»   » విలన్‌‌గా శ్రీవిష్ణు.. మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ రెడీ!

విలన్‌‌గా శ్రీవిష్ణు.. మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ రెడీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల తనదైన నటనతో ఆకట్టుకొంటున్న యువ హీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన 'మెంటల్ మదిలో', 'నీది నాది ఒకే కథ' చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి. శ్రీ విష్ణు అతిథి పాత్రల్లో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. ఉన్నది ఒకటే జిందగీ, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు నటుడిగా ఆయనను మరో మెట్టు ఎక్కించాయి.

నీది నాది ఒకే కథ చిత్రం తర్వాత వీరభోగ వసంత రాయలు, తిప్పరా మీసం చిత్రాల్లో శ్రీవిష్ణు నటిస్తున్నారు. హీరోగా, అతిథి పాత్రల్లోనే కాకుండా విలన్‌గా కూడా తెరపైన కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Sri Vishnu is going to play villain in his next venture

విలన్‌గా నేను నటించనున్నాను. కథ కూడా రెడీ అయింది. త్వరలో అధికారికంగా వివరాలు వెల్లడిస్తాను అని శ్రీవిష్ణు చెప్పారు.

English summary
Sri Vishnu's latest movie Needi Naadi Oke Katha movie gets huge applause from all corners. After Needi Naadi Oke Katha success, he is doing project like Veera Bhoga Vasantha Rayalu, Tippara Meesam. Sri Vishnu revealed that He is going to play Bad Guy in his next venture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X