»   » అనుమానాలున్నాయి, శ్రీదేవి డెడ్‌బాడీ ఈ రోజు పంపలేమన్న పోలీసులు.... శ్రీదేవి ఎందుకు రోదించింది?

అనుమానాలున్నాయి, శ్రీదేవి డెడ్‌బాడీ ఈ రోజు పంపలేమన్న పోలీసులు.... శ్రీదేవి ఎందుకు రోదించింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దుబాయ్‌లో అనుమానాస్పదంగా శనివారం మరణించిన ప్రముఖ నటి శ్రీదేవి డెడ్ బాడీ సోమవారం రాత్రికి కూడా భారత్ చేరే అవకాశం కనిపించడం లేదు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన అనంతరం దుబాయ్ పోలీసులు ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ

పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ

శ్రీదేవి కేసు విచారణను దుబాయ్‌ పోలీసులు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు. కేసును మరింత లోతుగా అధ్యయనం చేయడంలో భాగంగానే పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

పోలీసుల వద్దే శ్రీదేవి డెడ్ బాడీ

పోలీసుల వద్దే శ్రీదేవి డెడ్ బాడీ

శ్రీదేవి భౌతికకాయం దుబాయ్‌ పోలీస్‌ ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ వద్దే ఉంది. దర్యాప్తు లోతుగా సాగుతున్న నేపథ్యంలో సోమవారం కూడా ఆమె డెడ్ బాడీ ఇండియా వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఈ రోజు పంపలేమని చెప్పిన ప్రాసిక్యూటర్

ఈ రోజు పంపలేమని చెప్పిన ప్రాసిక్యూటర్

శ్రీదేవి కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ పునః విచారణ చేస్తోంది. శ్రీదేవి మృతిపై మరింత విచారణ అవసరమని, మృతదేహాన్ని ఈరోజు అప్పగించలేమని దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ భారత అధికార ప్రతినిధులకు తెలిపారు.

సౌదీ రాజుతో మంతనాలు

సౌదీ రాజుతో మంతనాలు

శ్రీదేవి భౌతిక కాయం కోసం, ఆమె చివరి చూపు కోసం భారత దేశ సినీ అభిమానులు, ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రతినిధులు, రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అమర్‌సింగ్‌ సౌదీరాజుతో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విచారణ వేగవంతం చేసి వీలైనంత త్వరగా శ్రీదేవి భౌతిక కాయాన్ని పంపిస్తామని సౌదీ రాజు హామీ ఇచ్చారట.

తాజా పరిణామాలతో మరింత ఆందోళన

తాజా పరిణామాలతో మరింత ఆందోళన

దుబాయ్‌లో జరుగుతున్న తాజా పరిణామాలు అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆమె మరణం వెనక ఏమైనా వినకూడని వార్తలేమనా వినాల్సి వస్తుందా? అని అభిమానులు కంగారు పడుతున్నారు.

శ్రీదేవి గురించి షాకింగ్ విషయం చెప్పిన అభిమానులు

శ్రీదేవి గురించి షాకింగ్ విషయం చెప్పిన అభిమానులు

ముంబైలో కొందరు శ్రీదేవి అభిమానులు మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలు బయట పెట్టారు. ఆమె గత ఆరు నెలలుగా ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయానికి తరచూ వస్తున్నారని, ఆ సమయంలో ఆమె చాలా బాధతో కనిపించేదని అంటున్నారు.

శ్రీదేవికి ఏమైనా బాధలు ఉన్నాయా?

శ్రీదేవికి ఏమైనా బాధలు ఉన్నాయా?

శ్రీదేవికి ఏమైనా బాధలు ఉన్నాయా? దేవాలయానికి వచ్చి ఆమె మౌనంగా ఎందుకు రోధించినట్లు.... కొంత కాలంగా శ్రీదేవి ఇంట్లో పరిస్థితి ఏమిటి? ఇలా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
Sridevi Death: Delay in repatriation of body, embalming delayed till tomorrow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu