అదే తిరిగి వచ్చేస్తుంది.. రూమర్ల మధ్య మెగా డాటర్ శ్రీజ నర్మగర్భంగా పోస్ట్
గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో తన భర్త కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో వారి మధ్య ఏదో జరిగిందని, ఇంకేముంది వారి విడాకుల ప్రకటన కూడా వచ్చేస్తుంది అంటూ రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయం మీద మెగా ఫ్యామిలీ నుంచి కానీ కళ్యాణ్ దేవ్ తరపు నుంచి కానీ ఇప్పటిదాకా ఎవరూ నోరు విప్పలేదు. కానీ అనూహ్యంగా ఆమె చేస్తున్న పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఆమె ఒక పోస్ట్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

విభేదాలు
మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి కుమార్తె శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. అయితే ఆయనతో విడిపోయి తిరిగి ఆమె తన ఇంటికి వచ్చేయడంతో ఇటీవల చిరంజీవి కుటుంబ సభ్యులు కళ్యాణ్ దేవ్ తో వివాహం జరిపించారు. అయితే గత కొద్ది రోజులుగా కల్యాణ్ దేవ్, శ్రీజ మధ్య విభేదాలు ఉన్నాయని, వారిద్దరు విడిపోతున్నారు అనే వార్త మీడియాలో హల్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.

తొలగించడంతో
శ్రీజను వివాహం చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన రెండో సినిమా సూపర్ మచ్చి మొన్న సంక్రాంతికి విడుదలైంది కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ విషయం మీద పెద్ద చర్చ జరిగింది. ఆ తరువాత ఆమె సోషల్ మీడియాలో తన పేరులో ఉన్న కళ్యాణ్ దేవ్ తొలగించడంతో ఈ అంశం మీద మరింత చర్చ జరిగింది.

ఫోటోలు కూడా వైరల్ గా
ఈ నేపథ్యంలోనే శ్రీజ గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఎలాంటి పోస్ట్ పెట్టినా ఎలాంటి ఫోటోలు షేర్ చేసినా కూడా అది వెంటనే క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య తన సోదరి దుఃఖంలో ఉందని తెలుసుకున్న రామ్ చరణ్ తనతోపాటు ముంబై పర్యటనకు కూడా తీసుకు వెళ్ళిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి..

షేర్ చేసి
అయితే ఇప్పుడు శ్రీజ కొణిదెల ఇంస్టాగ్రామ్ లో చేసిన ఒక పోస్ట్ సంచలనం రేపుతోంది. మనం అవతలి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఏదైతే ఇస్తామో అదే మనకు వందరెట్లు తిరిగి వస్తుంది అంటూ ఇంగ్లీషులో ఉన్న ఒక కొటేషన్ ను శ్రీజ షేర్ చేసింది.

ఎవరి గురించి కామెంట్
శ్రీజ ఈ కొటేషన్ ఎవరి గురించి అయినా ఉద్దేశించి పెట్టిందో లేక సాధారణంగా పెట్టిందో తెలియదు కానీ ఎవరి గురించి కామెంట్ చేసింది అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఒకపక్క మెగాస్టార్ చేస్తున్న సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తూనే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక కొత్త బ్యానర్ సృష్టించి దాని ద్వారా వెబ్ సిరీస్ నిర్మించే పనిలో పడింది.


Click it and Unblock the Notifications











