Just In
- 4 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 5 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 5 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రేయ్.... జనసేన డే సందర్భంగా స్పెషల్ సాంగ్
హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా ‘రేయ్' షూటింగ్ సమయంలోనే చాలా సమస్యలు ఎదుర్కొంది. షూటింగ్ పూర్తి కావడానికి దాదాపు మూడేళ్లకు పైగా సమయం పట్టింది. షూటింగ్ పూర్తయినా...వివిధ కారణాలతో సంవత్సర కాలంగా విడుదలకు నోచుకోవడం లేదు. ఎట్టకేలకు ఈచిత్రాన్ని మార్చి 27న విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది.
ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు అయిన వైవిఎస్ చౌదరి సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాబట్టేందుకు తన శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ పేరును సినిమా ప్రచారం కోసం వాడుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘రేయ్' మూవీపై స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో మొత్తం పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఉంటుందని టాక్. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే ‘రేయ్' మూవీ మొదలైన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడానికి ఈ అంశాన్ని ఓ సాధనంలా వాడుకోబోతున్నాడట.

స్పెషల్‌గా పవనిజం సాంగును సినిమాలో జొప్పించడంతో పాటు...ఈ సాంగును మార్చి 14న అఫీషియల్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ రోజుకు ఓ ప్రత్చేకత ఉంది. ఇదే రోజు పవన్ కళ్యాన్ జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు. ఈ పాటను ప్రముఖ సినీగేయరచయిత చంద్రబోస్ రాసినట్లు తెలుస్తోంది. దివంగత సంగీత దర్శకుడు చక్రి ఈ సాంగును కంపోజ్ చేసారు.
మరో విశేషం ఏమిటంటే.... ‘రేయ్' మూవీ విడుదల తేదీ అయిన మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సినిమా వైపు ప్రేక్షకులను లాగడానికి చౌదరి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ విషయాలు గమనిస్తే ఇట్టే తెలిసి పోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓపెనింగ్స్ వరకే.... సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చుతుంది అనే దానిపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయనేది వాస్తవం.