»   » బోనీ అలా... నా బ్రతుకెట్లా? నా పిల్లల బ్రతుకెట్లా?: బంధువులతో శ్రీదేవి గోడు!

బోనీ అలా... నా బ్రతుకెట్లా? నా పిల్లల బ్రతుకెట్లా?: బంధువులతో శ్రీదేవి గోడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
బోని కపూర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంతే ? బంధువులతో శ్రీదేవి గోడు!

రంగుల సినిమా ప్రపంచం... పైకి చూడటానికి ఎంతో అందంగా, ఆనందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. కానీ తెర వెనక కూడా సినీ తారల నిజ జీవితాలు అలాగే ఉంటాయా? అంతే సంతోషంగా వారు రియల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారా? అంటే అందరి విషయాల్లో ఇది నిజమే అని చెప్పడం అబద్దమే అవుతుంది. శ్రీదేవి జీవితమే ఇందుకు ఉదాహరణ.

 పెళ్లి తర్వాత శ్రీదేవి జీవితంలో ఆనందం లేదు

పెళ్లి తర్వాత శ్రీదేవి జీవితంలో ఆనందం లేదు

చిన్నతనం నుండి కష్టాన్నే నమ్ముకున్న శ్రీదేవి తన సంపాదనతో కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చింది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో ఎన్నో ఆస్తులు పోగేసింది. అయితే బోనీ కపూర్‌తో పెళ్లి తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే పెళ్లి తర్వాత ఆమె జీవితంలో ఆనందం మాయం అయింది. ఈ విషయాన్ని స్వయంగా శ్రీదేవి బంధువులు బహిరంగంగా చెబుతున్న మాట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి అమ్మ తరుపు బంధువు, వరుసకు బాబాయ్ అయ్యే వేణుగోపాల్ రెడ్డి పలు సంచలన విషయాలు బయట పెట్టారు.

 బోనీతో పెళ్లి వాళ్ల అమ్మకు ఇష్టం లేదు

బోనీతో పెళ్లి వాళ్ల అమ్మకు ఇష్టం లేదు

బోనీ కపూర్‌తో పెళ్లి శ్రీదేవి అమ్మకు ఇష్టం లేదు. బోనీ ఇంటికి వస్తే రెండు సార్లు కసిరి పంపింది. కానీ ఇద్దరూ అప్పటికే కమిట్ అయిపోయారు. బోనీ కపూర్ పెళ్లి తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మా కుటుంబ సభ్యులమంతా వెళ్లాము. తిరుమల వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటాము. శ్రీదేవి తాను పెద్ద స్టార్ అనే గర్వం తమ పట్ల అసలు చూపించేది కాదు... అని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

 వారికి మాకు లాంగ్వేజ్ సమస్య

వారికి మాకు లాంగ్వేజ్ సమస్య

శ్రీదేవిని కలవడానికి వెళ్లినపుడు భర్త బోనీ కపూర్, పిల్లలను మాకు పరిచయం చేసేది. మేము పలకరిస్తే వారు తిరిగి పలకరించేవారు. వారికి తెలుగు రాదు, మాకు హిందీ రాదు. మా మధ్య పలకరింపులే తప్ప పెద్దగా మాటలు ఉండేవి కాదు అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 అప్పులు నిజమే, అవన్నీ బోనీ చేశాడు

అప్పులు నిజమే, అవన్నీ బోనీ చేశాడు

శ్రీదేవి ఫ్యామిలీకి అప్పులు ఉండేవి, అవి శ్రీదేవి చేసిన అప్పులు కాదు. అవన్నీ బోనీ కపూర్ సినిమాలు చేసి నష్టపోవడం వల్ల ఏర్పడిన అప్పులు. ఆ అప్పులన్నీ శ్రీదేవి ఆస్తులు అమ్మి కవర్ చేశారు.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 ఆస్తులు పోయాయి, పిల్లలకు ఎట్లా అని బాధపడేది

ఆస్తులు పోయాయి, పిల్లలకు ఎట్లా అని బాధపడేది

శ్రీదేవి బాధ అంతా బోనీ అమ్మిన ఆస్తుల గురించే. చెన్నైలో ఉన్న ఇళ్లన్నీ అప్పులు కట్టడానికే అమ్మేశాడు. తన ఇద్దరు కూతుళ్లకు ఎట్లా అని బాధపడేది. శ్రీదేవి జీవితాంతం కష్టపడింది, కష్టపడుతూనే పోయింది. ప్రేక్షకులు నవ్వాలని మొహం మీద నవ్వు ఉంటుందే తప్ప ఆమె మనసులో చాలా బాధ ఉంటుంది అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 బోనీ కపూర్ మొదటి భార్య వల్ల చాలా ఇబ్బంది పడింది

బోనీ కపూర్ మొదటి భార్య వల్ల చాలా ఇబ్బంది పడింది

బోనీ కపూర్ మొదటి భార్య తరుపు నుండి చాలా ఇబ్బందులు ఉన్నాయని మేము వెళ్లినపుడు చెబుతుండేది. చాలా సార్లు వారికి గొడవలు కూడా అయ్యాయి.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 నా బ్రతుకు ఎట్లా, నా పిల్లల బ్రతుకు ఎట్లా అని బాధపడేది

నా బ్రతుకు ఎట్లా, నా పిల్లల బ్రతుకు ఎట్లా అని బాధపడేది

మా వాళ్లు శ్రీదేవిని కలవడానికి పోయినపుడు తన కూతుళ్ల గురించి చాలా బాధ పడింది. బోనీ కపూర్ ఆరోగ్యం బావుండేది కాదు. షుగర్ 500పైనే ఉండేదని, ఆయన పరిస్థితి అలా తయారైందని బాధ పడేది. ఏదైనా అయితే నా బ్రతకు ఎట్లా, నా పిల్లల బ్రతుకు ఎట్లా అని బాధ పడింది..... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 అన్నీ కడుపులోనే దాచుకునేది

అన్నీ కడుపులోనే దాచుకునేది

మొదటి భార్యతో గొడవల గురించి మాకు చెప్పేది కాదు. అన్నీ కడుపులోనే దాచుకునేది. మాకు చెబితే మేము బాధ పడతామని అవన్నీ మా వరకు రానిచ్చేది కాదు... అని వేణు గోపాల్ తెలిపారు.

 బోనీ మాయలో పడింది...

బోనీ మాయలో పడింది...

పెళ్లి తర్వాత శ్రీదేవి బోనీ మాయలో పడిపోయింది. అతడి ఇష్టప్రకారమే నడిచింది. బోనీ కపూర్ గురించే ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా చేసింది. ఆయన అప్పులు తీర్చడానికే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

పైకి బోనీ బాగానే కనిపించేవాడు, కానీ లోపలి విషయం తెలియదు

పైకి బోనీ బాగానే కనిపించేవాడు, కానీ లోపలి విషయం తెలియదు

బోనీ ఫ్యామిలీతో శ్రీదేవి సఫర్ అయింది వాస్తవం, ఫైనాన్షియల్ గా సఫర్ అయింది వాస్తవమే. మాకు తెలిసి బోనీ బాగా చూసుకునే వాడు. లోపల వారి మనస్తత్వాలు ఎలా ఉండేవి? సీక్రెట్స్ మాకు తెలియవు.... అని వేణు గోపాల్ రెడ్డి వెల్లడించారు.

English summary
Sridevi Babai Venugopal Reddy about her after marriage life. Bollywood diva Sridevi was yesterday cremated with full state honours, mourned by millions of fans, at the Vile Parle crematorium.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu