»   » బాలకృష్ణ నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ తో కన్ఫర్మ్?

బాలకృష్ణ నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ తో కన్ఫర్మ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపీచంద్ హీరోగా లక్ష్యం వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన శ్రీవాస్...తాజాగా బాలకృష్ణతో సినిమా చేయటానికి కమిటయ్యారని సమాచారం. బాలయ్య తో మిత్రుడు చిత్రాన్ని నిర్మించిన కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇక వాసు చెప్పిన కథని మొదటి సిట్టింగ్ లోనే బాలకృష్ణ ఓకే చేసారని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీవాస్...రామ్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా రామ రామ కృష్ణ కృష్ణ అనే చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. బాలకృష్ణ...బోయపాటి శ్రీను కాంబినేషన్లో రెడీ అవుతున్న సింహా చిత్రం ఏప్రియల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సింహా అనంతరం ఈ చిత్రమే సెట్స్ మీదకు వెళ్ళనుంది. అన్నీ అనుకూలిస్తే ఈ వేసవికే బాలకృష్ణ, శ్రీవాసు ల చిత్రం సెట్స్ మీదకు వెళ్ళే అవకాసం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu