twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్లోకి శ్రీదేవి మృతదేహం.. ఆ రాత్రి ఏం జరిగింది? హైడ్రామా.. అనిల్ అంబానీ పాత్రేంటి?

    By Rajababu
    |

    Recommended Video

    Sridevi Returns Home: What Happened Inside The House

    ఐదు దశాబ్దాలకుపైగా వెండితెరను ఏలిన శ్రీదేవి ఆకస్మిక మరణంతో కోట్లాది సినీ ప్రేక్షకులను కన్నీటి సాగరంలో మునిగిపోయారు. ఫిబ్రవరి 24న రాత్రి 11.30 గంటలకు శ్రీదేవి దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం రాత్రి శ్రీదేవి మృతదేహం ఇంటికి చేరుకొన్న తర్వాత జరిగిన సంఘటనలను డీఎన్‌ఏ ప్రతినిధి వెల్లడించారు. అవి మీ కోసం...

     ఆ రాత్రి ఏం జరిగిందంటే

    ఆ రాత్రి ఏం జరిగిందంటే

    అర్ధరాత్రి శ్రీదేవి మృతదేహం అంధేరిలోని గ్రీన్ ఎకర్స్ నివాసంలోకి చేరగానే రోదనలు మిన్నంటాయి. ఇంట్లో వాతావరణం గంభీరంగా మారిపోయింది. సాధారణ ప్రజల ఇంట్లో ఉండే మాదిరిగానే శ్రీదేవి ఇంట్లో ఏడుపులు, పెడబొబ్బలు వినిపించాయి. ఇంట్లోకి ఇతరులను వెళ్లకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ రాత్రికి శ్రీదేవి తన ఫ్యామిలీతోనే ఉంటుంది. ఆమెను మాతోనే ఉండేలా చూడండి అనే మాటలు వినిపించాయి.

    శ్రీదేవిని అందంగా ముస్తాబు

    శ్రీదేవిని అందంగా ముస్తాబు

    ఎప్పుడూ చిరునవ్వులు చిందించే శ్రీదేవిని చూడటానికి వేలాది మంది అభిమానులు వస్తారు. వారిని నిరాశపరచవద్దు. స్పోర్ట్స్ సెలబ్రేషన్ క్లబ్‌కు వెళ్లే ముందే శ్రీదేవిని అందంగా ముస్తాబు చేశారు. శ్రీదేవిని అందంగా అలకరించే బాధ్యతను కపూర్ కుటుంబ సభ్యులు తీసుకొన్నారు. ఆమె చివరి ప్రయాణాన్ని మధురమైన ఘట్టంగా మలిచేందుకు ప్రతీ ఒక్కరు తన వంతు సహకారాన్ని అందించారు.

    అనిల్ కపూర్ భార్య మేనకోడలు

    అనిల్ కపూర్ భార్య మేనకోడలు

    అనిల్ కపూర్ భార్య సునీత మేనకోడలు పూనమ్ శ్రీదేవి నివాసాన్ని మల్లెపూలతో అందంగా అలంకరించింది. ఆ ఇంట్లో వర్కర్లు కంటతడితోనే తమ పనిలో మునిగిపోయి కనిపించారు. ఓ వైపు ఇంట్లో అలంకరణ పనులు జరుగుతుంటే మరోవైపు అభిమానులు బయట విషాదంలో మునిగి శ్రీదేవిని చూసేందుకు ఎదురుచూశారు.

    సల్మాన్ ఖాన్ రాకతో

    సల్మాన్ ఖాన్ రాకతో

    శ్రీదేవి భౌతికకాయాన్ని చూసేందుకు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అభిమానులు కేరింతలు కొట్టడంతో ఒక్కసారి విషాదం మాయమైంది. కాసేపు సల్మాన్‌ను చూసి ఆనందంలో మునిగిపోయిన ఫ్యాన్స్ మళ్లీ శ్రీదేవి విషాదంలో మునిగారు.

     కొత్త బంధువు అనిల్ అంబానీ

    కొత్త బంధువు అనిల్ అంబానీ

    బోనికపూర్ మేనల్లుడు మొహిత్ మార్వా వివాహం కోసం శ్రీదేవి దుబాయ్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కోడలు ఆంత్రా మోతీవాలా వివాహం మొహిత్‌తో జరిగింది. దాంతో బోని, అంబానీలు బంధువులు అయ్యారు. శ్రీదేవి మృతి నేపథ్యంలో అనిల్ అంబానీ రంగంలోకి దిగారు.

     ప్రత్యేక విమానం పంపిన అనిల్

    ప్రత్యేక విమానం పంపిన అనిల్

    అనిల్ అంబానీ అవసరమైన ప్రతీ పనినిభుజాన వేసుకొన్నారు. శ్రీదేవి మృతదేహాన్ని భారత్‌కు రప్పించడానికి ప్రత్యేకంగా 13 సీట్ల జెట్ విమానాన్ని పంపించారు. శ్రీదేవి మృతదేహం ముంబై చేరుకొన్న తర్వాత అనిల్ అంబానీ స్వయంగా కారు నడుపుకుంటూ దేహాన్ని ఇంటికి చేర్చే పనిని చేశారు.

    అదిత్య చోప్రా బాధ్యతలు

    అదిత్య చోప్రా బాధ్యతలు

    విలే పార్లే‌లోని పవన్ హాన్స్ శ్మశానవాటిక వద్ద అంతిమ సంస్కారాల ఏర్పాట్లను యాష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా పర్యవేక్షించారు. శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి సంరక్షణ బాధ్యతలను, సెక్యూరిటీ, ఇతర పనులను కూడా దర్శకుడు కరణ్ జోహర్ తీసుకొన్నారు.

    బంధువులకు ఇబ్బంది..

    బంధువులకు ఇబ్బంది..

    మంగళవారం రాత్రి బోనికపూర్‌ను పరామర్శించడానికి వచ్చే వారికి సెక్యూరిటి నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా కరణ్ జోహర్ దగ్గరుండి చూసుకొన్నారు. రాత్రంతా పనిలో మునిగి అన్నీతానై వ్యవహరించాడు కరణ్ జోహర్.

    లక్షల విలువైన పూలతో

    లక్షల విలువైన పూలతో

    సెలబ్రేషన్ క్లబ్, ఇతర ప్రాంతాలను అలంకరించడానికి లక్షల విలువైన మల్లెపూలను తెచ్చారు. అంతిమయాత్ర వాహనాన్ని, ఇతర ప్రాంతాలను అందంగా అలంకరించారు.

    English summary
    Bollywood bid adieu to its first female superstar, Sridevi, on Wednesday (28 Feb) evening. She died of accidental drowning in her hotel bathtub after losing consciousness. Thousands of grieving fans gathered in Mumbai for her funeral. An insider recently revealed to DNA what happened inside the Kapoor house in the last 24 hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X