»   » చివరిశ్వాస వరకు బోని కోసమే.. ప్రేమ కోసం పరితపించిన శ్రీదేవి.. ఆ విషయంతో కంటతడి..

చివరిశ్వాస వరకు బోని కోసమే.. ప్రేమ కోసం పరితపించిన శ్రీదేవి.. ఆ విషయంతో కంటతడి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

గ్లామర్ క్వీన్ శ్రీదేవి ఇకలేరన్న విషాద సంఘటన నుంచి బయటపడటం అభిమానులకు అంతా సాధ్యం కాకపోవచ్చు. శ్రీదేవి మరణం నేపథ్యంలో ఆసక్తికరమైన విషయాలు మీడియలోకి వెలుగులోకి వస్తున్నాయి. భర్త బోని అంటే శ్రీదేవికి ఎంత ఇష్టమో తెలిపే విషయాలను మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. బోనిపై శ్రీదేవి ప్రేమను వ్యక్తం చేస్తూ చేసిన ఓ హావభావం అందర్ని కట్టిపడేస్తున్నది. ఆ వివరాలు మీకోసం.

Boney Kapoor Finally Responds On Sridevi's Loss
వీపుపై సింధూరంతో

వీపుపై సింధూరంతో

2013లో లక్నోలో జరిగిన దుర్గాపూజలో శ్రీదేవి, బోనికపూర్ దంపతులు పాల్గోన్నారు. ఆ కార్యక్రమంలో సింధూర్ మేళా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా తన వీపుపై సింధూరంతో బోనికపూర్ పేరును శ్రీదేవి రాసుకొని తన ప్రేమను వ్యక్తం చేశారు.

 మధురమైన క్షణాలు అవి

మధురమైన క్షణాలు అవి

లక్నో దుర్గాపూజను గుర్తుచేసుకొంటూ.. నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఇప్పటివరకు దుర్గాపూజలో పాల్గొనలేదు. తొలిసారి దుర్గమాత సన్నిధిలో గడిపాను. చాలా సంతోషభరితమైన క్షణాలు అవి అని శ్రీదేవి పేర్కొన్నారు.

 శ్రీదేవి అంటే బోనికి

శ్రీదేవి అంటే బోనికి

శ్రీదేవి అంటే కూడా బోనికి అంతే ప్రేమ ఉండేది. శ్రీదేవి ప్రతిభ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. నటనకు సంబంధించి తారలకు పరిమితి ఉండదు. కానీ ఆమె సాధించలేనిదంటూ ఏమీలేదు అని బోని చెప్పారు.

నటనలో శ్రీదేవి

నటనలో శ్రీదేవి

ఛాల్‌బాజ్‌ నుంచి మిస్టర్ ఇండియా సినిమాలను చూస్తే ఆమె కామెడీ ఓ ప్రత్యేకమైనది. ఇక మామ్‌ చిత్రంలో మెలో డ్రామాతో శ్రీదేవి భావోద్వేగానికి గురిచేసింది. మామ్ రొటీన్ సినిమా అయినప్పటికీ శ్రీదేవి తన నటనతో ఆ చిత్రాన్ని మరోస్థాయికి చేర్చింది.

శ్రీదేవి లాంటి నటి మళ్లీ

శ్రీదేవి లాంటి నటి మళ్లీ

గతంలో వచ్చిన హీరోయిన్లను, ప్రస్తుతం ఉన్న తారలను, రాబోయే తరంలో వచ్చే నటులను పరిగణనలోకి తీసుకొంటే శ్రీదేవి లాంటి నటి మళ్లీ కనిపించదు. నటనలో ఆమెకు ఆమె సాటి అని బోని పేర్కొన్నారు.

చిన్నా, పెద్దా తేడా లేకుండా

చిన్నా, పెద్దా తేడా లేకుండా

సినీ పరిశ్రమలో తన హోదాను నిలబెట్టుకొనేందుకు శ్రీదేవి చేసే కృషి ఎప్పుడూ నన్ను ఆకట్టుకొంటుంది. సెట్స్‌లో ఉన్నప్పుడు వేరే ప్రపంచం ఆమె దృష్టికే రాదు. సహచర నటులతో చాలా గౌరవంగా మాట్లాడేది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికి సమానంగా గౌరవాన్ని ఇచ్చేది. అందుకే ఆ సినిమా పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన ఎక్కడికైనా వెళితే అందరూ లేచి నిలబడేవారు.

