For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sridevi Soda Center twitter review: సుధీర్ బాబు ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే? హిట్టా ఫట్టా?

  |

  సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత భారీగా రిలీజైన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. పలాస ఫేమ్ కరుణాకర్ దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన ఈ చిత్రం ఇటీవల కాలంలో ఏ చిత్రం రిలీజ్ కానంతగా థియేటర్లలో రిలీజైంది. అయితే భారతీయ కాలమానం ప్రకారం అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ ప్రదర్శనలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే.. .

   అమెరికా, ఆంధ్రాలో ప్రీమియర్లు

  అమెరికా, ఆంధ్రాలో ప్రీమియర్లు

  శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం అమెరికాలోనే కాకుండా ఆంధ్రాలోని పలు చోట్ల రాత్రి అడ్వాన్స్ షోలు ప్రదర్శిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రి నుంచి స్పెషల్ షోలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ మంచి రెస్సాన్స్ వచ్చింది. విడుదలైన ప్రతీ చోట నుంచి సానుకూలమైన రెస్పాన్స్ వస్తున్నది.

  థియేటర్ ఎక్సీపిరియెన్స్ కోసమే

  శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం గురించి సుధీర్ బాబు ట్వీట్ చేస్తూ.. థియేటర్ ఎక్సీపిరియెన్స్ కోసం రూపొందించిన టైలర్ మేడ్ సినిమా ఇది. కంటెంట్, కమర్షియల్ హంగుల పరంగా ఉన్నతమైన ప్రాజెక్ట్. మిమ్మల్ని సంతృప్తి పరిచి ఆనందం కలిగిస్తామనే గ్యారెంటీ ఇస్తున్నాం. సినిమాను పండుగలా.. థియేటర్లలో ఓ వేడుకగా జరుపుకోండి అంటూ సుధీర్ బాబు ట్వీట్ చేశారు.

  మ్యాజిక్, కొత్త అనుభూతిని కలిగిస్తుందని..

  శ్రీదేవి సోడా సెంటర్ సినిమా గురించి విక్టరీ వెంకటేష్ స్పందిస్తూ... ఈ సినిమా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ అందరికి గుడ్ లక్. వెండి తెరపైన మ్యాజిక్‌ను, సరికొత్త అనుభూతిని పొందండి అంటూ వెంకటేష్ ట్వీట్ చేశారు.

  ప్రభాస్‌తో ఆ రోజు అలా..

  శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమాకు ప్రభాస్ బాగా ప్రమోట్ చేశారు. ప్రభాస్ మధ్య అనుబంధం ఎలాంటిదనే విషయాన్ని సుధీర్ బాబు ట్వీట్ చేస్తూ.. నేను, ప్రభాస్, దేవీ శ్రీ ప్రసాద్ ముగ్గురం కలిసి వర్షం సినిమా రిలీజ్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లి వర్షం పోస్టర్‌ను చూసి వచ్చాం. తిరిగి వస్తూ.. టాంక్ బండ్‌పై కూర్చొని వర్షం పాటలు వింటూ ఎంజాయ్ చేశాం అని సుధీర్ బాబు తెలిపారు.

  ఫస్టాఫ్ వేరి గుడ్ అంటూ

  ఫస్టాఫ్ వేరి గుడ్. సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ సూపర్. ఎక్సలెంట్ ఫోటోగ్రఫి, బ్యూటీఫుల్ సాంగ్స్, గ్రేట్ బీజియం అంటూ నెటిజన్ కామెంట్ చేశారు.

  బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ

  అమెరికాలో గురువారం రాత్రి ప్రీమియర్స్ మొదలయ్యాయి. శ్రీదేవి సోడా సెంటర్ పక్కా కమర్షియల్ హిట్. అమెరికా నుంచి సూపర్ పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి. సుధీర్ బాబు నుంచి మాస్ హిట్. బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.

  Sridevi Soda Center : కథలో నిజాయితీ ఉంటే.. ఎవ్వడూ ఏం చెయ్యలేడు Director Karuna Kumar

  హిట్ రావాలంటూ నెటిజన్లు కోరిక

  శ్రీదేవి సోడా సెంటర్ గురించి నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మనోళ్లు పెట్టిన ఎఫర్ట్‌కు హిట్ రావాలి. సినిమా యూనిట్ అందరికి సూపర్‌స్టార్ ఫ్యాన్స్ టీమ్ గుడ్ లక్.

  తెర వెనుక, తెర ముందు
  నటీనటులు : సుధీర్ బాబు. ఆనంది, పావెల్ నవగీతన్, నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్షవర్ధన్
  దర్శకుడు : కరుణ కుమార్
  నిర్మాతలు : విజయ్ చిల్లా , శశి దేవిరెడ్డి
  సంగీత దర్శకుడు : మణిశర్మ
  ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
  సినిమాటోగ్రాఫర్: శ్యామ్ దత్
  రిలీజ్ డేట్: 2021-08-21

  English summary
  Sridevi Soda Center twitter review: Sudheer Babu rocks with his performance: This movie is released on August 27 worldwide.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X