»   » క్రికెట్‌లోకి అడుగు పెడుతున్న శ్రీదేవి!

క్రికెట్‌లోకి అడుగు పెడుతున్న శ్రీదేవి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పటి టాప్ హీరోయిన్ శ్రీదేవి...మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి త్వరలో లైమ్ లైట్లోకి రావాలని చూస్తున్న సంగతి తెలిసిందే. 'ఇంగ్లిష్ వింగ్లిష్" సినిమా ద్వారా ఆమె మళ్లీ తెరపై తళుక్కునడానికి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఫోటో షూట్లు, ర్యాంపు వాకుల్లో జిగేల్ మంటున్న శ్రీదేవి, ఎప్పడెప్పుడా అనే విధంగా అభిమానులను ఊరిస్తోంది.

శ్రీదేవి సినిమా పునరాగమనం విషయం పక్కన పెడితే..... మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న సెల్రబిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)లో శ్రీదేవి, ఆమె భర్త బోణి కపూర్ పెట్టుబడులు పెట్టాలనే యోచనలో ఉన్నారని సమాచారం. ఇందులో భాగంగా బెంగాల్ ప్రాంచైజీని కొనడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తమ ప్రాంచైజీ కోసం మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. బహుషా గంగూలీ ప్లేయర్ గా లేదా, కన్సల్టెంట్ గా పని చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై శ్రీదేవి దంపతుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

English summary
The News is that the Celebrity Cricket League (CCL) has motivated Sridevi and her husband Boney Kapoor and they have reportedly bought the Bangla Franchise.The talk is that Sri and Boney might take the services of former captain Sourav Ganguly for the team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu