»   » శ్రీహరి ఏడ్చేస్తారు, నాకు సంతోషం లేదు: రాజమౌళి

శ్రీహరి ఏడ్చేస్తారు, నాకు సంతోషం లేదు: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి ఈ రోజు 40వ వసంతంలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆయన పుట్టిరోజున సంతోషంగా లేరు. కారణం ప్రముఖ నటుడు శ్రీహరి మరణించడమే. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞత తెలిపిన రాజమౌళి తాను సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు.

మగధీర చిత్రంలో శ్రీహరి ఎంతో గొప్పగా నటించారు. ఆయన ఇక లేరనే విషయం తెలుసుకుని షాకయ్యాను. ఆయన చాలా సున్నిత మనస్కులు. ఏదైనా సింపుల్ సెంటిమెంటు సీన్ చెప్పినా వెంటనే ఆయన కళ్ల వెంట నీళ్లు వస్తాయి. ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నానను. ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీర్చలేనిది అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Rajamouli

శ్రీహరి హఠాన్మరణం అందరినీ తెలుగు సినిమా పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. ముంబై లీలావతి ఆసుపత్రి నుంచి శ్రీహరి మృతదేహం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకోగానే....చివరి చూపుకోసం సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన ఇంటి దారిపట్టారు. ఆయన మృతదేహం నివాళులు అర్పిచేందుకు వచ్చిన దాసరి నారాయణరావు, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి తదితరులు కన్నీటి పర్యంతం అయ్యారు.

చిరంజీవి, కృష్ణం రాజు, రామ్ చరణ్ తేజ్, దిల్ రాజు, కొరటాల శివ, వివి వినాయక్, శ్రీను వైట్ల, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, దర్శకుడు ఎన్ శంకర్, విష్ణు, మంచు లక్ష్మి, నల్లమలుపు బుజ్జి, సుమన్, పరుచూరి గోపాలకృష్ణ, తరుణ్, వందే మాతరం శ్రీనివాస్, జగపతి బాబు, ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు తదితరులు నివాళులు అర్పిచారు.

English summary
Thanks a lot for all your wishes.But couldn’t really rejoice with the sudden news of Srihari garu. It is quite shocking. He was a great Support on screen for magadheera. Even more bigger morale booster off screen.He is so sensitive.narrate him a simple sentimental scene,tears will roll down his eyes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu