షాకింగ్ కో-ఇన్సిడెంట్: బోనీ మొదటి భార్య మాదిరిగా, శ్రీదేవి మరణం కూడా అలానే.....

By Bojja Kumar

భారత దేశ సినీ పరిశ్రమ, ప్రతి భారతీయ సినీ అభిమానికి ఆదివారం ఉదయం శ్రీదేవి మరణం వార్త వింటూ నిద్రలేచారు. ఎంతో ఆరోగ్యంగా, హెల్తీగా ఉన్న శ్రీదేవి హఠాన్మరణం చెందడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే శ్రీదేవి మరణం విషయంలో ఓ షాకింగ్ కో-ఇన్సిడెంట్ చర్చనీయాంశం అయింది.

బోనీ మొదటి మోనా కపూర్, రెండో భార్య శ్రీదేవి కపూర్

బోనీ మొదటి మోనా కపూర్, రెండో భార్య శ్రీదేవి కపూర్

నిర్మాత బోనీ కపూర్‌ శ్రీదేవి కంటే ముందు మోనాను పెళ్లాడారు. శ్రీదేవితో ప్రేమలో పడ్డ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు. అయితే మోనా, శ్రీదేవి మరణం సమయంలోని పరిస్థితులు ఒకే విధంగా ఉండటం చర్చనీయాంశం అయింది.

Recommended Video

హార్ట్ ఎటాక్‌‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!
 మోనా కపూర్

మోనా కపూర్

మోనా కపూర్ క్యాన్సర్ వ్యాధి బారిన పడి 2012లో మరణించారు. బోనీ-మోనా కుమారుడు అర్జున్ కపూర్ అప్పుడే ‘ఇషక్‍‌జాదే' సినిమా ద్వారా తెరంగ్రేటం కాబోతున్నాడు. మరో రెండు నెలల్లో తన కుమారుడి సినిమా విడుదల ఉందనగా మోనా మరణించారు. కొడుకును తెరపై హీరోగా చూడక ముందే మోనా కన్ను మూశారు.

శ్రీదేవి కోరిక కూడా తీరలేదు

శ్రీదేవి కోరిక కూడా తీరలేదు

ప్రస్తుతం శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ‘ధడక్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా మరో నాలుగు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే జాహ్నవిని హీరోయిన్‌గా తెరపై చూడక ముందే శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శనివారం అర్ధరాత్రి శ్రీదేవి గుండె పోటుతో మరణించారు.

విధి అంటే ఇదేనా?

విధి అంటే ఇదేనా?

బోనీ కపూర్ ఇద్దరి భార్యల విషయంలో ఒకే విధమైన పరిస్థితులు నెలకొనడం, తమ వారసుల తెరంగ్రేటాన్ని చూడకముందే వారు కన్నుమూయడం ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తోంది.

ఏడుస్తూ షూటింగ్ నుండి వెళ్లిన జాహ్నవి

ఏడుస్తూ షూటింగ్ నుండి వెళ్లిన జాహ్నవి

జాహ్నవి కపూర్ ప్రస్తుతం ‘ధడక్' సినిమా షూటింగులో ఉండగా.... శ్రీదేవి తన చిన్న కూతురు ఖుషితో కలిసి ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారు. తల్లి మరణ వార్త విన్న వెంటనే జాహ్నవి కపూర్ ‘ధడక్' సెట్స్ నుండి ఏడుస్తూ వెళ్లిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X