»   » మాజీ క్రికెటర్ శ్రీశాంత్...తెలుగు సినిమా విశేషాలు!

మాజీ క్రికెటర్ శ్రీశాంత్...తెలుగు సినిమా విశేషాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిషేదానికి గురైన క్రికెట్ శ్రీశాంత్ తెలుగు సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ‘స్నేహ గీతం' ఫేం మధుర శ్రీధర్ ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో శ్రీశాంత్ హీరోగా నటిస్తున్నాడు. షిరిడి సాయి కంబైన్స్ బేనర్లో ఎంవికె రెడ్డితో కలిసి మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగస్టులో మొదలవుతుందని తెలుస్తోంది. షూటింగ్, ప్రొస్టు ప్రొడక్షన్ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Sreesanths Telugu film details

ఇప్పటికే శ్రీశాంత్ పలు టీవీ షోల్లో నటించాడు. తనపై పడ్డ ఫిక్సింగ్, నిషేదం మచ్చను తొలగించుకోవడానికి శ్రీశాంత్ ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగానే అతడు సినిమాల బాట పట్టాడు. మరో విషయం ఏమిటంటే శ్రీశాంత్ త్వరలో తండ్రి కాబోతున్నాడు.

శ్రీశాంత్ ఇప్పటికే ఓ మళయాల చిత్రంలో గెస్ట్ రోల్ చేసాడు. పలు సందర్భాల్లో తెలుగు సినిమాల్లో పని చేయాలని ఉందంటూ వ్యాఖ్యలు చేసాడు. క్రికెట్ ద్వారా తపై పడ్డ మాయని మచ్చను......ఈ సినిమా రంగంలో ప్రవేశించడం ద్వారా తుడిచేసుకోవాలని ప్రయత్నిస్తున్న శ్రీశాంత్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

English summary
Banned cricketer Sreesanth has signed a Telugu film, which is going to be directed by Madhura Sreedhar of 'Sneha Geetham' fame. This film is going to hit the floors in August
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu