»   » శ్రీదేవి చివరి పుట్టినరోజు..... (ఈ ఫోటోలే ఆఖరి సాక్ష్యం)

శ్రీదేవి చివరి పుట్టినరోజు..... (ఈ ఫోటోలే ఆఖరి సాక్ష్యం)

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణం సినీ ప్రపంచాన్ని, అభిమాన లోకాన్ని విషాదంలోకి నెట్టివేసింది. ప్రస్తుతం శ్రీదేవి మన మధ్య లేక పోయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇండియన్ సినిమా చరిత్రలో, ప్రతి అభిమాని హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. 2017 సంవత్సరం శ్రీదేవి చాలా సంతోషంగా గడిపారు. తన మనసుకు ఎంతో నచ్చిన కథను ఎంచుకుని 'మామ్' సినిమా చేశారు. దీంతో పాటు 2017లోనే తన కూతురు జాహ్నవి సినిమా ఎంట్రీ జరిగింది. గతడేది ఆమె పుట్టినరోజు కూడా ఎన్నడూ లేనంత ఆనందంగా, బాలీవుడ్ టాప్ స్టార్ల మధ్య జరుపుకున్నారు. శ్రీదేవి చివరి పుట్టినరోజుకు సంబంధించి కొన్ని ఫోటో సాక్ష్యాలు అభిమానుల కోసం మరోసారి.

ఐశ్వర్యరాయ్‌తో పాటు ఎంతో మంది ప్రముఖులు

ఐశ్వర్యరాయ్‌తో పాటు ఎంతో మంది ప్రముఖులు

గతడేది ఆగస్టు 13న జరిగిన శ్రీదేవి పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌తో పాటు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీదేవి, ఐష్ కలిసి క్యూట్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

అలనాటి తార రేఖ కూడా

అలనాటి తార రేఖ కూడా

శ్రీదేవి చివరి పుట్టినరోజు వేడుకలో అలనాటి తార రేఖ కూడా పాల్గొన్నారు. అతిలోక సుందరి ఇచ్చిన విందులో పాల్గొని హ్యాపీ మూమెంట్స్ ఆమెతో షేర్ చేసుకున్నారు.

విద్యా బాలన్, రాణి ముఖర్జీ

విద్యా బాలన్, రాణి ముఖర్జీ

గతేడాది జరిగిన శ్రీదేవి పుట్టినరోజు వేడుకలో షబానా అజ్మీ, విద్యా బాలన్, రాణి ముఖర్జీ తదితరులు పాల్గొన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

 శ్రీదేవికి సన్నిహితులు

శ్రీదేవికి సన్నిహితులు

బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా శ్రీదేవికి అత్యంత సన్నిహితుడు. ఆమెకు అత్యంత ఆప్తుల్లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా ఒకరు. ఈ ఇద్దరూ శ్రీదేవి చివరి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు.

శ్రీదేవి మధుర జ్ఞాపకాలు

శ్రీదేవి మధుర జ్ఞాపకాలు

శ్రీదేవి చివరి పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు చూసిన వారంతా.... ఇది తమ అభిమాన తార, అతిలోక సుందరికి సంబంధించిన మధుర జ్ఞాపకాలుగా పేర్కొంటున్నారు.

 లవ్లీ మూమెంట్స్

లవ్లీ మూమెంట్స్

శ్రీదేవి గతంలో ఎన్నడూ లేని విధంగా తన సహచర నటీనటులతో ఎంతో సంతోషంగా గడిపింది. రేఖ, విద్యా బాలన్, రాణి ముఖర్జీ తదితరులతో లవ్లీ మూమెంట్స్ ఎంజాయ్ చేశారు.

ముద్దుల కూతుళ్లు

ముద్దుల కూతుళ్లు

బోనీ కపూర్‌తో పెళ్లి తర్వాత శ్రీదేవి చాలా కష్టాలు పడింది. ఎన్నో బాధలు అనుభవించింది. అయితే తన ఇద్దరు కూతుళ్ల ఆలనా పాలనతో ఆ బాధల నుండి కాస్త ఉపశమనం పొందేవారు. తన కూతుళ్లే సర్వస్వంగా శ్రీదేవి జీవించారు.

కొంతకాలం అందరికీ దూరం

కొంతకాలం అందరికీ దూరం

పెళ్లి తర్వాత శ్రీదేవి కేవలం సినిమాలకు మాత్రమే కాదు... తన సినీ ఇండస్ట్రీ స్నేహితులకు కూడా దూరమయ్యారు. చాలా కాలం తర్వాత అంతా కలిసి గతేడాది ఆమె బర్త్ డే సందర్భంగా హ్యాపీగా గడిపారు.

క్యూట్ పిక్

క్యూట్ పిక్

రాణి ముఖర్జీ, శ్రీదేవి మధ్య ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఫోటో చాలు.

 భర్త బోనీ కపూర్

భర్త బోనీ కపూర్

శ్రీదేవిని బోనీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెను ఆరాధించాడు. పెళ్లి తర్వాత తన మొదటి భార్య వల్ల శ్రీదేవికి కొన్ని ఇబ్బందులు పడ్డా బోనీ అండగా ఉండేవారట.

శ్రీదేవి అరుదైన ఫోటోస్: తల్లిదండ్రులు, సోదరి, ఇతర బంధువులతో....

శ్రీదేవి అరుదైన ఫోటోస్: తల్లిదండ్రులు, సోదరి, ఇతర బంధువులతో....

మనం ఇప్పటి వరకు శ్రీదేవి ఫోటోలు వేలల్లో చూసుంటాం. భర్త, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉన్న ఫోటోస్ వందల్లో చూసుంటాం. కానీ శ్రీదేవి తన తల్లిదండ్రులు, సోదరి, ఇతర బంధువులతో కలిసి ఉన్న ఫోటోలు కనిపించడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఫోటోలను ఫిల్మీబీట్ ప్రేక్షకుల కోసం సేకరించాం. ఈ ఫోటోలు చూస్తే భర్త బోనీతో సంబంధం లేకుండా శ్రీదేవికి ఇంత పెద్ద కుటుంబం ఉందా? అని ఆశ్చర్యపోక తప్పదు.

తల్లిదండ్రులు, సోదరి, ఇతర బంధువులతో....శ్రీదేవి అరుదైన ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

English summary
Bollywood actress Sridevi passed away following an accidental drowning in a bathtub in her hotel room in Dubai on February 24. Sridevi, who was 54, celebrated her last birthday in August 2017. Fashion designer Manish Malhotra had kept a lavish party for the legendary actress at his residence. Aishwarya Rai Bachchan, Rani Mukerji and Vidya Balan were present at the bash to make Sridevi's day even more special. Now, she has left a void in the industry that can never be filled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu