twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏంటా మర్మం?, వెన్నుపోటా? : పవన్‌ అంతలా డిస్టర్బ్ అవడం వెనుక!.. .

    |

    'అజ్ఞాతవాసి'.. ఆడియో ఫంక్షన్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఒకింత ఆశ్చర్యాన్నే కలిగించి ఉంటుంది. పవన్ ముభావంగా కనిపించడం.. ఆయన స్పీచులోనూ సినిమా గురించి పెద్దగా ప్రస్తావన లేకపోవడం చాలామందికి అంతుపట్టలేదు.

    దానికి తోడు త్రివిక్రమ్ గురించి ఓ అప్రస్తుత విషయాన్ని ఆయన మాట్లాడటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అటు పూర్తిగా రాజకీయాల గురించి మాట్లాడకుండా.. ఇటు సినిమా ఊసు లేకుండా.. పవన్ ఎందుకలా మనస్తాపంగా కనిపించారో అన్న చర్చ ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

    ఈ నేపథ్యంలో పవన్‌ను వెన్నుపోటు పొడిచిన అజ్ఞాతవాసి ఎవరు? అనే ఓ కథనం తెర పైకి రావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏంటా కథనం..

    అమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనంఅమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనం

    'ఓటమి'పై పదేపదే:

    'ఓటమి'పై పదేపదే:

    ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాక అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే అయి ఉండాలి. తద్వారానే తనదైన ఆలోచనలతో మార్పు ముద్ర వేయగలరు తప్పితే.. వేరొకరి నీడలో అది అంతంత మాత్రం నడకే అవుతుంది.

    కానీ పవన్ టార్గెట్ మాత్రం రాజ్యాధికారం కాకుండా.. ప్రతిపక్ష పాత్ర కోసం వెంపర్లాడినట్లే కనిపిస్తోంది. దానికి తోడు పదేపదే ఓటమి గురించి ఆయన వేదికలపై ప్రస్తావించడం.. ఓటమి తనకు కొత్త కాదని, వెన్ను చూపనని చెప్పడం కొత్త ఊహాగానాలకు తావిస్తోంది.

    అజ్ఞాతవాసి ఆడియో: పవన్ రాకతో దద్దరిల్లిన ఆడిటోరియం.. ఫ్యాన్స్ హంగామాఅజ్ఞాతవాసి ఆడియో: పవన్ రాకతో దద్దరిల్లిన ఆడిటోరియం.. ఫ్యాన్స్ హంగామా

    పరోక్షంగా:

    పరోక్షంగా:

    పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశం గిట్టనివాళ్లు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారో.. లేక ఇటీవల తాను విమర్శించిన నేతలు లేదా పార్టీల నుంచి పరోక్ష హెచ్చరికలు అందుకుంటున్నారో తెలియదు కానీ.. మొత్తానికి అజ్ఞాతవాసి వేడుక మీద పవన్ వ్యాఖ్యలు కూడా సదరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లే కనిపించాయన్న వాదన వినిపిస్తోంది.

    దాని అంతరార్థం ఏంటి?:

    దాని అంతరార్థం ఏంటి?:

    ఓడిపోతానేమో కానీ దెబ్బకొట్టి ఓడిపోతా? అని పవన్ అనడం వెనుక ఉన్న మర్మం తనను టార్గెట్ చేసిన వ్యక్తులను ఉద్దేశించిందేనా? అన్న చర్చ జరుగుతోంది. తనకు ఆదరణ లభిస్తున్న కొద్ది ద్వేషించేవాళ్లు పెరుగుతున్నారన్న ఆయన మాటల వెనుక అంతరార్థం అంతుపట్టడం లేదు. ఆడియో ఫంక్షన్ వేడుకలో తనను ద్వేషించేవాళ్ల గురించి ఓటమి గురించే పవన్ ఎక్కువగా మాట్లాడటం ఈ చర్చకు ఊతమిచ్చింది.

    ఏ సంకేతాలు?:

    ఏ సంకేతాలు?:

    రాజకీయాలంటే.. ఓటమి భయం ఉన్నవాళ్లు కూడా మీడియా ముందు గెలుపు మాదే అన్న ధీమాతో మాట్లాడుతారు. కానీ పవన్ మాత్రం పదేపదే 'ఓటమి' అన్న పదాన్ని ఎందుకు గుర్తుచేస్తున్నారో?.. దాని వెనుక ఎవరి సంకేతాలు ఉన్నాయో అర్థం కావడం లేదు.

    ఇంకా పూర్తి స్థాయి రాజకీయ ప్రవేశం చేయకుండానే.. ప్రయత్నం గురించి ఆలోచించాల్సిందిపోయి అప్పుడే 'ఓటమి' బాధ పవన్ ను ఎందుకు పట్టుకుందనేది సమాధానం లేని ప్రశ్నగానే కనిపిస్తోంది.

    ఎందుకా అప్రస్తుత టాపిక్?:

    ఎందుకా అప్రస్తుత టాపిక్?:

    త్రివిక్రమ్‌కు తానేం సలహాలు ఇవ్వను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అప్రస్తుతం లాగే తోచాయి చాలామందికి. ఈమధ్య ఎక్కడా.. ఎవరూ అలాంటి ఆరోపణలు లేదా కామెంట్స్ చేసిన దాఖలా లేదు.

    పైగా పవన్ కల్యాణే రాజకీయంగా త్రివిక్రమ్ సలహాల్ని తీసుకుంటారన్న ఓ వాదన మాత్రం ఉంది. ఒకవేళ స్పందించాలనుకుంటే పవన్ దానిపై క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది. కానీ దానికి భిన్నంగా 'త్రివిక్రమ్‌కు తానేం సలహాలు ఇవ్వను.. తన నుంచి త్రివిక్రమ్ ఏం తీసుకోడు' అంటూ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది.

    పవన్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే.. సినిమా పరంగానో.. రాజకీయ పరంగానో.. దగ్గరి వ్యక్తులే ఆయన్ను వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించారా? అన్న అనుమానాలు కూడా జనం నుంచి వ్యక్తమవుతున్నాయి.

    మరింత కన్‌ఫ్యూజ్?:

    మరింత కన్‌ఫ్యూజ్?:

    నిర్మాతలు తక్కువకు తీసి, ఎక్కువ లాభం చేసుకోవాలనుకుంటారు అని పవన్ వ్యాఖ్యానించడం కూడా చాలామందిని కన్‌ఫ్యూజ్ చేసింది. పవన్ అజ్ఞాతవాసి నిర్మాతలను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశాడా?.. లేక గతంలో సినిమాల గురించా?.. నిజానికి తాను నిర్మించిన సర్దార్ గబ్బర్ సింగ్ కాస్ట్ ఫెయిల్యూర్ అని పవనే ఒక సందర్భంలో చెప్పుకున్నారు కదా!. మరి ఆయన మాటల్లో ఆంతర్యమేంటో.. మొత్తానికి పవన్ మాత్రం చాలా డిస్టర్బ్ మూడ్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

    English summary
    In Agnyaathavasi Audio event Powerstar Pawan Kalyan was appeared in a moody manner, the reason in not yet revealed but speculations are widely spreading over that.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X