»   »  సవతి తల్లి శ్రీదేవిపై...అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్

సవతి తల్లి శ్రీదేవిపై...అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi Is My Father's Wife: Arjun Kapoor
ముంబై: స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రోజుల్లో శ్రీదేవి...అప్పటికే పెళ్లయిన నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడటం అప్పట్లో ఒక సంచలనం. శ్రీదేవి మోజులో పడ్డ బోనీ కపూర్ తన మొదటి భార్య మోనా కపూర్‌కు విడాకులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా కాపురం సాగించారు శ్రీదేవి-బోనీ కపూర్.

శ్రీదేవి...బోనీ కపూర్ జీవితంలోకి వచ్చాక ఆయన మొదటి భార్య మోనా కపూర్, పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే వార్తలు సైతం అప్పట్లో షికార్లు చేసారు. బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్, సవతి తల్లి శ్రీదేవికి అస్సలు పడేది కాదనే వార్తలు సైతం అప్పట్లో వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూరే విధంగా తన సవతి మోనాకు, ఆమె పిల్లలకు దూరంగా ఉంటూ వచ్చింది శ్రీదేవి.

అయితే ఇన్నేళ్ల తర్వాత శ్రీదేవి గురించి....తన మనసులోని మాటను బయట పెట్టాడు అర్జున్ కపూర్. కరణ్ జోహార్ పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్ కపూర్ మాట్లాడుతూ.....'శ్రీదేవి కోసం నా తండ్రి బోనీకపూర్ నా తల్లి మోనా కపూర్‌ను విడిచి వెళ్లిపోవడం ఆమెను ఎంతో బాధ పెట్టిందని' చెప్పుకొచ్చాడు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా శ్రీదేవి మూలంగా తమ జీవితాల్లో సంతోషం కరువైందని చెప్పకనే చెప్పాడు అర్జున్.

'అయితే నేను ఇప్పటికీ శ్రీదేవికి రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే ఆమె నా తండ్రిని పెళ్లాడిన వ్యక్తి. మై మదర్ మోనా కపూర్ మమ్మల్ని ఎంతో క్రమ శిక్షణగా పెంచింది. ఎవరి జీవితం వాళ్లదే అయినా...మా తండ్రి వాళ్లతో మరియు మాతో సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను' అని అర్జున్ కపూర్ చెప్పుకొచ్చారు.

English summary
Actor Arjun Kapoor has been in the news lately for his upcoming flick Gunday which seems to be making quite an impression on the people. The Ishaqzaade actor is enjoying the limelight and is working very hard to be a good actor. Th actor got candid and spoke in length about his relations with Sridevi and Boney Kapoor in a popular talk show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu