For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్లీ వార్తల్లోకి సింగర్​ శ్రావణ భార్గవి.. చాలా రోజుల తర్వాత అలా

  |

  టాలీవుడ్​ ప్రముఖ సింగర్​ శ్రావణ భార్గవి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్రసీమలో తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ బ్యూటిఫుల్​ సింగర్​ ఇటీవల వివాదాలతో హాట్​ టాపిక్​గా మారింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రావణ భార్గవి సోషల్​ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉంటుంది. విభిన్నమైన కాన్సెప్ట్స్​తో వ్లోగ్స్​ చేస్​తూ అటు నెటిజన్లను, ఇటు అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే అన్నమయ్య కీర్తన అయినటువంటి ఒకపరి కొకపరి పాటను తనదైన స్టైల్​లో వీడియో చేసి యూట్యూబ్​లో ఒదిలింది. ఇది చూసిన పలువురు అగ్గిమీద గుగ్గిలం అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోను డిలీట్​ చేసి వివాదానికి పుల్​స్టాప్​ పెట్టిన శ్రావణ భార్గవి మళ్లీ వార్తల్లో నిలిచింది.

  1989 ఆగస్టు 16న జన్మించిన శ్రావణ భార్గవి సంగీతంపై ఉన్న ఆసక్తితో గాయనీగా తెలుగు సినీ పరిశ్రమకు రంగప్రవేశం చేసింది. వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​ సినిమాతో సింగర్​గా ఎంట్రీ ఇచ్చిన శ్రావణ భార్గవి అనతి కాలంలోనే పాపులర్​ సింగర్​గా పేరు తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ నటించిన సింహ సినిమాలోని సింహమంటి చిన్నోడే అంటూ పాడి వెండితెరపై తన గాత్రంతో మ్యాజిక్​ చేసింది.

   అగ్ర హీరోల సినిమాల్లో..

  అగ్ర హీరోల సినిమాల్లో..

  అనంతరం పవన్​ కల్యాణ్​ తీన్​మార్ చిత్రంలోని అలే బలే​, బార్బీ బొమ్మకి, మహేశ్​ బాబు ఖలేజా మూవీలోని భూం శకనక, అల్లు అర్జున్​ బద్రీనాథ్​లోని అంబదరి పాటలు పాడి గుర్తింపు తెచ్చుకుంది. కందిరీగ, దమ్ము, లైఫ్ ఈజ్​ బ్యూటిఫుల్, రెబెల్, కెమెరా మ్యాన్​ గంగంతో రాంబాబు, దేనికైనా రెడీ, కృష్ణం వందే జగద్గురుం, రాజన్న, సోలో వంటి తదితర చిత్రాలలో సాంగ్స్​ పాడి ఆకట్టుకుంది.

  హీరోయిన్స్​కు డబ్బింగ్​..

  హీరోయిన్స్​కు డబ్బింగ్​..

  దివంగత మ్యూజిక్​ డైరెక్టర్​ చక్రి, మణిశర్మ, ఎమ్​ఎమ్​ కీరవాణి, ఎస్ తమన్, దేవి శ్రీ ప్రసాద్, మిక్కీ జె మేయర్ వంటి తదితర ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేసింది. స్టార్​ హీరోలతోపాటు యువ కథానాయకుల సినిమాలకు పాటలు పాడిన శ్రావణ భార్గవి గబ్బర్​ సింగ్, ఈగ, రామయ్యా వస్తావయ్యా, లవ్​ ఫెయిల్యూర్​ వంటి చిత్రాల్లో హీరోయిన్స్​కు గాత్రం (డబ్బింగ్​) అందించింది.

  2018లో చివరిగా..

  2018లో చివరిగా..

  అయితే శ్రావణ భార్గవి తాజాగా మరోసారి తన గాత్రంతో సినీ ప్రేక్షకులను, అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. శ్రావణ భార్గవి చివరిసారిగా యంగ్​ హీరో నితిన్, రాశీ ఖన్నా నటించిన శ్రీనివాస కల్యాణం సినిమాలో పాట పాడింది. ఆ సినిమా 2018లో విడుదలైంది. అంటే సుమారు నాలుగేళ్ల తర్వాత మళ్లీ తన వాయిస్​తో మ్యాజిక్​ చేయనుంది శ్రావణ భార్గవి.

  లైగర్​ సినిమాతో..

  లైగర్​ సినిమాతో..

  టాలీవుడ్​ డ్యాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్​ విజయ్​ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని పాటలకు విశేష స్పందన వచ్చింది. అందులోనూ మోస్ట్​ రొమాంటిక్​ సాంగ్​ ఆఫ్​ ది ఇయర్​గా వచ్చిన ఆఫత్​ పాట అమితంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్​ తెలుగు వెర్షన్​ను బ్యూటిఫుల్​ సింగర్​ శ్రావణ భార్గవి ఆలపించింది. సో ఫైనల్​గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ తన వాయిస్​ వినిపించనున్న శ్రావణ భార్గవి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

  English summary
  Singer Sravana Bhargavi Again Coming Up With Romantic Song Aafat Song In Vijay Devarakonda Puri Jagannath Liger Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X