 ప్రతీక్షణం నా కోసమే..

ప్రతీక్షణం నా కోసమే..

భార్యగా నన్ను ప్రతిక్షణం నా గురించి, నా ఆనందం గురించి ఆలోచించేది. కుటుంబంలో తన పాత్రను పూర్తిస్థాయిలో ప్రభావవంతంగా పోషించింది. నేను ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా.. దాని వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేది.

 దిగజారినా.. ఉన్నతస్థానంలో ఉన్నా

దిగజారినా.. ఉన్నతస్థానంలో ఉన్నా

కెరీర్ పరంగా నేను పడిపోయినా.. ఉన్నత స్థానంలో నిలిచినా తనకే సంభవించినట్టు బాధపడిపోయేది. సంతోషపడేది. మా ఇద్దరి మధ్యలో ఉండే స్ఫూరిగా చాలా ఆహ్లాదకరంగా ఉండేది.

శ్రీదేవికి దైవభక్తి ఎక్కువ

శ్రీదేవికి దైవభక్తి ఎక్కువ

శ్రీదేవికి దైవభక్తి ఎక్కువ. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని మా ఇంటి నుంచి సిద్ధి వినాయక్ ఆలయం వరకు పాదరక్షలు లేకుండా నడిచివెళ్లేది. నాకు మంచి జరుగాలని ఆమె ఎప్పుడు దేవుడ్ని ప్రార్థించేది.

శ్రీదేవికి షాపింగ్ అంటే..

శ్రీదేవికి షాపింగ్ అంటే..

శ్రీదేవికి షాపింగ్ అంటే చాలా పిచ్చి. అలా అని తన కోసమే ఎప్పుడు కొనుగోలు చేసేది కాదు. అలా అని దుబారాగా ఖర్చు చేసేది కాదు. నా ఆర్థిక పరిస్థితిని చూసి షాపింగ్ చేసేది.

విలాసవంతమైన కారు గిఫ్టు

విలాసవంతమైన కారు గిఫ్టు

ఓ సారి నా బర్త్‌డే కోసం ఓ విలాసవంతమైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ సమయంలో దానిని మెయింటెన్ చేసేంతా ఆర్థిక స్థోమత లేదు. కానీ నేను పాతకారును 9 ఏళ్లుగా వాడటం చూసి ఆ కారును కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చింది.

రిమోట్ ఇచ్చి కూర్చొనేది

రిమోట్ ఇచ్చి కూర్చొనేది

ఇంట్లో టెలివిజన్‌లో నేను ఎక్కువగా స్పోర్ట్స్, న్యూస్ కార్యక్రమాలు చూస్తాను. అవి ఆమెకు ఇష్టం ఉండేవి కాదు. ఒకవేళ తనకు నచ్చిన కార్యక్రమం చూస్తుండగా నేను గదిలోకి వెళితే నాకు రిమోట్ ఇచ్చి నాతో గడుపుతూ ఉండేది.

 తాజ్‌మహల్ కట్టేవాడినే

తాజ్‌మహల్ కట్టేవాడినే

ఒకవేళ నేను షాజహాన్ అయితే తాజ్ మహల్ కట్టి ఉండేవాడిని. ఒకవేళ నేను పెయింటర్ అయితే అందమైన కళాఖండాన్ని వేసేవాడిని. కానీ నేను సినీ నిర్మాతను. అందుకే ఆమెకు ఓ అద్భుతమైన చిత్రాలను తీసి ఇచ్చేందుకు ప్రయత్నించేవాడిని అని బోనికపూర్ తన మనసులో మాటను పంచుకొన్నారు.

English summary
It's still hard to believe that legendary actress Sridevi is no longer with us! Her sudden demise has left a huge void in Indian cinema. The actress was madly in love with her husband Boney Kapoor and their close friends vouch for that. The couple was always by each other's side- be it any family gathering or award functions. We recently came across a throwback picture of Sridevi that's left us choked with emotions
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu