»   » శ్రీదేవి సోదరితో గొడవ ఆస్తి గురించి కాదు, ఆ డబ్బు గురించే, మేమే సెట్ చేశాం!

శ్రీదేవి సోదరితో గొడవ ఆస్తి గురించి కాదు, ఆ డబ్బు గురించే, మేమే సెట్ చేశాం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవికి, ఆమె సోదరికి ఏదో ఆస్తి తగాదాలు ఉన్నాయని కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన విషయాలపై శ్రీదేవి బంధువు వేణు గోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు శ్రీదేవి సినిమాల్లోకి ఎలా వెళ్లింది, చిన్నతనంలో ఆమె జీవితం ఎలా సాగేది.... అనే చాలా విషయాలు ఆయన చెప్పుకొచ్చారు.

100 కోట్ల బీమా, శ్రీదేవి చనిపోతే లాభమెవరికి ? జాతకం ప్రకారం 70 ఏళ్లు ?
 సినిమా రంగంలోకి ఇలా...

సినిమా రంగంలోకి ఇలా...

రంగారావు అనే సినిమా రంగానికి చెందిన వ్యక్తి శ్రీదేవి తల్లికి పరిచయం అయ్యాడు. ఆయన ద్వారా శ్రీదేవి తల్లి రాజేశ్వరి సినిమా ఫీల్డులోకి సైడ్ యాక్టర్ వెళ్లింది. అప్పుడే ఆమెకు సినిమా ఫీల్డు మీద అవగాహన ఏర్పడింది. మన పిల్లలు కూడా సినిమాల్లోకి వెళితే భవిష్యత్ బావుంటుందని శ్రీదేవిని చిన్నతనం నుండే సిద్ధం చేసింది.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

చాలా జాగ్రత్తలు

చాలా జాగ్రత్తలు

శ్రీదేవికి 10 సంవత్సరాల వయసు నుండే ఆమె తల్లి.... తినే తిండి, బట్టల విషయంలో చాలా శ్రద్ధ చూపేది. తొలుత ఓ తమిళ సినిమాలో శ్రీదేవికి అవకాశం వచ్చింది. మంచి పేరు రావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. హీరోయిన్‌గా కూడా ఆమె తిరుగులేకుండా ఎదగడానికి కారణం ఆమె టాలెంటే... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 శ్రీదేవికి వాళ్ల అమ్మవాక్కే బ్రహ్మవాక్కు

శ్రీదేవికి వాళ్ల అమ్మవాక్కే బ్రహ్మవాక్కు

శ్రీదేవికి వాళ్ల అమ్మవాక్కే బ్రహ్మవాక్కు. వాళ్ల అమ్మ మాట కాదని ఒక అడుగు కూడా ముందుకు వేయదు. ఏది తినాలన్న, ఎక్కడికైనా పోవాలన్నా వాళ్ల అమ్మ పర్మిషన్ ఉండాల్సిందే. చాలా క్రమ శిక్షణగా పెంచింది... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 పెద్దగా చదువు లేదు, గ్రేడ్ లేదు

పెద్దగా చదువు లేదు, గ్రేడ్ లేదు

శ్రీదేవికి పెద్దగా చదువు లేదు. చెన్నైలో చిన్నపుడు బడికి వెళ్లేది. సినిమాల్లో బిజీ అయిన తర్వాత టీచర్ ఒకాయన వచ్చి ఇంట్లో చదువు చెబుతుంటే వాడు. కాలేజీలకు, హైస్కూల్ లెవల్ వరకు కూడా పోలేదు. చదువుల్లో గ్రేడ్ అనేది ఆమెకు ఏమీ లేదు... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 సర్జరీలు నిజమే

సర్జరీలు నిజమే

మాకు తెలిసి ఆమె ముక్కుకు మూడు సార్లు సర్జరీ చేయించుకుంది. అది మాత్రమే తెలుసు. ముక్కు పెద్దగా అయిందని అమెరికాలో సర్జరీ చేయించుకుంది.... ఇతర సర్జరీల గురించి మాకు తెలియదు అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 ప్రతి ఏడాది తిరుమలకు

ప్రతి ఏడాది తిరుమలకు

పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి ఆగస్టు 13వ తేదీన ప్రతి సంవత్సరం తిరుమల వచ్చేది. ఆ సమయంలో మేము వెళ్లి కలిసేవారం. ఆగస్టు 15 వరకు తిరుపతిలో ఉండేది. ఇదంతా పెళ్లికి ముందు సంగతి. పెళ్లయిన తర్వాత మేము కొంచెం దూరం అయ్యాం. వాళ్ల అమ్మ ఉన్నంత వరకు ఎక్కువగా వెళ్లేవారం. వాళ్ల అమ్మ పోయిన తర్వాత శ్రీదేవి పూర్తిగా బాంబేకి షిప్ట్ అయింది. అప్పటి నుండి మేము కలవడం కాస్త తగ్గిపోయింది..... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 శ్రీదేవి సోదరితో ఆస్తుల గొడవలు కాదు

శ్రీదేవి సోదరితో ఆస్తుల గొడవలు కాదు

శ్రీదేవి సోదరితో ఆస్తుల గొడవలు అనే వార్తలు నిజం కాదు. అమెరికాలో వాళ్ల అమ్మకు ఒక సైడు చేయాల్సిన ఆపరేషన్ ఇంకో సైడ్ చేశారు. దీంతో ఆమె మతిస్థిమితం కోల్పోయింది. ఆపరేషన్ తప్పు చేశారని తెలిసి కోర్టుకు ఎక్కారు. ఆ సమయంలో నష్టపరిహారంగా కొంత డబ్బు వచ్చింది. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. అపుడు మా బంధువులు అంతా కూర్చుని సెట్ చేశాము...అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 శ్రీదేవి సోదరి భర్త ఎమ్మెల్యే

శ్రీదేవి సోదరి భర్త ఎమ్మెల్యే

శ్రీదేవి సోదరి శ్రీలత భర్త సంజయ్ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఓసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు కూడా.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 చెల్లికి చాలా చేసింది

చెల్లికి చాలా చేసింది

తన చెల్లి శ్రీలతకు శ్రీదేవి ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చింది. అంతకు ముందు ఇచ్చింది. అమెరికా ఆసుపత్రి నుండి నష్టపరిహారం వచ్చాక ఇచ్చింది. తను సంపాదించే దాంట్లో కూడా ఇచ్చేది. మేము ఆమెను ఆర్థిక సాయం ఎప్పుడూ అడగలేదు. అయితే మేము ఇల్లు కట్టుకున్నపుడు మద్రాసు నుండి మినీ లారీలో మార్బుల్స్ మాకోసం పంపారు.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

 అమ్మ ఉన్నంత వరకు బావుంది

అమ్మ ఉన్నంత వరకు బావుంది

శ్రీదేవి అమ్మ ఉన్నంత వరకు ఆమె జీవితం బావుంది. శ్రీదేవి చిన్నపుడు మటన్, చికెన్ బాగానే తినేది. ఆమెకు వాళ్ల అమ్మ స్వయంగా తినిపించేది. శ్రీదేవి సొంతంగా తినగా మేము ఎప్పుడూ చూడలేదు. ఏది తినాలి, తినకూడదు అన్నీ వాళ్ల అమ్మే చూసేది. సర్జరీల తర్వాత తిండి బాగా తగ్గించేసింది. పళ్లు, జ్యూస్ ఎక్కువ తీసుకునేది.... వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

English summary
Sridevi Babai Venugopal Reddy about her childhood life. Bollywood diva Sridevi was yesterday cremated with full state honours, mourned by millions of fans, at the Vile Parle crematorium.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu