»   » సంగీత దర్శకుడు 'శ్రీ' ఆరోగ్యం విషమం

సంగీత దర్శకుడు 'శ్రీ' ఆరోగ్యం విషమం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి గారికుమారుడు గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు శ్రీ(కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి). ఆయన అనారోగ్యంతో గురువారం రాత్రి కిమ్స్ హాస్పటిల్ లో చేరారు. కిడ్నా సంభంధిత వ్యాధులతో ఆయన భాధపడుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమం అని చెప్తున్నారు. ఆయన ఆరోగ్యానికి సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sri Health Condition is Critical

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఆయన గతంలో తెలుగులో గాయం, అమ్మోరు తో సహా దాదాపు ఇరవై చిత్రాలుకు పనిచేసారు. ముఖ్యంగా..ఆయన చేసిన చిత్రాల్లో అనగనగా ఒక రోజు, సింధూరం చిత్రాలు పాటలు బాగా ప్రజాదరణ పొందాయి. శ్రీ కేవలం సంగీత దర్శకుడుగానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా కూడా పనిచేసారు.

2005లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందిన చక్రం చిత్రంలోని 'జగమంత కుటుంబం' పాటను ఆయనే పాడారు. రీసెంట్ గా శ్రీ...ఆడు మగాడురా బుజ్జీ, గోపీచంద్ సాహసం చిత్రాలకు పనిచేసారు. ఆయన త్వరగా కోలుకుని మరిన్ని మంచి పాటులు అందించాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది.

English summary
Tollywood Music director Sri aka Kommineni Srinivasa Chakravarthy son of popular music composer and late Chakravarthy is battling for life and he was admitted in hospital.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu