»   » శ్రీదేవి పాలిట బోనికపూర్ విలన్.. శివగామి పాత్ర చేజారిందిలా..

శ్రీదేవి పాలిట బోనికపూర్ విలన్.. శివగామి పాత్ర చేజారిందిలా..

Written By:
Subscribe to Filmibeat Telugu

అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవడంలో చాలా మంది తారలు పప్పులో కాలేస్తుంటారు. తాజాగా బాహుబలి విషయంలో శ్రీదేవి ఉదంతం ఈ తప్పును చెప్తున్నది. ఎందంతా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 సృష్టిస్తున్న ప్రభంజనం తర్వాత శివగామి పాత్రను శ్రీదేవి వదలుకోవడంపై మీడియాలో చర్చ ఎక్కువగానే జరుగుతున్నది. ఆ పాత్ర కోసం మొట్టమొదటి ఆప్షన్ శ్రీదేవిని అనుకొన్నారట.

Sridevi and boney kapoor

అయితే శ్రీదేవి భర్త బోని కపూర్ కోరిన గొంతెమ్మ కోరికలతో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభూ, ప్రసాద్‌ కంగుతిన్నారట. అందుకే శివగామి పాత్ర కోసం శ్రీదేవి సంప్రదించడమనే ఆలోచనను మానుకొన్నారనేది బాహుబలి చిత్ర యూనిట్‌కు సంబంధించిన కీలక వ్యక్తులు వెల్లడించిన సమాచారం ఇది.

శివగామి పాత్రకు మొదటి ఛాయిస్

శివగామి పాత్రకు మొదటి ఛాయిస్

బాహుబలి2 సినిమా యూనిట్‌కు సంబంధించిన వ్యక్తులు వెల్లడించినట్టు ప్రచారమవుతున్న కథనం ప్రకారం.. శ్రీదేవి గొప్పనటి. అందులో సందేహం లేదు. అమె అంటే ప్రతీ ఒక్కరికి చాలా గౌరవం కూడా. శివగామి పాత్రకు మొదటి ఛాయిస్ ఆమెనే అనుకొన్నారు. ఆ పాత్ర కోసం భర్త బోనికపూర్‌ను సంప్రదించారు. అయితే బోని చేసిన డిమాండ్ తట్టుకోలేక నిర్మాతలు వెనకడుగు వేసి ప్రత్యామ్నాయ నటి కోసం ఆలోచించి రమ్యకృష్ణను ఎంపిక చేశారనేది సమాచారం.

దిమ్మతిరిగే పోయే రెమ్యునరేషన్

దిమ్మతిరిగే పోయే రెమ్యునరేషన్

బోనికపూర్ పెట్టిన షరతులేమింటంటే.. బాహుబలి నిర్మాతల ముందు దిమ్మతిరిగే పోయే రెమ్యునరేషన్ పెట్టాడట. అంతేకాక లాభాల్లో కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాడట. దాంతో ఆ డిమాండ్‌ను తట్టుకోలేక ఆ ఆలోచనను మానుకొన్నారనేది అసలు విషయం.

పులి సినిమాలో

పులి సినిమాలో

బాహుబలిలో శివగామి పాత్ర వదులుకొన్న తర్వాత తమిళంలో విజయ్ నటించిన పులి సినిమాలో నటించారు. ఆ చిత్రంలో రాణి పాత్రను పోషించినందుకు గాను బోని కపూర్ అడిగిన భారీ మొత్తాన్ని నిర్మాతలు ముట్టచెప్పారట. ఆ తర్వాత ఆ సినిమా పరిస్థితి ఏంటో, శ్రీదేవికి పాత్రకు వచ్చిన రెస్సాన్స్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రమ్యకృష్ణను వెతుక్కొంటూ

రమ్యకృష్ణను వెతుక్కొంటూ

శివగామి పాత్రను శ్రీదేవి వదులుకొన్న తర్వాత ఆ పాత్ర రమ్యకృష్ణను వెతుక్కొంటూ వచ్చింది. ఆ పాత్రలో రమ్యను చూసిన వారందరూ ఆమె తప్ప మరొకరు పోషించలేరనే అభిప్రాయం వ్యక్తమైంది. శివగామి పాత్ర బాహుబలి సినిమాకే హైలెట్ అనే రేంజ్‌లో ఆ క్యారెక్టర్‌ను పండించారు. అందుకనే ఆ పాత్ర ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది.

నాకు చాలా ఆశ్చర్యం

నాకు చాలా ఆశ్చర్యం

ఇదిలా ఉండగా శివగామి పాత్రను శ్రీదేవి ఎందుకు నిరాకరించిన విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ శ్రీదేవి ఆ పాత్రను పోషించి ఉంటే ఆమె కెరీర్‌లోనే అద్భుతమైన చిత్రమయ్యేదనే అభిప్రాయాన్ని వర్మ వ్యక్తం చేయడం గమనార్హం. ఒకవేళ ఇంగ్లీష్ వింగ్లీష్ తర్వాత బాహుబలి2 సినిమాను చేసి ఉంటే ప్రభాస్ కంటే ఎక్కువ క్రెడిట్‌ను ఆమె కొట్టేసి ఉండేది అని వర్మ మరో ట్వీట్ చేశాడు.

English summary
Actor Sridevi looses lifetime opportunity to bag the role of Sivagami in Baahubali. So producer dropped the idea immediately. After that that roles goes to Ramya Krishna. After Baahubali Hit, everyone is talking about Sivagami role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu