలా చేసాడని అంటున్నారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది ఉంది. ‘టెంపర్' చిత్రం చివరి షెడ్యూల్‌కు నిర్మాత బండ్ల గణేష్ డబ్బులు ఇవ్వలేదని, పూరి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడని, అందుకే నిర్మాత ఇలా సెటిల్మెంట్ చేసాడని కొందరు అంటున్నారు. ఇందులో నిజమెంతో తేలాల్సి ఉంది.

    ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

    English summary
    Bandla ganesh tweeted: "My brother Shivababu Bandla has started to Srisailam by walk from our Shadnagar to pray for our TEMPER’s success. He did a similar walk to Srisailam for our Gabbar Singh also.We wish our prayers will be answered this time too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X