»   » బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు ఎఫైర్, హద్దుదాటతోందని శ్రీదేవి అప్ సెట్, వార్నింగ్

బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు ఎఫైర్, హద్దుదాటతోందని శ్రీదేవి అప్ సెట్, వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : మాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అని యక్త వయస్సులోకి వచ్చిన మగపిల్లలు పాటలు పాడుకుంటున్నట్లుగానే ఆడపిల్లలు కూడా మేం వయస్సుకు వచ్చాం...మాకొక బోయ్ ఫ్రెండ్ కావాలి అంటూండటం సహజం. దానికి తోడు సెలబ్రెటీ పిల్లలు ..బోయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయటం పేజ్ త్రి సర్కిల్స్ లో స్టేటస్ సింబల్ గా మారింది.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే...తెరపై ఎన్నో ప్రేమ కథలను చూసి, నటించి, తన నిజ జీవితంలోనూ ప్రేమ వివాహం చేసుకున్న శ్రీదేవి ఇప్పుడు తన పెద్ద కుమార్తె ప్రేమ వ్యవహారంపై మండిపడుతోంది. ముఖ్యంగా తన కుమార్తె డేటింగ్ వ్యవహారం మీడియాకు ఎక్కటం అసలు నచ్చటంలేదని బాలీవుడ్ మీడియా అంటోంది.

రీసెంట్ గా శ్రీదేవి కూతురు జాన్వి వార్తల్లో నిలిచింది. జాన్వి తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్‌ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరు లిప్‌ టు లిప్‌ కిస్‌ చేసుకున్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఈ విషయమై శ్రీదేవి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిందనే విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.

గౌరవానికి తక్కువ లేదు

గౌరవానికి తక్కువ లేదు

వాస్తవానికి శ్రీదేవి, బోనీ కపూర్‌ దంపతుల పిల్లలు జాన్వి కపూర్‌, ఖుషీ కపూర్‌కు స్టార్‌ కిడ్స్‌గా హిందీ సినీ పరిశ్రమలో చాలామంచి పేరుంది. దానికి తోడు తండ్రి పెద్ద నిర్మాత, తల్లి ఇప్పటికీ నటిస్తున్న నటి కావటంతో వీరు ఎక్కడికి వెళ్లినా అంతా గౌరవిస్తూంటారు.

సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు

సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు

దానికి తోడు టీనేజ్ లోకి ఎంటరైన యుక్తవయస్సుకు వస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సోషల్‌ మీడియాలో ఫొటోలు పెడుతూ , ఎప్పటికప్పుడు తమ అప్ డేట్స్ ఇస్తూ అభిమానులను పోగు చేసుకోవటం కూడా ముచ్చట గొలిపే అంశమే. అయితే అవన్నీ వేరు, బోయ్ ఫ్రెండ్ తో డేటింగ్ వ్యవహారం వేరుకదా.

ఆ లిప్ లాక్ కిస్ పెట్టినోడు ఎవరంటే..

ఆ లిప్ లాక్ కిస్ పెట్టినోడు ఎవరంటే..

ఇంతకీ శ్రీదేవి కుమార్తె తో డేటింగ్ చేస్తూ ...అంతలా పబ్లిక్ గా లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్న కుర్రాడు ఎవరూ అంటే... ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్‌ షిండే మనవడు అయిన శిఖర్‌తో తన కూతురు డేటింగ్‌ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదట.

రూల్స్ పెట్టిన శ్రీదేవి

రూల్స్ పెట్టిన శ్రీదేవి

జాన్వి, శిఖర్‌ ముద్దుపెట్టుకున్న ఫొటోలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న శ్రీదేవి.. కూతురికి కొన్ని కఠినమైన రూల్స్ విధించిందని ముంబై మిర్రర్‌ పత్రిక ఓ కథనంలో తెలిపింది. కెరీర్ మొదలెట్టాల్సిన సమయంలో ఇలాంటివన్నీ పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చిందని చెప్తున్నారు.

బోయ్ ఫ్రెండ్స్ వద్దే వద్దు

బోయ్ ఫ్రెండ్స్ వద్దే వద్దు

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న జాన్వి అస్సలు కుర్రాళ్లతో స్నేహం చేయవద్దని, డేటింగ్‌ చేయడం సంగతి దేవుడెరుగు అస్సలు బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నా నేను అంగీకరించబోనని కూతురికి గట్టిగా చెప్పినట్టు పేర్కొంది.

తన కెరీర్ లాగే..

తన కెరీర్ లాగే..

ఒక్కప్పటి అందాల హీరోయిన్ గా, జగదేక సుందరిగా రాణించిన శ్రీదేవి సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో ప్రతిదానికి తల్లి సలహా ఆధారంగా నడుచుకుంది. ఇప్పుడు తన కూతురి విషయంలోనూ అదే సంప్రదాయం కొనసాగాలని ఆమె తాపత్రయపడుతున్నట్టు సన్నిహితులు చెప్తున్నారు.

ఇవన్నీ కామన్

ఇవన్నీ కామన్

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇంకా సినిమా రంగంలోకి అడుగు పెట్టక పోయినా....సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో మీడియా ఆమె ఎక్కడ కనిపించినా అత్యుత్సాహం చూపిస్తోంది. ఈ కాలం పిల్లల్లో ఇవన్నీ కామన్ అని శ్రేదివికు ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారట.

అవన్ని చదివే శ్రీదేవి ఇలా..

అవన్ని చదివే శ్రీదేవి ఇలా..

ఈ వయసులోనే జాన్వి కపూర్ బాయ్ ఫ్రెండును మెయింటేన్ చేయడం, అతనితో దిగిన ఫోటోలు పోస్టు చేయడం బట్టి చూస్తే వ్యవహారం ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చుని మీడియా అంటోంది. ఇంట్లో వారి నుండి కూడా జాన్వికి స్వేచ్ఛ కాస్త ఎక్కువే లభించినట్లు ఆమె యాటిట్యూడ్ బట్టి అర్థమవుతోందని కథనాలు రాస్తున్నారు. ఆ కథనాలు చదివే శ్రీదేవికు మండికొచ్చింది అని చెప్తున్నారు.

ఈ ఏజ్ లోనే ఇంతలా

ఈ ఏజ్ లోనే ఇంతలా

ఈ వయసులోనే జాన్వి కపూర్ ఈ రేంజిలో రెచ్చిపోతోందంటే... రేపు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాక ఆమె ఇంకెలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో? అని మరికొందరు అంటున్నారు. ఎఫైర్స్ లేని బాలీవుడ్ ని ఊహించగలమా...ఇలాంటి విషయాల్లో జాన్వి చూస్తూంటే పిహెచ్ డినే చేసేటట్లు ఉందే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

అంత లేదు..నిప్పు లేనిదే..

అంత లేదు..నిప్పు లేనిదే..

అయితే ఇదంతా కేవలం రూమరే అని కొందరుకొట్టిపారేస్తూంటే....అంత లేదు..నిప్పు లేనిదే పొగ పుట్టదు కదా..మీడియా కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇస్తోందేమో కానీ..నిజానికి బోయ్ ఫ్రెండ్ తో ముద్దులు నిజం.తల్లిగా అది శ్రీదేవికు అది నచ్చకపోవటం నిజం. మందలింపు అనేది కామన్. జాగ్రత్తలు కూడా చెప్పటం లో కూడా వింతేముంది అంటున్నారు మరికొందరు

బోయ్ ఫ్రెండ్ తక్కవవాడేమీ కాదు

బోయ్ ఫ్రెండ్ తక్కవవాడేమీ కాదు

జాహ్నవి కపూర్ మెయింటైన్ చేస్తున్న బోయ్ ఫ్రెండ్...తక్కువవాడు కాదు. ముంబై ధీరూభాయ్ అంబాని ఇంటర్నేషనల్ , బోంబే స్కాటిష్ స్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేసారు. ఆ తర్వాత లండన్ లో రెగెంట్ యూనివర్సిటీలో గ్రాడ్యువేషన్ పూర్తి చేసారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు.

ఫర్మిషన్ లేకుండా

ఫర్మిషన్ లేకుండా

జాన్వి కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తన ఫోటోలు ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలు అప్ డేట్ చేస్తూనే ఉంటారు. అయితే తన పర్మిషన్ లేకుండా అడ్డదిడ్డంగా ఫోటోలు తీస్తే అవి సరిగా రావు, ఆ ఫోటోల్లో తాను గ్లామరస్ గా కనిపించక పోవచ్చు అనే భావనతో ఆమె ఓ సారి బాడీ గార్డ్ ల సాయింతో ఫోటో గ్రాఫర్స్ ని చెదరకొట్టి, వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

శ్రీదేవి ఖండిస్తోంది

శ్రీదేవి ఖండిస్తోంది

జాన్వి కపూర్ త్వరలో బాలీవుడ్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె తల్లి శ్రీదేవి మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ ఆ ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం జాన్వి తన చదువుమీదనే ఫోకస్ పెట్టిందని, చదువు పూర్తయిన తర్వాతే ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అని చెబుతూ వస్తున్నారు.

ఎంట్రీ ఖరారు దాంతో

ఎంట్రీ ఖరారు దాంతో

శ్రీదేవి, బోనికపూర్ పెద్ద కుమార్తె అయిన జాన్వి తాజాగా లాస్‌ఏంజెలెస్‌లోని ప్రఖ్యాత లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరింది. జాన్వికి సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని, ఫ్యాషన్ డిజైనింగ్‌లో తన కెరీర్‌ను కొనసాగిస్తుందని శ్రీదేవి గతంలో చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం జాన్వి యాక్టింగ్ స్కూల్లో చేరడంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖాయమైంది.

బాలీవుడ్ బ్యాచ్ అంతా..

బాలీవుడ్ బ్యాచ్ అంతా..

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ ఓల్డ్ స్టూడెంటే. జాన్వికి ఇప్పటికే బాలీవుడ్ ఆఫర్లు కుప్పులు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అయితే ఓ మంచి సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని జాన్వి భావిస్తున్నట్టు సమాచారం.

ఓ ప్రక్కన సోదురుడు హీరోగా..

ఓ ప్రక్కన సోదురుడు హీరోగా..

రెండో కపూర్ కుటుంబం నుంచి వస్తున్న ఐదో కపూర్ జాన్వినే. అనిల్ కపూర్, సంజయ్ కపూర్, సోనమ్ కపూర్, సోదరుడు అర్జున్ కపూర్ తర్వాత జాన్వివి ఇప్పుడు బాలీవుడ్‌లో కాలుమోపనుంది. బాలీవుడ్‌లో జరిగే దాదాపు అన్నికార్యక్రమాలకు శ్రీదేవి తన ఇద్దరు కుమార్తెలు జాన్వి, కుషితో కలిసి హాజరవుతున్న విషయం తెలిసిందే.

కరుణ్ జోహార్ తో రహస్య చర్చలు

కరుణ్ జోహార్ తో రహస్య చర్చలు

కరుణ్ జోహార్..తన తదుపరి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో ఆమెను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయమై శ్రీదేవి, కరుణ్ జోహార్ మధ్య సీక్రెట్ మీటింగ్ జరిగిందని చెప్తున్నారు. గతంలో జాహ్నవిని సౌత్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే శ్రీదేవి వాటిని ఖండించింది. ఆమె ప్రస్తుతం తన స్టడీస్ మీద కాన్సర్టేట్ చేయమని శ్రీదేవి స్ట్రిక్ట్ గా చెప్పిందట. మరి జాహ్నవి ఏమంటుందో చూడాలి.

నటిగా ప్రూవ్ చేసుకోమని..

నటిగా ప్రూవ్ చేసుకోమని..

జాహ్నవిని సరైన ప్రాజెక్టుతో లాంచ్ చేయాలని శ్రీదేవి భావిస్తోంది. అలాగే శ్రీదేవి తన కుమార్తె కు ముందు స్టార్ డమ్ కాదు నటిగా ప్రూవ్ చేసుకుంటే బావుంటుందని భావిస్తోందిట. ఇప్పటికే చాలా కథలు జాహ్నవి కోసం శ్రీదేవి విన్నదట . తన కుమార్తె కోసం శ్రీదేవి ..యూత్ ఎంటర్టైనర్ ని ఎంపిక చేయాలనుకుంటోంది. అయితే తల్లి ఎలాంటి కథ ఓకే చేస్తుందో అని భయపడుతోందిట

బయిట బ్యానర్ లోనే..

బయిట బ్యానర్ లోనే..

అలాగే తను ఆ రోజుల్లో చేసిన ఓ సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయాలని శ్రీదేవి భావిస్తోందిట. కానీ తన సొంత బ్యానర్ లో సినిమా చెయ్యాలని బోనీ కపూర్ భావించలేదట. తొలి చిత్రం బయిట బ్యానర్ లో చేస్తే ఆ గుర్తింపే వేరు అని బోని బావిస్తున్నాడట. మరో ప్రక్క జాహ్నవి లాంచింగ్ కు కరుణ్ జోహార్ ప్రయత్నాలు చేస్తున్నాడట . ఏవి ఎలా ఉన్నా..తమ కుమార్తె తొలి చిత్రం హిట్, ఫట్ కన్నా..రిలీజైందని అందరికీ తెలిసేలా భారీ పబ్లిసిటీ శ్రీదేవి కోరుకుంటోందిని బాలీవుడ్ వర్గాల కథనం.

అన్ని జాగ్రత్తలు తీసుకునే..

అన్ని జాగ్రత్తలు తీసుకునే..

తన కుమార్తె దగ్గరకు కొన్ని డైరక్ట్ గా ఆఫర్స్ వస్తున్నాయట. కంగారుపడి ఓకే చేయవద్దని చెప్తోందిట శ్రీదేవి. తన కుమార్తె లో నటిని బయిటకు తీసే కథ కావాలని శ్రీదేవి పదే పదే చెప్తోందిట . మరో ప్రక్క జాహ్నవి ..ఇప్పటికే సినిమాకు సంభందించిన పలు శాఖలపై పూర్తి అవగాహన ఉంది. ట్రైనింగ్ అవసరం అనుకుంటే తన కుమార్తెని ఇతర దేశాలకు పంపి నటనలో ట్రైనింగ్ ఇప్పిస్తోంది. కానీ బయిటకు వదిలితే కెరీర్ లో ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి శ్రీదేవి తన సంరక్షణలోనే ఏమైనా జరగాలని భావిస్తోందిట .

English summary
Sridevi's elder daughter Jhanvi Kapoor has already garnered a lot of fans and followers because of her impeccable style statement and fun-filled pictures on Instagram. She is almost like an internet sensation .If you remember, a few kissing pictures of Jhanvi with her boyfriend .Shikhar Pahariya went viral on the social media. Now, as per a popular tabloid, we hear that mom Sridevi is upset with Jhanvi Kapoor's affair and wants her to solely focus on her career!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu