twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ వాడుకోమన్నారు, నా వాడకం ఎలా ఉంటుందో చూపిస్తా: శ్రీరెడ్డి

    By Bojja Kumar
    |

    ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ అయిన నటి శ్రీరెడ్డి బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ తన లాయర్లతో వచ్చి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తరుపున కళానిధితో పాటు నలుగురు లాయర్లు ఉండబోతున్నారని, రచన రెడ్డి, పట్టాభిగారు కూడా తన తరుపున వాదించబోతున్నారని ఆమె తెలిపారు.

    Recommended Video

    Sri Reddy sensational Comments On Pawan Kalyan Again

    'లా'ను వాడుకోమన్నారుగా పవన్ కళ్యాణ్ గారు... ఇక 'లా'ను మేము వాడుకున్నంతగా ఇక ముందు ఎవరూ వాడుకోరేమో? అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. క్యాష్ కమిటీలో రానా, సుప్రియ, ప్రియాంక దత్ ఉండటాన్ని అంగీకరించబోమని శ్రీరెడ్డి తెలిపారు. నాగబాబు మాట్లాడిన తీరును కూడా ఆమె తప్పుబట్టారు.

     పవన్ కళ్యాణ్ మీరు వీరనారి విభాగం

    పవన్ కళ్యాణ్ మీరు వీరనారి విభాగం

    కొందరు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి నా మీద మాటల దాడి చేస్తున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు అడ్డుకోవడం లేదని శ్రీరెడ్డి ప్రశ్నించారు. ఈ అల్లర్లన్నీ అయిపోయిన తర్వాత మీరు వీరనారి విభాగం అనౌన్స్ చేశారు. మేము అడిగినప్పుడే ఆ వీరనారి విభాగం ఏర్పాటు చేసి ఉంటే బావుండేది కదా సర్ పవన్ కళ్యాణ్ గారు.... అంటూ శ్రీరెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

     లా అండ్ ఆర్డర్ మీరెందుకు ఫాలో అవ్వలేదు సర్

    లా అండ్ ఆర్డర్ మీరెందుకు ఫాలో అవ్వలేదు సర్

    నేను గొడవలు పెట్టుకోవడానికి రాలేదు. మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. లా అండ్ ఆర్డర్ మీరెందుకు ఫాలో అవ్వలేదు సర్,

    మీ వాళ్లు అంత రెచ్చిపోతుంటే ఆడ పిల్లల మీద అలా మాట్లాడొద్దు అని మీరు ఎందుకు అనట్లేదు. ఈ రోజుకీ ఇంత ట్రోల్ జరుగుతోంది. వారం రోజుల నుండి నేను హౌస్ అరోస్టులో ఉన్నాను, సరిగా తిండి కూడా తినడం లేదు. ట్రోల్ చేయొద్దు అని ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది సర్... అంటూ పవన్ కళ్యాణ్‌ను శ్రీరెడ్డి ప్రశ్నించింది.

     రానా, సుప్రియ క్యాష్ కమిటీలో ఉంటే ఒప్పుకోం

    రానా, సుప్రియ క్యాష్ కమిటీలో ఉంటే ఒప్పుకోం

    అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? మీ పెద్ద కుటుంబాలే ఇండస్ట్రీలో ఉండాలా? ఇపుడు క్యాష్ కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీలో కూడా మళ్లీ ఆ నాలుగు కుటుంబాల నుండే. ఎవరైతే అభిరామ్ అనే అతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ల అన్నయ్య రానా, సుప్రియను నియమించారు. అమ్మాయిలు సమస్య చెబితే వినిపించుకోవడానికి వారికి సమయం ఉందా? వారికి అంత ఓపిక ఉందా? అశ్వీనీదత్ కూతురు కూడా అందులో ఉందని అంటున్నారు. వారు క్యాష్ కమిటీలోకి వస్తే మేము అంగీకరించబోమని శ్రీరెడ్డి తెలిపారు.

     పట్టం కట్టేసి, శాలువాలు కప్పుతారని రాలేదు

    పట్టం కట్టేసి, శాలువాలు కప్పుతారని రాలేదు

    నేను ఏదీ ఆశించి రాలేదు. మా ఆడపిల్లల ససమ్యలపై, 24 క్రాప్ట్స్ లో ఉన్న సమస్యలను ఎండగట్టడానికి శ్రీ ముందుకొచ్చింది. ఇక నుండి పోరాటం చేస్తూనే ఉంటా. అంతేకానీ ఉమెన్ వింగ్‌లోనో, క్యాష్ కమిటీలోనో నన్ను వేసి పట్టం కట్టేసి, శాలువాలు కప్పుతారని రాలేదు.

     అవును నేను అన్నింటికీ తెగించి వచ్చా?

    అవును నేను అన్నింటికీ తెగించి వచ్చా?

    వెనక ముందు తల్లిదండ్రులు లేరు కాబట్టే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని చాలా మంది అంటున్నారు. అవును నేను తెగించి వచ్చా? మీరు నన్ను హత్య చేయిస్తారా? రౌడీ షీటర్లతో కొట్టిస్తారా? పవన్ అభిమానులమని చెప్పి విచ్చలవిడి మాటలు మాట్లాడితే ఊరుకుంటామనుకుంటున్నారా? ఎవరికీ భయపడేది లేదు అని శ్రీరెడ్డి అన్నారు.

    మా అమ్మను అన్నారు, నాకు ఎయిడ్స్ అన్నారు

    మా అమ్మను అన్నారు, నాకు ఎయిడ్స్ అన్నారు

    నువ్వు ఎందుకు ఆ మాట అన్నావు శ్రీరెడ్డి అని మీరు అనొచ్చు. కానీ అంతకు ముందు మమ్మల్ని, మా అమ్మని ఎంత దారుణంగా అన్నారో సాక్ష్యాలు చూపిస్తాను. నేను ఎయిడ్స్ వచ్చి పోయానని కూడా అన్నారు.... అని శ్రీరెడ్డి తెలిపారు.

     హుందాగా మాట్లాడాల్సింది పోయి ఈ బెదిరింపులేమిటి?

    హుందాగా మాట్లాడాల్సింది పోయి ఈ బెదిరింపులేమిటి?

    నాగ బాబు గారు ఆ రోజు తూతూ మంత్రం లాగా ఏదో చెప్పడం కాదు. మా అసోసియేషన్ తరుపున రిప్రజంట్ చేసే ఒక వ్యక్తి ఎంత హుందాగా మాట్లాడాలి. నా తమ్ముడు ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత మీ దుమ్ము దులుపుతాడు, మీ అంతం చూస్తాడు. ఏమిటీ బెదిరింపులు. మేమంటే చిన్న పిల్లలం. ఏదో తప్పులు మాట్లాడాం. మీ వయసుకు మీరు మాట్లాడింది ఏమిటి? ఎవరిని బెదిరిస్తున్నారు. మీరేమైనా పోలీసా? లాయరా? ఏం చూసుకుని చూసుకుని మాట్లాడుతున్నారు.... అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

    English summary
    Sri Reddy Press Meet about Pawan Kalyan At Somajiguda Press Club. Check out Sri Reddy Press Meet full Details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X