»   » పోలీసుల అదుపులో బోనికపూర్.. బిగిస్తున్న ఉచ్చు?.. అరెస్ట్ తప్పదా? శ్రీదేవి మృతిపై ఎన్నో..

పోలీసుల అదుపులో బోనికపూర్.. బిగిస్తున్న ఉచ్చు?.. అరెస్ట్ తప్పదా? శ్రీదేవి మృతిపై ఎన్నో..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi : Cops Question Boney Kapoor, Statement Recorded

అందాల తార శ్రీదేవి ఆకస్మిక మృతి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నది. సహజ మరణం అనుకున్న శ్రీదేవి మృతిపై ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గంట గంటకు ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతూ అనేక సందేహాలకు వేదిక అవుతున్నది. శ్రీదేవి మృతి అంశంలో ఇప్పటి వరకు సానుభూతి సొంతం చేసుకొన్న భర్త బోనికపూర్ వైపే అన్ని వేళ్లు చూపుతున్నాయి. ఈ వ్యవహారంలో బోని ప్రవర్తన తీరు అనుమానాస్పదమవుతున్నది. దీంతో శ్రీదేవి మరణం బోని మెడకు చుట్టుకుంటుందా అనే విధంగా అనేక అనుమానాలకు దారితీయడం ఈ కేసులో కొత్త మలుపుగా మారింది.

పాస్‌పోర్టు స్వాధీనం

పాస్‌పోర్టు స్వాధీనం

శ్రీదేవి మరణంలో అధికారులకు అనేక అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో బోనికపూర్ పాస్ట్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్‌కి బోని ఇప్పుడు వచ్చారు. ఎప్పుడు మళ్లీ భారత్‌కు వెళ్లాడు? ముంబైకి వెళ్లాడా? మరే పట్టణానికి వెళ్లాడా? లేదా ఇతర దేశానికి వెళ్లి వచ్చాడా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

ఫోరెన్సిక్ రిపోర్టు ఇవ్వడానికి కొన్ని గంటల ముందు నుంచి బోనీకపూర్‌ను దాదాపు 3 గంటలపాటు దుబాయ్ పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నుంచి 9గంటల మధ్యలో ఏం జరిగింది? శ్రీదేవి భౌతికకాయాన్ని ఎవరు చూశారు? ఆమెను బయటకు తీసుకురావడానికి ఎవరు సాయపడ్డారు? శ్రీదేవిని టబ్‌‌లో అపస్మారకస్థితిలో చూసిన తర్వాత ఆమెను ఆస్పత్రికి ఎవరెవరు తరలించారు? తదితర ప్రశ్నలతో పాటు అక్కడి పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం.

హోటల్ సిబ్బందిపై అనుమానం

హోటల్ సిబ్బందిపై అనుమానం

సాధారణంగా స్టార్ హోటల్స్‌లో అత్యవసర చికిత్స కోసం వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి. శ్రీదేవిని అచేతనస్థితిలో చూసిన వెంటనే హోటల్ వారికి సమాచారం ఇచ్చారా లేదా అనేది ఈ కేసులో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ హోటల్ వారికి సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

దుబాయ్ ప్రాసిక్యూషన్ అప్పగింత

దుబాయ్ ప్రాసిక్యూషన్ అప్పగింత

శ్రీదేవి మరణంపై ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత సాధారణ అనుకొన్న కేసు క్లిష్టమైన వివాదంగా మారింది. అనుమానాస్పద కేసులను దర్యాప్తు చేసే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్టు అధికారులు వెల్లడించారు. సెలబ్రిటీ కేసు కావడంతో ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఉండటం వలన ఈ అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నట్టు సమాచారం.

 యాక్సిడెంటల్ డ్రౌనింగ్‌పై వివాదం

యాక్సిడెంటల్ డ్రౌనింగ్‌పై వివాదం

సాధారణంగా ఇలా నీటిలో మునిగిపోయి చనిపోయిన కేసులో డ్రౌనింగ్ అనే పదాన్ని వాడుతారు. అయితే విచారణ ఇంకా కొనసాగుతుండగానే యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అనే పదం వాడటంతో వివాదంగా మారింది. ఇప్పటి వరకు శ్రీదేవి మరణం కేసులో ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చారు. అయితే పూర్తిస్థాయి నివేదిక వచ్చేంత వరకు మృతదేహాన్ని ఇవ్వడం కుదరదనే వాదన వినిపిస్తున్నది.

పూర్తిస్థాయి ఫొరెన్సిక్ నివేదిక

పూర్తిస్థాయి ఫొరెన్సిక్ నివేదిక

శ్రీదేవి మరణానికి సంబంధించి పూర్తిస్థాయి ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే కుట్ర జరిగిందా లేదా ప్రమాదవశాత్తు లేదా సహజ మరణమా? అన్నది తేలే అవకాశం కనిపిస్తున్నది. అన్ని అంశాలు నిర్ధారించుకొన్న తర్వాతే శ్రీదేవి పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది.

బోనికపూర్ తీరు అనుమానాస్పదం

బోనికపూర్ తీరు అనుమానాస్పదం

పెళ్లి కోసం దుబాయ్‌ వెళ్లిన బోనీ తన కూతురు ఖుషీతో కలిసి ముంబైకి తిరిగొచ్చారు. ఆ తర్వాత ఖుషీని ముంబైలో వదిలేసి వెంటనే దుబాయ్‌కి వెళ్లారు. ఆ రెండ్రోజులు ఆమె బయటికి రాకుండా గదిలోనే ఉన్నారనే విషయంపై అనుమానం వ్యక్తమవుతున్నాది. దీంతో బోనీ, శ్రీదేవి కాల్ డేటాను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రాసిక్యూషన్ రంగంలోకి దిగడంతో రీ-ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి విచారణ జరుగుతుంది.

విదేశాంగశాఖ ఆరా

విదేశాంగశాఖ ఆరా

శ్రీదేవి కేసు అత్యంత వివాదంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై రాయబార అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. శ్రీదేవి కేసు ప్రతిష్టాత్మకంగా మారడంతో విదేశాంగ శాఖ అక్కడ జరుగుతున్న పరిస్థితులు, చోటుచేసుకొంటున్న ఘటనలపై ఆరాతీసున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ఏదైనా తేలేది మంగళవారమే

ఏదైనా తేలేది మంగళవారమే

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం జరిగే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా దుబాయ్‌లోని ప్రభుత్వ ఆఫీస్‌లలో నాలుగు గంటల తర్వాత ఎలాంటి కార్యకలాపాలు జరుగవు. కాబట్టి మంగళవారమే అనేక అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో అంతా సవ్యంగా సాగితే మంగళవారం సాయంత్రం శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంది.

పోలీసు అదుపులో బోనికపూర్

పోలీసు అదుపులో బోనికపూర్

శ్రీదేవి కేసులో అనుమానాలు నివృత్తి అయితే ఏదైనా జరుగకూడని విషయాలు వెలుగు చూస్తే అవి బోనికపూర్‌కు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం బోనీకపూర్, హోటల్ సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసులో బోనికపూర్ తప్పు ఉన్నట్టు తేలితే అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం ఉంది. పాస్‌పోర్టు స్వాధీనం చేసుకొన్నారంటే చాలా తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుంది.

శ్రీదేవి మరణించి రెండు రోజులు

శ్రీదేవి మరణించి రెండు రోజులు

శ్రీదేవి మరణించి దాదాపు రెండురోజులు జరుగుతున్నా అధికారికంగా బోని మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే కనీసం కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా శ్రీదేవి మరణంపై పెదవి విప్పకపోవడం అనేక అనుమానాలాను రేకెత్తిస్తున్నది.

English summary
According to a report in Khaleej Times, Boney went back to Dubai. In fact, Sridevi was getting ready for a dinner date with him when the tragedy occurred. Boney flew down to Dubai from Mumbai and went to Sridevi's room at the Jumeirah Emirates Towers Hotel. They had a brief conversation before he asked her to have dinner with him. Sridevi went to the washroom to freshen up. When fifteen minutes passed, Boney knocked on the door but received no response. He then forced open the door and was shocked to find his beloved wife lying motionless in the bathtub filled with water.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu