»   » ఆ సినిమాలు రీమేక్ చేస్తే బావుంటుంది : శ్రీదేవి

ఆ సినిమాలు రీమేక్ చేస్తే బావుంటుంది : శ్రీదేవి

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : ఇటీవల బాలీవుడ్‌లో రీమేక్‌ల హంగామా ఎక్కువగా కనిపిస్తోంది. మీరు నటించిన చిత్రాల్ని రీమేక్‌ చేస్తే ఎలా ఉంటుందని శ్రీదేవిని అడిగితే... ''నా చిత్రాల్ని రీమేక్‌ చేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 'లమ్హే', 'చాందిని' తదితర చిత్రాల్ని రీమేక్‌ చేస్తే బాగుంటుందని నా సలహా'' అన్నారు. అప్పట్లో 'లమ్హే', 'చాందిని' చిత్రాలు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ తరంలో రీమేక్ చేస్తే ఎవరు హీరోయిన్ గా చెయ్యాలనేది చర్చ జరుగుతోంది.

  పదిహేనేళ్ల తరవాత 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌' సినిమాతో రెండో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు శ్రీదేవి. దర్శకుడు ఆర్‌.బల్కి భార్య గౌరీ షిండే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తుండటంతో శ్రీదేవి చాలా ఆనందంగా ఉన్నారు. ఆమె చెబుతూ ''నా అభిమానులు ఇంకా నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. అందుకే 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'కి అంతలా ఆదరణ దక్కింది. భవిష్యత్తులో మంచి కథలతో ఎవరైనా సంప్రదిస్తే... నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాన''ని అన్నారు. ఇక ''నా కూతురు జాహ్నవి వెండి తెరపై ఎప్పుడు కనిపించబోతోందని ఎక్కడికెళ్లినా అందరూ అడుగుతున్నారు. ఆ విషయం గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు''ని శ్రీదేవి తేల్చి చెప్పారు.

  ప్రస్తుతం శ్రీదేవి నటించిన హిమ్మత్ వాలా చిత్రం రీమేక్ అవుతోంది. 1981లో విడుదలైన 'ఊరికి మొనగాడు' (కృష్ణ, జయప్రద) సినిమా తెలుగులో తిరుగులేని విజయం సాధించింది. ఇదే సినిమాను జితేంద్ర, శ్రీదేవితో దర్శకేంద్రుడు హిందీలో నిర్మించారు. ఈ సినిమాకు అప్పట్లో కాసుల వర్షం కురిసింది. అదే సినిమాను అజరుదేవగన్‌తో తిరిగి నిర్మిస్తూ, దక్షిణాదిలో స్థిరపడిన తమన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. విశేషం ఏమంటే శ్రీదేవి 'హిమ్మత్‌ వాలా' సినిమాతోనే బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసింది.

  సినీ ప్రేక్షకులను, పరిశ్రమనూ తన అందం, అభినయంతో మెప్పించి పదేళ్లపాటు పరిశ్రమలో నిలిచిపోయింది. తాజాగా తమన్నా హిమ్మత్‌ వాలా సినిమాతో శ్రీదేవి స్థాయి ఇమేజ్‌ను సంపాదించగలదా అనేది సినీ అభిమానుల్లో ఒక చర్చానీయాంశంగా మారింది. అప్పట్లో మ్యూజికల్‌ హిట్‌ సాధించిన 'హిమ్మత్‌వాలా' ఇప్పుడు సాజిద్‌ఖాన్‌ దర్శకత్వంలో రీమేక్‌ అవుతోంది. మరి ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా మెప్పించగలదేమో ఎదురు చూద్దాం అంటున్నారు విమర్శకులు.

  English summary
  Comeback queen Sridevi is said to be busy reading scripts, to sign her second flick after English Vinglish, which got tremendous response from all quarters. She stated that she has no issues if her yesteryear blockbuster flicks like Lamhe, Chandni are remade. She further added, that she is also ready to be part of those films, in some way.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more