»   » వైరల్ వీడియో : శిల్పా శెట్టితో శ్రీదేవి..పగలబడి నవ్వుతూ, ఎమోషనల్ అయిన శిల్పా!

వైరల్ వీడియో : శిల్పా శెట్టితో శ్రీదేవి..పగలబడి నవ్వుతూ, ఎమోషనల్ అయిన శిల్పా!

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి జ్ఞాపకాలు మరచిపోలేనివి. వెండితెరపై అద్భుతమైన చిత్రాల్లో నటించిన శ్రీదేవి భారీతీయులందరికి తీపి జ్ఞాపకంగా మారింది. అభిమానులకు ఆమె అందాల అతిలోక సుందరి అయితే, సహచర నటులకు ఆమె మంచి స్నేహితురాలు. పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టికి కూడా శ్రీదేవి మంచి స్నేహితురాలు. శ్రీదేవి మరణించడంతో ఆమె జ్ఞాపకాలని ఒక్కరుగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజగా శిల్పా శెట్టి సోషల్ మీడియాలో శ్రీదేవితో గడిపిన ఓ వీడియోని పోస్ట్ చేసారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

శ్రీదేవి వాళ్లకు మంచి స్నేహితురాలు

శ్రీదేవి వాళ్లకు మంచి స్నేహితురాలు

శ్రీదేవి అభిమానులకు అందాల అతిలోక సుందరి అయితే, సహచర నటులకు మాత్రం ఆమె మంచి స్నేహితురాలు. శ్రీదేవికి బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లో మంచి స్నేహితులు ఉన్నారు.

 ఒక్కొకరుగా బయట పెడుతున్నారు

ఒక్కొకరుగా బయట పెడుతున్నారు

శ్రీదేవి సాధించిన విజయాల్ని, ఆమె ప్రత్యేకతల్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కాగా ప్రముఖులంతా ఆమెతో గడిపిన క్షణాలని అభిమానులతో పంచుకుంటున్నారు.

శ్రీదేవిని గుర్తు చేసుకున్న శిల్పా శెట్టి

పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి శ్రీదేవి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. మామ్ చిత్ర విడుదల సమయంలో శ్రీదేవితో తాను గడిపిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అది కాస్త నెటిజన్లలో వైరల్ గా మారింది.

 కరణ్ జోహార్ విందు

కరణ్ జోహార్ విందు

శ్రీదేవికి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా మంచి స్నేహితుడు. దీనితో మామ్ చిత్ర విడుదల సమయంలో శ్రీదేవిని, శిల్పా శెట్టిని, మనీష్ మల్హోత్రాని కరణ్జోహార్ తన ఇంటికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేసారు.

 పగలబడి నవ్వుతూ

పగలబడి నవ్వుతూ

శ్రీదేవి, శిల్పా శెట్టి ఆ విందు కార్యక్రమంలో నవ్వుతూ కళకళలాడుతూ కనిపించారు శ్రీదేవితో గడిపిన ఆ మధుర క్షణాలని ప్రేమతో ఎప్పటికి గుర్తుపెట్టుకుంటా అని శిల్పా శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం విశేషం.

ఫాన్స్ ఆవేదన

ఫాన్స్ ఆవేదన

అందంగా నవ్వుతూ సరదాగా కనిపిస్తున్నా శ్రీదేవి.. ఆ చిరునవ్వులు ఇప్పుడు మాయమైపోయాయని సోషల్ సోషల్ మీడియాలో ఫాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Sridevi with Shilpa Shetty video goes viral.Shilpa Shetty remembers Sridevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu