»   » కరణ్ జోహార్ ‘సోటీ 2’తో శ్రీదేవి కూతురు ఎంట్రీ (ఫోటోస్)

కరణ్ జోహార్ ‘సోటీ 2’తో శ్రీదేవి కూతురు ఎంట్రీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ త్వరలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కరణ్ జోహార్ రెగ్యులర్ గా శ్రీదేవితో మీటింగ్స్ జరుపుతున్నారట. శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారని, అందులో భాగంగానే కరణ్ జోహార్ ఆమెను తరచూ మీట్ అవుతున్నారని టాక్.

అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో తెరకెక్కించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో ఈ ముగ్గురు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. ఇపుడు మంచి అవకాశాలతో బాలీవుడ్లో దూసుకెలుతున్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సెకండ్ పార్టులో ఝాన్వి కపూర్ ను పరిచయం చేయాలనేది కరణ్ జోహార్ ప్లాన్. అయితే శ్రీదేవి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు విని... ఇంకా 'ఎస్' అని కానీ 'నో' అని కానీ చెప్పలేదట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవికి తన కూతురు ఎంట్రీ గుంచిన ప్రశ్న ఎదురైంది. దానికి శ్రీదేవి సమాధానం ఇస్తూ...'నటనారంగంలోకి రావాలని కోరుకోని పిల్లలు ఎవరుంటారు? ప్రతి చైల్డ్ యాక్టర్ కావాలని కలలుకంటాడు. వారు అలా ఆశ పడటంలో తప్పేమీ లేదు. కానీ ఇది అంత సులభమైన జాబ్ కాదు. దీనికి చాలా హార్డ్ వర్క్...అంకితభావం కావాలి. వారు ఈ విషయాల్లో ఎఫర్టు పెట్టడానికి సిద్దమైతే...రావడం మంచిదే! అని సమాధానం ఇచ్చింది.

గతంలో ఝాన్వి కపూర్ పలు సినిమాల్లో నటించబోతోందంటూ వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి. అయితే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమా మాత్రం ఖాయం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్-అమృత సింగ్ కూతురు సారా అలీ ఖాన్, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

షాహిద్, కరీనా, అలియా భట్ నటిస్తున్న 'ఉడ్తా పంజాబ్' చిత్రానికి ఇషాన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఇషాన్ డైట్, ఫిజిక్, గ్రూమింగ్ విషయంలో విషయంలో షాహిద్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. షాహిద్ రికమండేషన్ తోనే అతనికి కరణ్ జోహార్ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

స్లైడ్ షోలో శ్రీదేవి కూతురుకు సంబంధించిన అందమైన ఫోటోస్...

ఝాన్వి కపూర్

ఝాన్వి కపూర్

ఝాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంపై చాలా కాలంగా వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2

కరణ్ జోహార్ సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా ఝాన్వి కపూర్ ఎంట్రీ ఇవ్వనుందని తాజా సమాచారం.

శ్రీదేవితో మీటింగ్

శ్రీదేవితో మీటింగ్

ఈ మేరకు కరణ్ జోహార్ శ్రీదేవితో మీటింగ్స్ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఝాన్వి కపూర్

ఝాన్వి కపూర్

తల్లి మాదిరిగానే ఝాన్వి కపూర్ కు కూడా మంచి అందగత్తె.

త్వరలోనే..

త్వరలోనే..

త్వరలోనే ఝాన్వి కపూర్ ఎంట్రీ విషయంలో ఓ క్లారిటీ రానుంది.

హాట్ పిక్

హాట్ పిక్

ఝాన్వి కపూర్ ప్రస్తుతం యాక్టింగులో కూడా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అంచనాలు

అంచనాలు

ఝాన్వి కపూర్ ఎంట్రీపై బాలీవుడ్లో మాత్రమే కాదు... సౌత్ లోనూ మంచి అంచనాలున్నాయి. శ్రీదేవి కూతురు కావడమే అందుకు కారణం.

తల్లితో కలిసి..

తల్లితో కలిసి..

తల్లి శ్రీదేవితో కలిసి ఝాన్వి కపూర్. శ్రీదేవికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది.

మంచి స్క్రిప్టు కోసం..

మంచి స్క్రిప్టు కోసం..

ఝాన్వికి చాలా అవకాశాలు వస్తున్నా... మంచి స్క్రిప్టు కోసం శ్రీదేవి వెయిట్ చేస్తోంది.

తల్లి, చెల్లి

తల్లి, చెల్లి

తల్లి శ్రీదేవి, చెల్లి ఖుషి కపూర్ తో కలిసి ఝాన్వి కపూర్.

ఫ్రెండ్

ఫ్రెండ్

తన ఫ్రెండ్ తో కలిసి ఝాన్వి కపూర్.... ఇతడే ఆమె బాయ్ ఫ్రెండ్ అనే ప్రచారం కూడా సాగుతోంది.

English summary
We all know Karan Johar is planning to make SOTY 2 and we are all desperately waiting for the movie. Reportedly, Karan is having regular meetings with Sridevi because he wants to sign her daughter Jhanvi for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu