»   » ‘స్పైడర్’ ఇంటర్వ్యూ: రాజకీయాలపై మహేష్ బాబు స్పందన (ఫోటోస్)

‘స్పైడర్’ ఇంటర్వ్యూ: రాజకీయాలపై మహేష్ బాబు స్పందన (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'స్పెడర్‌' టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది.

క్లైమాక్స్‌, రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 23న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


తమిళ మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో

తమిళ మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో

ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా మ‌హేష్‌బాబు ఓ తమిళ మ్యాగజైన్ కి ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు, ఇతర విషయాలను పంచుకున్నారు. స్పైడర్ మూవీలో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌ మెడికల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని తెలిపారు.


తమిళంలో ఎంట్రీ

తమిళంలో ఎంట్రీ

'స్పైడర్' సినిమాతో తమిళనాడులోనూ అడుగుపెట్టబోతున్నాడు మహేష్ బాబు. తమిళంలో కూడా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


చెన్నైతో అనుబంధం గురించి

చెన్నైతో అనుబంధం గురించి

తమిళ మేగజైన్ ఆనంద వికటన్ కు మహేష్ బాబు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. 25 ఏళ్ల పాటు చెన్నైలోనే పెరిగానని... తెలుగుతోపాటు తమిళంలో కూడా చాలా బాగా మాట్లాడతానని తెలిపాడు. హీరోలు సూర్య, కార్తీలు తనకు స్కూల్ మేట్స్ అని మహేష్ అన్నారు.


విజయ్ తో కలిసి సినిమా చేద్దామనుకున్నా

విజయ్ తో కలిసి సినిమా చేద్దామనుకున్నా

కోలీవుడ్ లో విజయ్ మంచి మిత్రుడని అని చెప్పిన మహేష్ బాబు.... ఇద్దరం కలసి మణిరత్నం సినిమాలో నటించాలనుకున్నా అది కుదరలేదని ఈ సందర్భంగా వెల్లడించారు.


రాజకీయాల గురించి..

రాజకీయాల గురించి..

రాజకీయాల గురించి తనకు ఏమీ తెలియదని... రాజకీయాల్లోకి రావాలో? వద్దో? కూడా తనకు తెలియదని ఈ సందర్భంగా ఎదురైన ఓ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం ఇచ్చారు.


విలన్ పాత్రలో సూర్య

విలన్ పాత్రలో సూర్య

ఈ చిత్రంలో మహేష్ బాబుకు విలన్ గా ఎస్.జె.సూర్య కనిపించబోతున్నారు. స్పై(గూడాచారి) కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.


స్పైడర్

స్పైడర్

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఠాగూర్‌ మధు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.


English summary
The first look of Superstar Mahesh Babu’s Spyder is out and it is trending prominently on social media since last night. Spyder is Mahesh’s first major attempt to penetrate into Tamil market and he gave an exclusive interview to the popular Tamil weekly magazine Ananda Vikatan and spoke at length about various topics. Mahesh also said he is a good friend of Tamil Superstar Ilayathalapathy Vijay and that he was disheartened when Mani Ratnam’s Ponniyan Selvan, that was supposed to star Mahesh and Vijay, was shelved.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu