Just In
- 5 hrs ago
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- 6 hrs ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
- 7 hrs ago
ఎవ్వరూ తగ్గడం లేదు.. కోల్డ్ వార్ ముదిరింది.. కొత్త షోలతో బుల్లితెరపై ఫైట్
- 7 hrs ago
బ్లాక్‌లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
Don't Miss!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్యామిలీతో కలిసి అలా.. అన్ని హంగులతో నూతన గృహాన్ని నిర్మిస్తోన్న శ్రీముఖి
బుల్లితెరపై, వెండితెరపై శ్రీముఖి మంచి మార్కులే కొట్టేసింది. అయితే బుల్లితెరపైనే శ్రీముఖి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. నేను శైలజ, జులాయి, జెంటిల్‌మెన్ వంటి సినిమాలు చేసినా కూడా శ్రీముఖికి అంత క్రేజ్ రాలేదు. కానీ పటాస్, బిగ్ బాస్ షోలు అనేవి శ్రీముఖి లైఫ్ టర్న్ చేసేశాయి. పటాస్ షోతో శ్రీముఖికి ఒక రకమైన ఇమేజ్ వస్తే.. బిగ్ బాస్ తరువాత మరో ఇమేజ్ వచ్చింది. అయితే బిగ్ బాస్ ద్వారా కాస్త నెగెటివిటీని మూట గట్టుకున్నా కూడా చివరకు శ్రీముఖికి మంచే జరిగింది.

బిగ్ బాస్ కంటే ముందు..
శ్రీముఖి బిగ్ బాస్ షో కంటే ముందు ఫుల్ బిజీగా గడిపేది. పటాస్ షో, ఇతర ఈవెంట్లు, షోలతో సందడి చేసేది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌గా శ్రీముఖి రికార్డు క్రియేట్ చేసింది. విన్నర్‌గా నిలిచిన రాహుల్ కంటే రన్నర్ అయిన శ్రీముఖికే ఎక్కువ రెమ్యూనరేషన్ వచ్చిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

బిగ్ బాస్ తరువాత..
అయితే బిగ్ బాస్ తరువాత బుల్లితెరపై అడల్డ్ కామెడీ షోలకు దూరంగా ఉంది. కాస్త పద్దతైన షోలనే చేస్తానని చెప్పుకొచ్చింది. తన అభిమానులు తలెత్తుకునే పనులే చేస్తానని చెబుతూ కొన్ని రోజులు అన్నింటికి దూరంగానే ఉంది. ఆ తరువాత స్టార్ట్ మ్యూజిక్ అనే ఓ షోను చేసింది. అది అంతగా వర్కవుట్ కాలేదు.

ప్రస్తుతం ఫుల్ బిజీగా..
అయితే శ్రీముఖి మాత్రం ప్రస్తుతం ఫుల్ బిజీ అయింది. ఓ వైపు బొమ్మ అదిరింది.. మరో వైపు ఉమెనియా షో అంటూ యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. ఇవి కాక దసరా దీపావళి అంటూ స్పెషల్ ఈవెంట్లతో నానా హంగామా చేస్తోంది. ఇప్పుడు మళ్లీ శ్రీముఖి సంపాదన ఓ రేంజ్‌లో పెరిగిపోయిందని టాక్.

నూతన గృహం..
శ్రీముఖి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కొత్త ఆరంభం అంటూ ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కొత్తింటి నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అసలు విషయం చెప్పింది. కొత్తింటిని అన్ని హంగులతో నిర్మిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇంటి ముందు గుమ్మాన్ని నేడు ప్రతిష్టించినట్టు తెలుస్తోంది.

మొత్తానికి అందరూ అలా..
అయితే బిగ్ బాస్ షో పుణ్యమా అని అందరూ కొత్తింట్లోకి వెళ్లిపోతున్నారు. శివ జ్యోతి ఆల్రెడీ గతేడాది కొత్తింట్లోకి వెళ్లింది. అలీ రెజా కూడా ఓ లగ్జరీ అపార్ట్మెంట్‌ను చూశాడు. త్వరలోనే వెళ్తామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు శ్రీముఖి వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక రాహుల్ బెంజ్ కారు కొనుక్కుని ఎంజాయ్ చేస్తున్నాడు.