twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిపై కేసు పెట్టబోతున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: కడప జిల్లా రైల్వేకోడూరులో శనివారం శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా వ్యవహారం సమస్యగా మారి, చిరంజీవి మెడకు చుట్టుకోనుంది. దానికి కారణం ప్రధాన రహదారుల్లో ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో విగ్రహాలు ఏర్పాటు చేయరాదని అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించాలని గతంలో సుప్రీం ఆదేశించిన విషమే.

    అందుకు భిన్నంగా విగ్రహావిష్కరణకు వచ్చారంటూ చిరంజీవి, సి.రామచంద్రయ్య, ఎమ్మెల్సీ చెంగాల్రాయుడు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టీటీడీ బోర్డు సభ్యుడు హరిప్రసాద్‌ తదితరులపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఈ విషయమై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.

    ఇక ఇదే వేదికపై చిరంజీవి తన 150వ సినిమా విషయమై తొలిసారి పెదవి విప్పారు . కడప జిల్లా రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరి ఆశీస్సులతోనే సినిమా ప్రారంభమవుతుందని చెప్పారు. మునుపటిలాగే తనను ఆదరించాలని కోరారు. చిరంజీవిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చిత్రం విషయానికి వస్తే...

    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈచిత్రానికి ప్రస్తుతం ‘ఆటోజానీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించబోతున్నారు.

    Sri Krishnadevaraya Statue Issue: Case Against Chiranjeevi

    ఈ సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ... ఈ స్టోరీ నేను ఇప్పటికే విన్నాను. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ తెలిపారు. ఇలాంటి చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం దక్కినా అదృష్టంగానే భావిస్తానని చరణ్ చెప్పుకొచ్చాడు.

    సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్ గా‌ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు.

    కాపీ వివాదం... చిరంజీవి 150వ సినిమా ప్రకటన అలా వచ్చిందో లేదో...ఇలా వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

    ‘ఆటోజానీ స్టోరీ పూర్తిగా నేను ఒరిజినల్ గా తయారు చేసినల్ స్టోరీ. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు. పూరి స్వయంగా వివరణ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నాడు.

    కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా గురించి వార్తలు రావడం, ఇప్పటివరకూ అవి వాస్తవ రూపం ధరించకపోవడం తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా రామ్‌చరణ్‌ ఈ సినిమా విషయాన్ని ధృవీకరించంటం అభిమానుల్లో చెప్పలేని ఆనందం కలిగించింది. నిజానికి కొద్ది రోజుల క్రితమే బండ్ల గణేశ్‌ ఈ విషయాన్ని పరోక్షంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పూరి కూడా తన ఉద్వేగాన్ని బయటపెట్టకుండా ఉండలేకపోయారు.

    ఇక ఈ చిత్రానికి కథను అందిస్తున్న బీవీఎస్‌ రవి ‘‘మెగాస్టార్‌ నుంచి అంగీకారం పొందడం ఎంతో ఉత్తేజంగా, ఉద్వేగంగా ఉంది'' అని తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ చిరంజీవి జన్మదినమైన ఆగస్ట్‌ 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆ రోజు ఆయన షష్ఠి పూర్తి కావడం కూడా విశేషం.

    చిరంజీవి హీరోగా నటించిన చివరి సినిమా ‘శంకర్‌దాదా జిందాబాద్‌' 2007 జూలైలో విడుదలైంది. అంటే అది వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి హీరోగా ఆయన కెమెరా ముందుకు రాబోతున్నారన్న మాట.

    English summary
    Chiranjeevi inaugurated the statue of Sri Krishnadevaraya at Railway Kodur in Kadapa on Saturday. Now someone want to put a case on him about this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X