»   »  శ్రీదేవి రీ ఎంట్రీ సినిమా...

శ్రీదేవి రీ ఎంట్రీ సినిమా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi
ఒకప్పడు సినీ రంగాన్ని మహారాణిలా యేలిన శ్రీదేవి పెళ్ళి చేసుకుని పరిశ్రమ నుండి తప్పుకుంది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నామె మళ్ళీ ఇన్నాళ్ళకి రీఎంట్రీ ఇవ్వటానికి ఆసక్తి చూపుతోంది. అదీ ఓ రీమేక్ చిత్రం ద్వారా. అది ప్రకాష్ రాజ్ తమిళంలో నటించి,నిర్మించిన 'Mozhi"చిత్రం తోనట. ఈ మధ్యన ఆ చిత్రం చూసిన ఆమె రీమేక్ రైట్స్ తీసుకోమని భర్త బోనీకపూర్ పై ఒత్తిడి తెస్తోందిట. కానీ అందులో హీరోయిన్ పాత్ర చాలా విశిష్టమైంది ఎవరు చేస్తారని అడిగాడుట.

ఎందుకంటే కథ లో హీరోయిన్ మూగ,చెముడు అమ్మాయి. ఆమెతో సంగీతమే ప్రపంచంగా బ్రతికే హీరో ప్రేమలో పడతాడు. అలా సంగీతం వాళ్ళనెలా కలిపిందినేదే కథ. బాగా పేరుతెచ్చుకున్న ఆ పాత్రని జ్యోతిక పెళ్ళికాక ముందు చేసింది. దానికి శ్రీదేవి తానే చేస్తానని చెప్పిందిట. సర్లే భార్య కోరిక తీర్చటం భర్తగా తన భాద్యతగా భావించిన ఆ భర్త ప్రకాష్ రాజ్ ని కలిసాడుట. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే సెట్స్ మీదకు ఈ రీమేక సినిమాను తీసుకెళ్ళానని తాపత్రయంట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X