»   » కళ్ళ ముందు జరిగే అన్యాయాలకి గుండె మండి.... అంటూ మహేష్

కళ్ళ ముందు జరిగే అన్యాయాలకి గుండె మండి.... అంటూ మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ 'శ్రీశ్రీలు ఎక్కడ నుంచో పుట్టుకురారు..కళ్లముందు జరిగే అన్యాయాలకు గుండె మండే ప్రతీ ఒక్కరూ శ్రీశ్రీనే ' అంటూ మహేష్ చెప్పిన వాయిస్ ఓవర్ తో ట్రైలర్ విడుదలైంది. మీకు అర్దమై ఉంటుంది. ఏ ట్రైలర్ గురించి చెప్తున్నామో..అవును..సూపర్ స్టార్ కృష్ణగారి తాజా చిత్రం శ్రీశ్రీ ట్రైలర్ గురించే. తాజాగా రిలీజైన ఈ ట్రైలర్ ..మహేష్ వాయిస్ తో పాపులర్ అవుతోంది. మీరూ ఈ ట్రైలర్ ని చూడండి.


ఏడు పదుల వయస్సులోను ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న సూపర్ స్టార్ కృష్ణ తాజా చిత్రం ఇది. ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీశ్రీ అనే చిత్రం ఆడియో వేడుక జరిగి చాలా కాలం అయినా రిలీజ్ మాత్రం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.


అయితే తాజాగా శ్రీశ్రీ మూవీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. మే 31న కృష్ణ పుట్టిన రోజు కనుక ఆయన బర్త్ డే కానుకగా జూన్ 3న సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అలనాటి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే అన్నదే కథాంశం అని దర్శకుడు తెలిపాడు.


తన యాభై సంవత్సరాల తన సినీ ప్రస్థానంలో ఎన్నో అద్బుతమైన సినిమాలు చేసిన కృష్ణకు శ్రీ శ్రీ మూవీ కూడా మరింత పేరు ప్రఖ్యాతలు తెస్తుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వగా విజయ నిర్మల, నరేష్, సుధీర్ బాబు తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు.


Sri Sri Theatrical Trailer with Mahesh Babu Voice Over

వాస్తవానికి ఇప్పటికే సినిమా విడుదల కావాల్సి ఉన్నా..... ఇంకాకావడం లేదు. ఇందుకు కారణం ఈ చిత్రాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాక పోవడం వల్లే అని అంటున్నారు. కృష్ణ సినిమాలకు ఇపుడు డిమాండ్ లేక పోవడమే అందుకు కారణం అని టాక్. శ్రీశ్రీలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.


ఆ మాట విన్న చాలా మంది బయ్యర్లు ఈసినిమా కొందామనే ఆలోచనకు వచ్చారు. అయితే మహేష్ బాబు ఇందులో నటించడం లేదని తెలిసిన తర్వాత అంతా కామ్ అయిపోయారు. మహేష్ బాబు ఏదైనా చిన్నపాత్ర చేసి ఉంటే పరిస్థితిమరోలా ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Tollywood superstar Krishna is coming back on the silver screen with a new powerful revenge drama ‘Sri Sri’, directed by Muppalaneni Siva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu