twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు ‘స్పైడర్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది...

    స్పైడర్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సెన్సార్ స్క్రీనింగ్ అనంతరం ఉమైర్ రివ్యూ రాశారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Spyder First Review : డాన్స్ ఇరగదీసిన మహేష్ బాబు

    సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'.

    తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హేరిస్‌ జయరాజ్‌ సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌ సక్సెస్‌ అయింది.

    సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌ కావడం, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కావడంతో సినిమా ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ బయటకు వచ్చింది. విదేశాల్లో ఈ సినిమా సెన్సార్ స్క్రీనింగుకు హాజరైన ఉమైర్ సంధు సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం.....

    కాన్సెప్టు కొత్తేమీ కాదు, మురుగదాస్ సేఫ్ గేమ్

    కాన్సెప్టు కొత్తేమీ కాదు, మురుగదాస్ సేఫ్ గేమ్

    సమాజానికి చెడు చేస్తున్న దుష్టుల ఆటకట్టించడానికి హీరో ప్రయత్నించడం లాంటి కాన్సెప్టులు సౌత్ సినిమాల్లో కొత్తేమీ కాదు. ‘అకీరా' లాంటి ప్లాప్ తర్వాత ఏఆర్.మురుగదాస్ ‘స్పైడర్' సినిమా ద్వారా ఆల్మోస్ట్ సేఫ్ గేమ్ ఆడారు అని.... తెలిపారు.

    సంథింగ్ రేసీ

    సంథింగ్ రేసీ

    కాన్సెప్టు కొత్తగాలేక పోయినా..... మురుగదాస్, అతడి టీం ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ అందించేందుకు ఎన్నో రేసి ఎలిమెంట్స్‌తో సినిమాను నడిపించారు.... అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

    హీరో మహేష్ బాబు కాదు....

    హీరో మహేష్ బాబు కాదు....

    మహేష్ బాబు లాంటి పెద్ద హీరో ఉన్నప్పటికీ.... ‘స్పైడర్' మూవీలో స్క్రిప్టే ఆయన్ను మించిన హీరోగా కనిపించింది. అర్థవంతంగా ఉంది. కొన్ని మసాలా సినిమా స్క్రిప్టుల్లో లాజిక్ సరిగా ఉండదు, కొన్నింటిల్లో అసలు ఉండదు.... స్పైడర్ సినిమా స్క్రిప్టు అలాంటి లోపాలు లేకుండా చాలా బావుందని తెలిపారు.

    ఫస్టాఫ్ కాస్త సాగదీసారు కానీ..

    ఫస్టాఫ్ కాస్త సాగదీసారు కానీ..

    ఫస్టాఫ్ కొంచెం సాగదీసినట్లు అనిపించింది కానీ... సెకండాఫ్ ఫుల్ రేసీగా సాగింది.... అని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.

    టాప్ టెక్నీషియన్స్ గురించి

    టాప్ టెక్నీషియన్స్ గురించి

    టాప్ టెక్నీషియన్స్.... సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తమ బాధ్యత ఎంతో చక్కగా నిర్వర్తించారు. మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిష్ జైరాజ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్సయిందని తెలిపారు.

    మహేష్ బాబు, ఇతరుల గురించి

    మహేష్ బాబు, ఇతరుల గురించి

    మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అటు బుద్ది బలం, ఇటు కండబలంతో కూడిన క్యారెక్టరైజేషన్లో అద్భుతంగా నటించాడు. ఇక సాంగ్స్, డాన్స్, స్టంట్స్ లాంటి అంశాల్లో తన కెరీర్లోనే బెస్ట్ గా చేశారు. పాత్రకు తిగిన విధంగా నటించాలి కాబట్టి అతడిలో హాస్యం తగ్గింది, అదే సరైంది కూడా. అభిమానులకు తప్పకుండా నచ్చుతాడు. రకుల్ అందంగా కనిపించడంతో పాటు బాగా నటించింది. ఇతర నటీనటుల పెర్పార్మెన్స్ బావుంది...అని చెప్పుకొచ్చాడు.

    క్లైమాక్స్ పార్ట్

    క్లైమాక్స్ పార్ట్

    క్లైమాక్స పార్ట్ సింప్లీ బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. టోటల్ లవ్డ్ ఇట్.

    ఓవరాల్

    ఓవరాల్

    ఓవరాల్ గా.... స్పైడర్ మూవీ క్లాస్, మాస్ ప్రేక్షకులకు నచ్చుతుంది. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు, నిరభ్యంతరంగా ఈ సినిమాకు వెళ్లొచ్చు అని తెలిపారు.

    రేటింగ్

    రేటింగ్

    ఈ సినిమాకు ఉమైర్ సంధు 3.5/5 రేటింగ్ ఇచ్చారు. టాలీవుడ్లో, బాలీవుడ్లో గతంలో ప్లాప్ అయిన సినిమాలకు 4 రేటింగ్ ఇచ్చిన ఉమైర్... ఈ సినిమాకు ఇలా తక్కువ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

    స్పైడర్

    స్పైడర్

    జేనర్: థ్రిల్లర్

    దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్
    నటీనటులు: మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె సూర్య
    బాటమ్ లైన్: రేసీ ఎంటర్టెనర్

    English summary
    "Spyder will be Liked by Masses & Classes. Mahesh Babu gave Top Notch Performance. Go for it." Umair Sandhu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X